`కాంత` మూవీ ఫస్ట్ రివ్యూ.. మాస్టర్‌ పీస్‌, దుల్కర్‌ సల్మాన్‌కి నేషనల్‌ అవార్డు పక్కా

Published : Nov 13, 2025, 01:10 PM IST

దుల్కర్‌ సల్మాన్‌, రానా, భాగ్య శ్రీ బోర్సే నటించిన లేటెస్ట్ మూవీ `కాంత` మరి కొన్ని గంటల్లోనే ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌ రివ్యూ వచ్చేసింది. 

PREV
16
దుల్కర్‌ సల్మాన్‌ `కాంత` మూవీ ఫస్ట్ రివ్యూ

దుల్కర్‌ సల్మాన్‌ `మహానటి` చిత్రంతో తెలుగు ఆడియెన్స్ కి పరిచయం అయ్యారు. `సీతారామం`తో హిట్‌ కొట్టారు. ఇటీవల `లక్కీ భాస్కర్‌`తో మరో హిట్‌ని తన ఖాతాలో వేసుకున్నారు. ఇప్పుడు హ్యాట్రిక్‌ కొట్టేందుకు వస్తున్నారు. ఆయన హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ `కాంత`. తమిళంలో రూపొందిన ఈ చిత్రాన్ని అదే పేరుతో ఈ నెల 14న తెలుగులోనూ విడుదల చేస్తున్నారు. సెల్వమణి సెల్వరాజ్‌ దర్శకత్వం వహించారు. ఇందులో రానా దగ్గుబాటి, సముద్రఖని కీలక పాత్రలు పోషించారు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా చేసింది. మరి కొన్ని గంటల్లో ఆడియెన్స్ ముందుకు రాబోతున్న ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ రివ్యూ బయటకు వచ్చేసింది.

26
`కాంత` మూవీ స్టోరీ బ్యాక్‌ డ్రాప్‌ ఇదే

 1950లో సినిమా బ్యాక్‌ డ్రాప్‌లో ఈ మూవీ సాగుతుందట. ఇది కంప్లీట్ గా ఫిక్షనల్ కథ అని, ఇప్పుడు స్టూడియోలో ఏదైనా జరిగితే ఇమ్మీడియట్ గా అందరికీ తెలిసిపోతుంది. కానీ ఇలాంటి కథలు అప్పట్లో చాలా జరిగాయి. చాలా తక్కువ మందికే అవి తెలిసేవి. ఆ కాలం నుంచి ఇన్స్పిరేషన్ పొంది రాసిన కథ.   ఒక ఇన్సిడెంట్ అని చెప్పలేం. డార్క్ సైడ్ ఆఫ్ గ్రేట్ పీపుల్ అని చెప్పొచ్చు. ఒక ఇద్దరు గొప్ప వ్యక్తులు వాళ్ళ ఆర్టిస్ట్ బ్రిలియన్స్ కోసం గొడవలు పడిన నేపథ్యం చాలా ఆసక్తికరంగా ఉంటుంద`ని ఇటీవల రానా తెలిపారు. 

36
`కాంత` మూవీ ట్విట్టర్ రివ్యూ

తమిళంలో ఇప్పటికే సినిమాని ప్రదర్శించారు. అక్కడి నుంచి పాజిటివ్‌ రెస్పాన్స్ వస్తోంది. సినిమా చూసిన క్రిటిక్స్ ట్విట్టర్ ద్వారా పోస్ట్ లు పెడుతున్నారు. వాటి ప్రకారం ఈ సినిమాలో దుల్కర్‌ టీకే మహదేవన్‌ పాత్రలో కనిపిస్తారట. సినిమా ఫస్ట్‌ ఆఫ్‌ ఇంట్రెస్టింగ్‌గా సాగుతుందని, నెక్ట్స్ ఏం జరుగుతుందనే క్యూరియాసిటీని క్రియేట్‌ చేస్తుందని కోలీవుడ్ క్రిటిక్స్ వెల్లడించారు. సెకండాఫ్‌ చాలా గ్రిప్పింగ్‌గా ఉంటుందని, ట్విస్ట్ మాత్రం అదిరిపోతుందని, క్లైమాక్స్ ఎమోషనల్ గా ఉంటుందన్నారు. ఇందులో దుల్కర్ నటన చాలా పీక్‌లో ఉంటుందని చెబుతున్నారు. భాగ్యశ్రీ బోర్సే కూడా కట్టిపడేస్తుందని, రానా పాత్ర ఫన్నీగా, ఎనర్జిటిక్‌గా ఉంటుందని, ఆయన ఇన్వెస్టిగేటర్‌గా కనిపిస్తారని చెబుతున్నారు. జేమ్‌ బిజోయ్‌ మ్యూజిక్‌   సినిమాని నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లిందట. డ్రామా, ఎమోషన్స్ మేళవించిన ఒక రోలర్‌ కోస్టర్‌ అంటున్నారు. దుల్కర్‌ సల్మాన్‌ నటించిన చిత్రాల్లో ఇది బెస్ట్ గా నిలుస్తుందన్నారు.

