తమ్మారెడ్డి భరద్వాజ టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ గురించి స్పందించారు. మన శంకర వరప్రసాద్ గారు సక్సెస్ మీట్ లో చిరంజీవి ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్పిన సంగతి తెలిసిందే.
మెగాస్టార్ చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు చిత్ర సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు. అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ చిత్రం 350 కోట్లకు పైగా వసూళ్లతో ప్రభంజనం సృష్టించింది. ఈ చిత్రాన్ని సాహు గారపాటి తో పాటు చిరంజీవి కుమార్తె సుస్మిత కొణిదెల ఈ చిత్రాన్ని నిర్మించారు. మెగా డాటర్ కి నిర్మాతగా బ్లాక్ బస్టర్ సక్సెస్ దక్కింది. సక్సెస్ సెలెబ్రేషన్స్ లో చిరంజీవి తన కుమార్తె గురించి మాట్లాడుతూ.. కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
25
ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ లేదు
ఆడబిడ్డలు ఇండస్ట్రీకి రావాలి. ఆసక్తి ఉన్నవారిని అందరూ తప్పకుండా ఎంకరేజ్ చేయాలి. మహిళలకు ఇక్కడ ఏదైనా చేదు అనుభవాలు ఉంటే అది వాళ్ళ తప్పిదమే అవుతుంది. మీరు స్ట్రిక్ట్ గా ఉంటే ఎవ్వరూ ఏమీ చేయరు. మిమ్మల్ని అడ్వాంటేజ్ గా తీసుకోవాలని ఎవరూ ప్రయత్నించారు. కాస్టింగ్ కౌచ్ లాంటిది ఏమీ ఉండదు. మీరు ప్రొఫెషనల్ గా ఉంటే ఎదుటివాళ్ళు కూడా ప్రొఫెషనల్ గానే ఉంటారు అని అన్నారు.
35
తమ్మారెడ్డి కౌంటర్
ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ లేదు అని చిరంజీవి చెప్పడంలో చిన్మయి కౌంటర్ ఇస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తాజాగా తమ్మారెడ్డి భరద్వాజ కూడా చిరంజీవి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ లేదు అనేది వాస్తవం కాదు. చిత్ర పరిశ్రమలో మహిళలకు వేధింపులు ఉన్నాయి. అయితే అందరూ అమ్మాయిలని వాడుకుంటున్నారు అని కాదు. కొంత వరకు ఈ సమస్య ఉంది.
గతంలో కొందరు మహిళలని వాడుకునేందుకు కొన్ని సినిమాలు చేశారు. వాళ్ళకి సంబంధించిన హీరోయిన్లని పెట్టుకుని సినిమాలు చేశారు. సినిమాల ద్వారా అమ్మాయిలని వాడుకుని తమ లైంగిక వాంఛ తీర్చుకోవాలని గతంలో కొందరు ప్రయత్నించినట్లు తమ్మారెడ్డి పేర్కొన్నారు.
55
చిరంజీవి కూతురు కాబట్టి ప్రాబ్లమ్ లేదు
మహిళలకు వేధింపులు అనే సమస్య చిత్ర పరిశ్రమలో మాత్రమే లేదు. దాదాపు అన్ని రంగాల్లో ఉంది అని తమ్మారెడ్డి అన్నారు. చిరంజీవి తన కుమార్తె సుస్మిత గురించి మాట్లాడారు. ఆమె నిర్మాత. ఇండస్ట్రీలో నిర్మాతలకు కాస్టింగ్ కౌచ్ సమస్య ఉండదు. ఆర్టిస్టులుగా వచ్చిన వాళ్లకు ఆ సమస్య ఉంటుంది అని తమ్మారెడ్డి అన్నారు.