టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు - దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పాన్ వరల్డ్ మూవీ వారణాసి. గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తోన్న ఈసినిమా షూటింగ్ ఎలాంటి హడావుడి లేకుండా.. కామ్ గా పూర్తవుతోంది. జక్కన్న ఈసారి చాలా స్పీడ్ గా సినిమాను కంప్లీట్ చేసే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది.
ఆయన కెరీర్ లోనే ఈసినిమా సూపర్ ఫాస్ట్ గా పూర్తి చేసిన రికార్డ్ సాధించబోతుంది. షూటింగ్ అయితే అయిపోతుంది కానీ.. ఇప్పటి వరకూ ఈసినిమా లో మహేష్, ప్రియాంక, పృథ్వీరాజ్ సుకుమారన్ తప్పించి, ఇతర పాత్రలపై రాజమౌళి ఎటుంటి అధికారిక ప్రకటన చేయలేదు, క్లారిటీ కూడా ఇవ్వలేదు.