ఓ స్టార్ హీరోతో నటించిన 9 మంది హీరోయిన్ల కెరీర్ దాదాపుగా ముగిసింది. అల్లు అర్జున్ తో వీరు నటించిన చాలా చిత్రాలు విజయం సాధించాయి. అయినప్పటికీ టాలీవుడ్ లో వాళ్ళ కెరీర్ నిలబడలేదు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గంగోత్రి చిత్రంతో కెరీర్ ప్రారంభించి ఇప్పుడు పుష్ప 2 తో పాన్ ఇండియా స్థాయిలో తిరుగులేని హీరోగా అవతరించారు. ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీ దర్శకత్వంలో పాన్ వరల్డ్ సినిమాలో నటిస్తున్నారు. అల్లు అర్జున్ కెరీర్ బిగినింగ్ నుంచి గమనిస్తే..బన్నీతో నటించిన చాలా మంది హీరోయిన్లు ఇప్పుడు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. మరికొందరు హీరోయిన్ల ప్రభావం తగ్గిపోయింది. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
210
అదితి అగర్వాల్
అదితి అగర్వాల్ అల్లు అర్జున్ తో గంగోత్రి చిత్రంలో నటించింది. ఆ మూవీ సూపర్ హిట్. కానీ అదితికి అంతగా అవకాశాలు రాలేదు. ఇండస్ట్రీకి దూరమైంది.
310
అను మెహతా
ఆర్య చిత్రంలో అల్లు అర్జున్, అను మెహతా జంటగా నటించారు. ఈ చిత్రం సూపర్ హిట్ అయింది. అయినా కూడా అను మెహతా టాలీవుడ్ లో ఎక్కువ కాలం కొనసాగలేకపోయింది.
గౌరి ముంజల్ బన్నీ చిత్రంలో అల్లు అర్జున్ తో రొమాన్స్ చేసింది. వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సూపర్ హిట్. ఈ మూవీ తర్వాత కొన్ని సినిమాలు మాత్రమే చేసిన గౌరి టాలీవుడ్ లో ఫేడ్ అవుట్ అయింది.
510
జెనీలియా
జెనీలియా, అల్లు అర్జున్ జంటగా హ్యాపీ మూవీలో నటించారు. కరుణాకరన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం విజయం సాధించలేదు. జెనీలియా కొంత కాలం టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా కొనసాగారు. ఆ తర్వాత టాలీవుడ్ కి దూరమయ్యారు.
610
హన్సిక
దేశముదురు చిత్రంలో హన్సిక గ్లామర్ కి యువత ఫిదా అయ్యారు. దేశముదురు తర్వాత హన్సికకి చాలా ఆఫర్స్ వచ్చాయి. కానీ ప్రస్తుతం హన్సిక అంతగా సినిమాల్లో నటించడం లేదు.
710
షీలా కౌర్
షీలా కౌర్ పరుగు చిత్రంతో యువతని మాయ చేసింది. ఈ మూవీలో షీలా హోమ్లీగా మెరిసింది. పరుగు చిత్రం మంచి విజయం సాధించింది. ఆ తర్వాత షీలా కొన్ని చిత్రాల్లో నటించి ఇండస్ట్రీకి దూరమయ్యారు.
810
భాను శ్రీ మెహ్రా
భాను శ్రీ మెహ్రా వరుడు చిత్రంలో అల్లు అర్జున్ తో నటించింది. ఆ మూవీ డిజాస్టర్ కావడంతో భాను శ్రీకి క్రేజీ ఆఫర్స్ రాలేదు. కొన్ని చిన్న సినిమాల్లో మాత్రమే నటించింది.
910
దీక్షా సేథ్
వేదం చిత్రంలో దీక్షా సేథ్ అల్లు అర్జున్ తో నటించారు. ఆ మూవీ విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. కానీ దీక్షా సేథ్ ఎక్కువ కాలం టాలీవుడ్ లో కొనసాగలేదు.
1010
ఇలియానా
ఒకప్పుడు ఇలియానా టాలీవుడ్ లో టాప్ హీరోయిన్. అల్లు అర్జున్ తో జులాయి మూవీలో నటించింది. కెరీర్ పీక్ లో ఉన్నప్పుడే ఇలియానా బాలీవుడ్ కి వెళ్లి కెరీర్ నాశనం చేసుకుంది.