రాజా సాబ్ 10వ రోజుల కలెక్షన్స్, ప్రభాస్ సినిమాకు బాక్సాఫీస్ కష్టాలు

Published : Jan 19, 2026, 01:25 PM IST

 ప్రభాస్ రాజాసాబ్  సినిమా భారీ అంచనాల మధ్య  రిలీజ్ అయ్యింది.. అనుకున్నంత సక్సెస్ సాధించలేకపోయింది.  ఈ హారర్-కామెడీ సినిమా.. వసూళ్లు పడిపోతూ, 150 కోట్ల మార్క్ చేరడానికి కష్టపడుతోంది.

PREV
13
రాజా సాబ్ 10వ రోజుల కలెక్షన్స్

రాజా సాబ్ జనవరి 9న సంక్రాంతి కానుకగా భారీ అంచనాలతో విడుదలై, మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల వసూళ్లను దాటింది. కానీ, వసూళ్లు పడిపోతూ 10వ రోజుకి 2.50 కోట్లకు చేరాయి. మొత్తం నెట్ కలెక్షన్ 139.25 కోట్లు మాత్రమే వచ్చాయి. 

23
వీకెండ్ తర్వాత కలెక్షన్లు దారుణం

పెయిడ్ ప్రివ్యూల తర్వాత, రాజాసాబ్ మొదటి రోజు మంచి వసూళ్లు సాధించింది. కానీ తర్వాత వసూళ్లు తగ్గుతూ వచ్చాయి. వీకెండ్ తర్వాత కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి. ఈ తగ్గుదల సినిమా లైఫ్‌టైమ్ బిజినెస్‌పై ప్రభావం చూపుతోంది.

33
ప్రభాస్ సినిమాకు కలెక్షన్ల కష్టాలు..

10వ రోజు ఆక్యుపెన్సీ డేటా రాసాసాబ్ సినిమా వేగం తగ్గినట్టు చూపిస్తుంది. తెలుగులో సగటు ఆక్యుపెన్సీ 28% ఉండగా, హిందీలో కేవలం 11% మాత్రమే ఉంది. ఇది ప్రాంతీయ ప్రేక్షకులకే సినిమా పరిమితం అయినట్టు సూచిస్తుంది. మరి రాజాసాబ్ ఫైనల్ రన్ ఎక్కడివరకూ వచ్చి ఆగిపోతుందో చూడాలి. 

Read more Photos on
click me!

Recommended Stories