ఇండస్ట్రీకి వచ్చి రెండు దశాబ్దాలు దాటినా, ఇప్పటికీ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్, లగ్జరీ బంగ్లా, ఖరీదైన కార్లు, కోట్లలో రెమ్యునరేషన్ తీసుకునే ఆ హీరోయిన్ చేతినిండా సంపాదిస్తూ..కూడబెట్టిన ఆస్తి విలువ ఎంతో తెలుసా? ఇంతకీ ఎవరా బ్యూటీ?
తమన్నా భాటియా... తమిళం, తెలుగు, హిందీ సినిమాల్లో నటించి పాపులర్ అయ్యారు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మోస్ట్ సక్సెస్ ఫుల్ హీరోయిన్లలో ఈమె ఒకరు. వెండితెరపైనే కాకుండా, వెబ్ సిరీస్‌లు, ఓటీటీల్లోనూ తన నటనతో ప్రేక్షకులను అలరిస్తూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు.
26
తమన్నా భాటియా కెరీయర్ హైలైట్
తమన్నా తన కెరీర్‌లో ఎన్నో బ్లాక్‌బస్టర్ చిత్రాల్లో నటించారు. ఇటీవల 'జైలర్', 'స్త్రీ 2' వంటి బ్లాక్‌బస్టర్ సినిమాల్లో చేసిన స్పెషల్ సాంగ్స్ ఆమె పాపులారిటీని మరింత పెంచాయి. దీంతో తమన్నా సినీ ప్రియులకు, నిర్మాతలకు మోస్ట్ ఫేవరెట్‌గా మారిపోయారు.
36
తమన్నా భాటియా నెట్ వర్త్
వివిధ మీడియా కథనాల ప్రకారం, తమన్నా భాటియా ఆస్తి విలువ సుమారు రూ.150 కోట్లకు పైమాటే. ఆమె సంపాదనలో ఎక్కువ భాగం సినిమాలు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు, డిజిటల్ ప్రాజెక్టుల నుంచే వస్తుంది. రియల్ ఎస్టేట్‌లోనూ భారీగా పెట్టుబడులు పెట్టారు. రూ.16 నుంచి 20 కోట్ల విలువైన లగ్జరీ బంగ్లా ఆమెకు ఉందని సమాచారం. అంతేకాకుండా, ముంబైలో సుమారు రూ.7 కోట్ల విలువైన ప్రీమియం అపార్ట్‌మెంట్ కూడా ఉంది.
రిపోర్టుల ప్రకారం, తమన్నా భాటియా ఒక్కో సినిమాకు రూ.4 కోట్ల నుంచి రూ.5 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటారు. దీంతో ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణుల్లో ఒకరిగా నిలిచారు. ఇక 'స్త్రీ 2' సినిమాలోని 'ఆజ్ కీ రాత్' పాట కోసం, కేవలం కొన్ని నిమిషాల పెర్ఫార్మెన్స్‌కు రూ.1 కోటి తీసుకున్నారని టాక్.
56
తమన్నా గ్యారేజ్ లో కాస్ట్లీ కార్లు..
తమన్నాకు లగ్జరీ కార్లంటే చాలా ఇష్టం. ఆమె గ్యారేజ్‌లో ఏయే కార్లు ఉన్నాయో తెలుసా? BMW 320i, మెర్సిడెస్-బెంజ్, మిత్సుబిషి పజెరో స్పోర్ట్, ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ డిస్కవరీ స్పోర్ట్ వంటి ఖరీదైన కార్లు ఆమె వద్ద ఉన్నాయి.
66
అదిరిపోయే డ్యాన్స్ నంబర్లతో
2005లో 'చాంద్ సా రోషన్ చెహ్రా' అనే బాలీవుడ్ సినిమాతో తమన్నా తన కెరీర్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత దశాబ్ద కాలం పాటు తెలుగు, తమిళ సినిమాల్లో నటించారు. 'బాహుబలి' వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలు, అదిరిపోయే డ్యాన్స్ నంబర్లతో తెలుగు, తమిళం, బాలీవుడ్‌లో స్టార్‌డమ్ సంపాదించుకున్నారు.