బాలకృష్ణ, మహేష్ బాబు కాంబోలో.. మల్టీస్టారర్ సినిమా కోసం ప్రయత్నించిన స్టార్ డైరెక్టర్ ఎవరో తెలుసా?

Published : Jan 31, 2026, 04:19 PM IST

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, నట సింహం బాలయ్య బాబు.. ఇద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తే ఎలా ఉంటుంది. ఈ ఇద్దరి తో కలిసి సినిమా చేయాలని ప్రయత్నించిన దర్శకుడు ఎవరో తెలుసా..? 

PREV
15
టాలీవుడ్ లో మల్టీ స్టారర్ మూవీస్..

టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ హిస్టరీలో ఇప్పటి వరకూ ఎన్నో మల్టీ స్టారర్ సినిమాలు వచ్చాయి. చాలా సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాయి. ఎన్టీఆర్ ఏఎన్నార్ నుంచి కృష్ణ, శోభన్ బాబు, మహేష్ బాబు, వెంకటేష్, రామ్ చరణ్, ఎన్టీఆర్ వరకూ.. ఎన్నో సక్సెస్ ఫుల్ కాంబినేషన్లు వెండితెరపై మెరిసి.. అభిమానులను అలరించాయి. ఈక్రమంలో కొన్ని కాంబినేషన్లలో డిజాస్టర్ మూవీస్ కూడా వచ్చాయి. అవన్నీ పక్కన పెడితే కొన్ని కాంబినేషన్లతో సినిమా ప్రయత్నాలు జరిగి మిస్ అయినవి కూడా లేకపోలేదు. వాటిలో బాలకృష్ణ , మహేష్ బాబు సినిమా కూడా ఉంది. ఈ ఇద్దరు హీరోలతో ఓ సినిమా చేయాలని ఓ స్టార్ డైరెక్టర్ చాలా ప్రయత్నం చేశాడట. ఆ దర్శకుడు ఎవరో కాదు బి. గోపాల్.

25
బాలయ్య- బి. గోపాల్ బ్లాక్ బస్టర్ కాంబినేషన్..

బాలకృష్ణ , బి. గోపాల్ కాంబినేషన్ లో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు వచ్చాయి. నటసింహం అభిమానులను ఉర్రూతలూగించి, మాస్ లో బాలయ్య ఇమేజ్ ను డబుల్ చేసిన దర్శకడు గోపాల్. ఆయ బాలకృష్ణ తో 5 సినిమాలు తెరకెక్కించాడు. ఈ 5 సినిమాలలో ఒకటి డిజాస్టర్ అవ్వగా.. మిగిలిన నాలుగు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. లారీ డ్రైవర్, రౌడీ ఇన్‌స్పెక్టర్, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, పల్నాటి బ్రహ్మనాయుడు సినిమాలు వీరి కాంబోలో వచ్చాయి. 

ఇక ఇందులో సమరసింహారెడ్డి సినిమా ప్రభంజనం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాలలో పల్నాటి బ్రహ్మనాయుడు మాత్రమే డిజాస్టర్ అయ్యింది. ఈసినిమాతో వల్ల బాలయ్య భారీగా ట్రోలింగ్ కు కూడా గురయ్యారు. ఈ విషయంలో బాధపడుతున్నట్టు.. కొన్ని ఇంటర్వ్యూలలో డైరెక్టర్ గోపాల్ వెల్లడించారు కూడా.

35
మహేష్ బాబు లైఫ్ టర్న్ చేసిన గోపాల్..

ఇక సూపర్ స్టార్ మహేష్ బాబుతో బి. గోపాల్ ఒకే ఒక సినిమా చేశారు. ఆ సినిమా కూడా హిట్టు కాకపోయినా.. మహేష్ బాబు కెరీర్ ను ఈసినిమా పూర్తిగా మార్చేసింది. ఎందుకంటే ఈసినిమాలో హీరోయిన్ గా నమ్రతా శిరోద్కర్ నటించారు. ఈ సినిమాతో మహేష్ బాబు, నమ్రత మధ్య ప్రేమ చిగురించి, పెళ్లి వరకూ వెళ్లింది. మహేష్ కెరీర్ లో వంశీ మూవీ చాలా స్పెషల్ అని చెప్పాలి. 

అయితే ఈసినిమా తరువాత గోపాల్ తో మహేష్ బాబు మరో సినిమా చేయలేదు. కానీ బాలయ్య, మహేష్ బాబుతో కలిసి ఓ మల్టీ స్టారర్ మూవీ చేయాలని మాత్రం గోపాల్ అనుకున్నారట. అందుకోసం చాలా ప్రయత్నం చేశారాట గోపాల్.

45
అన్నాదమ్ములుగా బాలయ్య, మహేష్..

బాలయ్య, మహేష్ అన్నదమ్ములగా నటిస్తూ.. అద్భుతమైన ఫ్యామిలీ సెంటిమెంట్ కమ్ యాక్షన్ మూవీని గోపాల్ ప్లాన్ చేశారట. కానీ ఎంత ప్రయత్నించినా అది వర్కౌట్ అవ్వలేదని టాలీవుడ్ టాక్. ఈసినిమా చేసుంటే ఇండస్ట్రీలో ఒక అద్భుతం అయ్యి ఉండేదని అభిమానులు  అభిప్రాయపడుతున్నారు. మహేష్, వెంకీ అన్నదమ్ములుగా సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా వచ్చింది. 

మరి బాలయ్య, మహేష్ అన్నదమ్ములుగా చేసి ఉంటే ఎలా ఉండేదో. ప్రస్తుతం బాలయ్య బాబు వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. 65 ఏళ్ల వయసులో కూడా బాలకృష్ణ వరుసగా 5 విజయాలు అందుకున్నాడు. రీసెంట్ గా వచ్చిన అఖండ సినిమా మాత్రం యావరేజ్ గా నిలిచింది.

55
పాన్ వరల్డ్ మూవీలో సూపర్ స్టార్..

మహేష్ బాబు మాత్రం పాన్ వరల్డ్ మూవీతో బిజీబిజీగా ఉన్నాడు. రాజమౌళి డైరెక్షన్ లో వారణాసి సినిమా చేస్తున్నాడు మహేష్. అడ్వెంచర్ కాన్సెప్ట్ లో రూపొందుతున్న ఈసినిమాలో రుద్రగా మహేష్ బాబు నటిస్తున్నారు. సూపర్ స్టార్ జోడీగా గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా నటిస్తోంది. ఈమూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. వారణాసికి సబంధించిన ఏ వివరాలు బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారు టీమ్. 2027 లో సంక్రాంతికి కానీ.. సమ్మర్ కు కానీ ఈసినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

Read more Photos on
click me!

Recommended Stories