రాజాసాబ్ స్టార్స్ రెమ్యూనరేషన్స్, ప్రభాస్ పారితోషికం లో భారీ కోత, ఎవరెంత తీసుకున్నారంటే?

Published : Jan 02, 2026, 03:38 PM IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్  ‘ది రాజా సాబ్’ రిలీజ్ హడావిడిలో ఉన్నాడు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో, అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  మారుతి డైరెక్ట్ చేస్తున్న  ఈ సినిమా జనవరి 9న రిలీజ్ కాబోతోంది. 

PREV
17
రాజాసాబ్ కోసం ప్రభాస్ త్యాగం..?

రూ.450 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన 'ది రాజా సాబ్' విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో సినిమా కోసం స్టార్స్ ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారో తెలుసా?  ప్రభాస్ ఆసినిమా కోసం తన రెమ్యునరేషన్ లో చాలా భాగం త్యాగం చేశాడా?  ‘ది రాజా సాబ్’ కోసం ప్రభాస్  100 కోట్లు తీసుకున్నట్లు సమాచారం.  సాధారణంగా 150 కోట్లు తీసుకునే ప్రభాస్, ఈ సినిమా కోసం తన ఫీజును భారీగా తగ్గించుకున్నాడని తెలుస్తోంది.

27
సంజయ్ దత్

‘ది రాజా సాబ్’ సినిమాలో సంజయ్ దత్ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు.  ఇందులో ఆయన పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. ఈ సినిమా కోసం ఆయన రూ.5-6 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్టు తెలుస్తోంది. 

37
మాళవిక మోహనన్

‘ది రాజా సాబ్’లో మాళవిక మోహనన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా కోసం ఆమెకు రూ.2 కోట్ల పారితోషికం అందినట్లు సమాచారం. ప్రభాస్‌తో మాళవిక స్క్రీన్ షేర్ చేసుకోవడం ఇదే మొదటిసారి. మరి ఆమె పాత్ర ఎలా ఉండబోతోందో చూడాలి. 

47
నిధి అగర్వాల్

‘ది రాజా సాబ్’లో నిధి అగర్వాల్ మెయిన్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం వరుస సినిమాలతో మంచి ఫామ్ లో ఉన్న నిథి.. ప్రభాస్ తో మొదటి సారి నటిస్తోంది.  ఈ సినిమా కోసం ఆమెకు రూ.1.2-1.5 కోట్లు తీసుకున్నట్టు తెలుస్తోంది. 

57
రిద్ధి కుమార్

‘ది రాజా సాబ్’లో రిద్ధి కుమార్ మూడో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాలో రిద్ధి ఒక ప్రత్యేక పాత్రలో కనిపించనుంది. ఈ సినిమా కోసం ఆమెకు రూ.3 కోట్ల ఫీజు అందింది.

67
బ్రహ్మానందం

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఫేమస్ కమెడియన్ బ్రహ్మానందం కూడా ‘ది రాజా సాబ్’లో కనిపించనున్నారు. ఈ సినిమా కోసం ఆయనకు 80 లక్షల వరకూ రెమ్యునరేషన్ ఇచ్చినట్టు సమాచారం.

77
అనుపమ్ ఖేర్

ప్రభాస్ ‘ది రాజా సాబ్’లో అనుపమ్ ఖేర్ కూడా ఉన్నారు. ఆయన పాత్ర వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. ఈ సినిమాకు ఆయనకు రూ.1 కోటి, దర్శకుడు మారుతికి రూ.18 కోట్లు పారితోషికంగా అందినట్లు సమాచారం.

Read more Photos on
click me!

Recommended Stories