తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత, మొదటి పుట్టినరోజును జరుపుకున్నారు. అయితే ఆయనకు త్రిష, రజినీకాంత్ శుభాకాంక్షలు చెప్పకపోవడం హాట్ టాపిక్ గా మారింది.
తమిళ స్టార్ హీరో విజయ్, సినిమాలకు గుడ్ బై చెప్పి రాజకీయాల్లోకి వచ్చారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి, గెలిచి తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. సీఎంగా బాధ్యతలు చేపట్టాక ఆయన తన మొదటి పుట్టినరోజును జరుపుకున్నారు. ఈ సందర్భంగా 'తమిళగ వెట్రి కళగం' పార్టీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహించి సంబరాలు చేసుకున్నాయి.
24
పుట్టిన రోజున కూడా అసెంబ్లీకి వచ్చిన దళపతి
విజయ్ పుట్టినరోజు సందర్భంగా పలువురు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ఆయన బర్త్ డే రోజు కూడా అసెంబ్లీ సమావేశాలకు హాజరవడంతో, అక్కడి ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష నేతలు కూడా సీఎంకు విషెస్ చెప్పారు. అయితే ఇంతమంది విషెస్ చెప్పినా, తమిళనాడు మొత్తం ఇద్దరి విషెస్ కోసం ఎదురుచూసింది. కానీ ఆ ఇద్దరూ నిన్న శుభాకాంక్షలు చెప్పలేదు.
34
త్రిషకు థ్యాంక్స్ చెపుతున్న విజయ్ అభిమానులు..
ఆ ఇద్దరిలో ఒకరు నటి త్రిష. గత కొన్నేళ్లుగా విజయ్ పుట్టినరోజుకు త్రిష పెట్టే పోస్టులు వివాదాలకు దారితీశాయి. అందుకే ఈసారి ఆమె ఏం పోస్ట్ పెట్టి రచ్చ చేస్తుందోనని విజయ్ అభిమానులు భయపడ్డారు. కానీ వాళ్లకు సంతోషం కలిగించేలా త్రిష ఎలాంటి పోస్ట్ పెట్టలేదు. తన పోస్ట్ వల్ల సీఎం విజయ్ ఎలాంటి విమర్శలు ఎదుర్కోకూడదనే ఉద్దేశంతోనే త్రిష సైలెంట్‌గా ఉన్నారని అంటున్నారు. అందుకే విజయ్ అభిమానులు ఆమెకు థ్యాంక్స్ చెబుతున్నారు.
మరోవైపు, విజయ్ పుట్టినరోజుకు శుభాకాంక్షలు చెప్పని మరో ప్రముఖ వ్యక్తి సూపర్ స్టార్ రజినీకాంత్. విజయ్ సీఎం అయినప్పటి నుంచి రజినీకాంత్‌పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. డీఎంకే, ఏడీఎంకే కూటములతో రజినీకాంత్ చర్చలు జరిపారంటూ వార్తలు వచ్చాయి. అయితే అవన్నీ అబద్ధమని రజినీ ప్రెస్ మీట్ పెట్టి మరీ క్లారిటీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో, విజయ్ పుట్టినరోజుకు రజినీకాంత్ మౌనంగా ఉండటంతో నెటిజన్లు ఆయన్ను ట్రోల్ చేస్తున్నారు.