46
దుల్కర్‌ సల్మాన్‌కి నేషనల్‌ అవార్డు

ప్రముఖ క్రిటిక్‌ రమేష్‌ బాలా తన రివ్యూ ఇస్తూ, ఫస్ట్ ఆఫ్‌ డ్రామా అద్భుతంగా ఉందని,సెకండాఫ్‌ ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్, డ్రామా కట్టిపడేస్తుందన్నారు. ఇది 1950లో మద్రాస్‌ సినిమా ఇండస్ట్రీలో జరిగిన అంశాలను ప్రతిబింబిస్తుందని తెలిపారు. దుల్కర్‌కి నేషనల్ అవార్డు పక్కా అంటున్నారు. రానా, సముద్రఖని, భాగ్యశ్రీ బోర్సే ఎక్స్ లెంట్‌గా యాక్ట్ చేశారని చెప్పారు. మరికొందరు చెబుతూ, ఫస్టాఫ్‌లో ఈగో క్లాషెస్‌ని చూపించారని, ఇదొక మంచి థియేట్రికల్‌ ఎక్స్ పీరియెన్స్ ని అందించే మూవీ అవుతుందన్నారు. సముద్రఖని పాత్ర హీరోకి పోటీగా ఉంటుందని చెబుతున్నారు. భాగ్యశ్రీలోని అసలైన నటి బయటకు వచ్చిందని అంటున్నారు. మరికొందరు దీన్ని మాస్టర్ పీస్‌ గా వర్ణిస్తున్నారు.

56
వరల్డ్ క్లాస్‌ టేకింగ్‌

మర్డర్‌ మిస్టరీ డ్రామా అదిరిపోయిందని, సినిమా నెరేషన్‌ కట్టిపడేస్తుందని, స్క్రీన్‌ప్లే హైలైట్‌గా నిలుస్తుందని, సీట్‌ ఎడ్జ్ లో కూర్చొని చూసేలా మూవీ ఉంటుందంటున్నారు. ఆర్టిస్ట్ ల పవర్‌ హౌజ్‌ పర్‌ఫెర్మెన్స్, మ్యూజిక్‌, కెమెరా వర్క్, బీజీఎం, ఎమోషన్స్, డ్రామా, దర్శకుడి టేకింగ్‌ ఇలా అన్ని బాగా కుదిరాయని, సినిమా చూస్తున్నంతసేపు మరో ప్రపంచంలోకి వెళ్లిపోతామని చెబుతున్నారు. వరల్డ్ క్లాస్‌ మూవీగా వర్ణిస్తున్నారు.

66
`కాంత` ఒక మాస్టర్‌ పీస్‌

మొత్తంగా `కాంత` మూవీ ఒక మాస్టర్‌ పీస్‌, ఎపిక్‌ మూవీగా చెబుతున్నారు తమిళ క్రిటిక్స్. అద్బుతమైన చిత్రంగా వర్ణిస్తున్నారు. జాతీయ అవార్డులు కొల్లగొట్టే మూవీ అవుతుందని సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. అయితే తమిళ క్రిటిక్స్ ఇటీవల కాలంలో ప్రతి సినిమాకి ఓవర్‌ రేటెడ్‌గా వర్ణిస్తున్నారు. కానీ వాస్తవంగా అవి ఆ స్థాయిలో బాక్సాఫీసు వద్ద సత్తా చాటలేకపోతున్నాయి. మరి `కాంత` మూవీని కూడా అద్భుతం అంటున్నారు. నిజంగానే ఆ స్థాయిలో ఉంటుందా లేదా అనేది మరికొన్ని గంటల్లోనే తేలనుంది. ఈ సాయంత్రం నుంచే తెలుగులో ప్రీమియర్స్ పడుతున్నాయి. అయితే తమిళ ఆడియెన్స్ కి కనెక్ట్ అయ్యే సినిమాలు తెలుగు ఆడియెన్స్ కి అంతగా కనెక్ట్ కావు, పైగా ఇది తమిళ సినిమాకి సంబంధించిన కథ, తెలుగు ఆడియెన్స్ కి ఎంత వరకు కనెక్ట్ అవుతుందనేది కొన్ని గంటల్లోనే తేలనుంది, అంత వరకు ఏషియానెట్‌ రివ్యూ కోసం వెయిట్‌ చేయండి.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories