మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో రాబోతున్న `గ్లోబ్ ట్రోటర్` మూవీ ఈవెంట్ ఈ నెల 15న ఆర్ఎఫ్సీలో జరుగుతుంది. ఈ ఈవెంట్‌కి సంబంధించిన రూల్స్, కండీషన్స్ ని రాజమౌళి తెలిపారు.
మహేష్ బాబు హీరోగా రాజమౌళి రూపొందిస్తున్న `గ్లోబ్ ట్రోటర్` ఈవెంట్‌కి మరో రెండు రోజులే ఉంది. ఈ శనివారం(నవంబర్ 15) సాయంత్రం రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ ఈవెంట్‌ని భారీగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో ఈ సినిమాకి సంబంధించిన టైటిల్‌ని ప్రకటించబోతున్నారు. అదే సమయంలో టీజర్‌ని కూడా విడుదల చేస్తారని తెలుస్తోంది. ఇందులో ఈ సినిమా కథని చెప్పబోతున్నారు, ఏ జోనర్‌లో మూవీ ఉంటుంది? ఏం చూపించబోతున్నామనేది రాజమౌళి వివరిస్తారు. ఆయన తన ప్రతి సినిమాకి ఇదే చేస్తుంటారు. అదే సమయంలో ఈ చిత్రానికి సంబంధించి రిలీజ్ ప్లాన్, హాలీవుడ్ ప్రొడక్షన్స్ తో కలిసి పనిచేయడం, ఇందులో నటించే ఆర్టిస్ట్ లు, టెక్నీషియన్ల వివరాలను కూడా వెల్లడించే అవకాశం ఉంది.
24
అంచనాలు పెంచిన `గ్లోబ్ ట్రోటర్` ఫస్ట్ లుక్స్
`గ్లోబ్ ట్రోటర్` సినిమాకి ముందు నుంచే అంచనాలు ఏర్పడ్డాయి. ఇటీవల విడుదల చేసిన పృథ్వీరాజ్ సుకుమారన్ `కుంభ` పాత్ర ఫస్ట్ లుక్ ఆ అంచనాలను మరింత పెంచింది. మరోవైపు శృతి హాసన్ పాడిన `సంచారి` పాట సైతం మరింతగా ఆకట్టుకునేలా ఉంది. మహేష్ బాబు పాత్రని ప్రతిబింబించేలా ఈ పాట సాగింది. ఇంకోవైపు బుధవారం ప్రియాంక చోప్రా పాత్రని రివీల్ చేశారు. ఇందులో ఆమె మందాకిని అనే పాత్రలో నటించబోతుంది. ఆమె లుక్ కూడా అదిరిపోయేలా ఉంది. ఈ రోజుగానీ, రేపు(శుక్రవారం)గానీ మహేష్ బాబు ఫస్ట్ లుక్ ని విడుదల చేయబోతున్నారు రాజమౌళి. దానికోసం మహేష్ ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.
34
గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌కి రాజమౌళి కండీషన్స్
ఇదిలా ఉంటే ఈ నెల 15న జరిగే ఈవెంట్‌కి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యూలేషన్స్ వెల్లడించారు రాజమౌళి. ఇటీవల దేశంలో పలు అనూహ్యమైన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. బాంబ్ బ్లాస్టింగ్స్, తొక్కిసలాట ఘటనలు కలవరపెడుతున్నాయి. దీంతో `గ్లోబ్ ట్రోటర్` ఈవెంట్‌కి కూడా పోలీసులు కొన్ని కండీషన్స్ పెట్టారట. ఆర్‌ఎఫ్‌సీలో జరిగే ఈవెంట్‌కి ఎలా వెళ్లాలనేది రాజమౌళి వివరించారు. ఆర్‌ఎఫ్‌సీ మెయిన్ గేట్ క్లోజ్ అవుతుందని, విజయవాడ నుంచి వచ్చే వారు ముందే లెఫ్ట్ తీసుకుని అనాజ్ పుర్ నుంచి రావాలని తెలిపారు. మరోవైపు సిటీ నుంచి వచ్చే వాళ్లు ఔటర్ రింగ్ రోడ్డ వద్ద రైట్‌కి వెళ్లి సంఘీ టెంపుల్ రూట్ నుంచి రావాలని తెలిపారు. ఈ మేరకు అక్కడ రూట్ సూచించే బోర్డ్ లు ఉంటాయని, వాటిని ఫాలో కావాలని తెలిపారు.
దీంతోపాటు ఈ ఈవెంట్ ఓపెన్ ఈవెంట్ కాదని, కేవలం పాస్‌లు ఉన్నవాళ్లు మాత్రమే రావాలని తెలిపారు. ఫిజికల్‌గా పాస్ లు లేని వారికి అనుమతి లేదన్నారు. మరోవైపు 18 ఏళ్ల లోపు వారికి, సీనియర్ సిటిజన్స్ కి పోలీసులు అనుమతి ఇవ్వలేదని, వాళ్లు రావద్దని, ఇంట్లో జియో హాట్ స్టార్‌లో లైవ్‌లో చూసుకోవచ్చని తెలిపారు. ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో పోలీసులు చాలా కఠినంగా వ్యవహరించబోతున్నారని, కాబట్టి ఈ రూల్స్ ని ఫాలో కావాలని రాజమౌళి తెలిపారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో వీడియోని విడుదల చేశారు. మొత్తంగా చాలా రూల్స్ తో ఈ ఈవెంట్‌ని నిర్వహించబోతున్నారు.