రాజా సాబ్ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది, ప్రభాస్ సినిమాను ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?

Published : Jan 31, 2026, 05:55 PM IST

 ప్రభాస్ హీరోగా నటించిన పాన్ ఇండియా సినిమా 'ది రాజా సాబ్' ఓటీటీలో రిలీజ్‌కి రెడీ అయింది. విశేషం ఏంటంటే, థియేటర్ లో  రిలీజై నెల కూడా కాకుండానే ఈసినిమా ఓటీటీ లోకి రాబోతోంది. 'రాాజాసాబ్ మూవీని ఎప్పుడు ఎక్కడ చూడొచ్చంటే? 

PREV
14
భారీ అంచనాల నడుమ రిలీజైన ది రాజా సాబ్

కామెడీ సినిమాలు దర్శకుడు మారుతి ఫస్ట్ టైమ్ తెరకెక్కించిన పాన్ ఇండియా సినిమా 'ది రాజా సాబ్. భారీ అంచనాల నడుమ ఈ సినిమా జనవరి 9, 2026న రిలీజైంది. ఈ పాన్ ఇండియా హారర్ కామెడీ సినిమాలో ప్రభాస్‌తో పాటు సంజయ్ దత్, మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ తో పాటు రిద్ది కుమార్ కూడా నటించారు.

24
ది రాజా సాబ్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్?

బాక్స్ ఆఫీస్‌ కలెక్షన్స్ విషయంలో 'ది రాజా సాబ్' నిరాశపరిచింది. మొదటి రోజు ఈసినిమా 53.75 కోట్లతో భారీ ఓపెనింగ్ ఇచ్చినా, ఆ తర్వాత వసూళ్లు పడిపోయి 15 రోజుల్లోనే థియేటర్ల నుంచి నిష్క్రమించింది.400 కోట్ల బడ్జెట్‌తో తీసిన ఈ సినిమా, కనీసం సగం కూడా వసూలు చేయలేదు. ఇండియాలో 143 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా 205 కోట్లు మాత్రమే రాబట్టి భారీ డిజాస్టర్‌గా నిలిచింది.

34
'ది రాజా సాబ్' ఓటీటీలో ఎప్పుడు, ఎక్కడ చూడాలి

'ది రాజా సాబ్' మూవీ ఓటీటీ రిలీజ్ పై ఓ క్లారిటీ వచ్చింది. ఈసినిమా స్ట్రీమింగ్ ఫిబ్రవరి 6, 2026 న మొదలవబోతోంది. . థియేటర్ రిలీజ్ అయిన 28 రోజులకే ఇంట్లో కూర్చొని ప్రభాస్ సినిమాను ఎంజాయ్ చేసే అవకాశం రాబోతోంది. ఇక రాజాసాబ్ మూవీని జియో హాట్‌స్టార్‌ లో రిలీజ్ చేయబోతున్నారు.

44
'ది రాజా సాబ్' స్ట్రీమింగ్ లో ట్విస్ట్ ఇదే..?

రాజా సాబ్ డిజిటల్ రిలీజ్‌ కు సబంధించిన విషయాన్ని టీమ్ అధికారికంగా ప్రకటించారు. కానీ ఇందులో ఒక ట్విస్ట్ ఉంది. ప్రస్తుతానికి తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో మాత్రమే ఈసినిమాను అందుబాటులో తీసుకురాబోతున్నారు. హిందీ వెర్షన్ మూవీని తర్వాత రిలీజ్ చేస్తారని సమాచారం.

Read more Photos on
click me!

Recommended Stories