వై దిస్ కొలవెరి డి సాంగ్ వెనకున్న కథ..
'వై దిస్ కొలవెరి డి' సక్సెస్ ఎంత గొప్పదో, దాని వెనకున్న కథ కూడా అంతే ఆసక్తికరంగా ఉంటుంది. కేవలం 20 నిమిషాల్లో కంపోజర్ అనిరుధ్ రవిచందర్ ట్యూన్ సిద్ధం చేయగా, ధనుష్ ఆరు నిమిషాల్లోనే పాట రాసేశాడు. సరదాగా మొదలైన ఓ స్టూడియో సెషన్, భారత సంగీత చరిత్రలో ఒక మరపురాని పాటగా నిలిచిపోయింది.
తమిళ చిత్రం '3' విడుదలకి ముందు, 2011 నవంబర్ 16న ఈ పాట రిలీజైంది. రిలీజైన వెంటనే జనాల దృష్టిని ఆకర్షించింది. సినిమా థియేటర్లకు రాకముందే, ఈ పాట దేశవ్యాప్తంగా ఒక క్రేజ్‌గా మారింది. కాలేజీ క్యాంపస్‌లు, కేఫ్‌లు, పార్టీలు, రేడియో స్టేషన్లలో ఎక్కడ చూసినా ఇదే పాట వినిపించేది.