ధురంధర్ బాక్స్ ఆఫీస్ దాహం తీరలేదు.. 28వ రోజు కూడా రణవీర్ సింగ్ సినిమా కలెక్షన్లు పరుగును కొనసాగిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఇండియాలో 739 కోట్లు దాటిన ఈసినిమా.. ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని కలెక్షన్లు సాధించిందంటే?
రణవీర్ సింగ్ ధురంధర్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద తన అసాధారణ ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. నాలుగో వారంలో కూడా మంచి వసూళ్లు రాబడుతోంది. 28వ రోజున, ఈ సినిమా ఇండియాలో సుమారు 15.75 కోట్లు వసూలు చేసి, దేశీయంగా మొత్తం 739 కోట్లకు చేరింది. అంతర్జాతీయంగా 250 కోట్ల కలెక్సన్స్ సంపాదించి, ప్రపంచవ్యాప్తంగా 1,117.9 కోట్లకు చేరింది. దీంతో ధురంధర్ అధికారికంగా 1,100 కోట్ల మైలురాయిని దాటి, అతిపెద్ద భారతీయ బ్లాక్‌బస్టర్‌లలో ఒకటిగా నిలిచింది.
23
రికార్డులు బ్రేక్ చేస్తున్న రణ్ వీర్ సింగ్ సినిమా..
ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా స్త్రీ 2, ఛావా, పఠాన్, పుష్ప 2 వంటి అనేక పెద్ద హిట్‌ల లైఫ్‌టైమ్ కలెక్షన్లనుబ్రేక్ చేసింది. ఇది అత్యధిక వసూళ్లు సాధించిన సింగిల్-లాంగ్వేజ్ ఇండియన్ సినిమాగా నిలిచింది. గ్లోబల్ ర్యాంకింగ్స్‌లో, ధురంధర్ ఏడవ స్థానంలో ఉంది. నార్త్ అమెరికాలో 17.50 మిలియన్ డాలర్ల మార్కును దాటి, పఠాన్‌ను అధిగమించింది. బాహుబలి 2, కల్కి 2898 AD తర్వాత ఆ మార్కెట్లో మూడో అతిపెద్ద భారతీయ చిత్రంగా నిలిచింది.
33
టికెట్ అమ్మకాలలో కూడా చరిత్ర సృష్టించింది
ఆదాయంతో పాటు, ధురంధర్ టికెట్ అమ్మకాలలో కూడా చరిత్ర సృష్టించింది. ట్రేడ్ అనలిస్ట్ నిషిత్ షా ప్రకారం, ఈ సినిమా బుక్‌మైషోలో 13 మిలియన్లకు పైగా టిక్కెట్లను అమ్మి, ప్లాట్‌ఫామ్‌పై అత్యధిక టిక్కెట్లు అమ్ముడైన హిందీ చిత్రంగా నిలిచింది. కిస్ కిస్కో ప్యార్ కరూన్ 2, తూ మేరీ మే తేరా వంటి కొత్త సినిమాలు ధురంధర్ ముందు నిలవలేకపోయాయి. అగస్త్య నంద 'ఇక్కీస్'కు మంచి రివ్యూలు వచ్చినా, ధురంధర్ హవా ముందు ఏసినిమా నిలబడలేకపోయింది.