రాజేంద్ర ప్రసాద్ పై చిరంజీవి కూతురు కామెంట్స్, మెగాస్టార్ షాకింగ్ రిప్లై.. ఏమన్నాడంటే?

Published : Jan 02, 2026, 02:09 PM IST

నటకిరీట్ రాజేంద్ర ప్రసాద్ తో చిరంజీవి కూతురు తీసిని సినిమా ఏదో తెలుసా? ఈసినిమా చేస్తున్న టైమ్ లో సుస్మిత కొణిదెల చిరంజీవితో రాజేంద్ర ప్రసాద్ గురించి ఏం చెప్పిందంటే? చిరు చాలా తేలిగ్గా తీసిపడేసిన విషయం ఏంటి? 

PREV
15
చిరంజీవి కూతురు నిర్మాతగా...

మెగాస్టార్ చిరంజీవి ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చి.. టాలీవుడ్ లో మెగా సామ్రాజ్యాన్నే స్థాపించాడు. ఆయన ఇండస్ట్రీకి వచ్చిన తరువాత మెగా వారసత్వాన్ని తీసుకుని.. పవన్ కళ్యాణ్, నాగబాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయి తేజ్, వైష్ణవ్, నిహారిక, సుస్మిత.. ఇలా ఎంతో మంది ఆర్టిస్ట్ లు, నిర్మాతలు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. స్టార్లు గా రాణిస్తున్నారు. ఈక్రమంలో చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత కూడా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆమె సినిమాలో కూడా నటించారట కానీ.. ఆసినిమా రిలీజ్ అవ్వలేదు. ప్రస్తుతం అప్పుడప్పుడు నిర్మాతగా సినిమాలు చేస్తుంటుంది సుస్మిత.

25
సుస్మిత - రాజేంద్ర ప్రసాద్ కాంబినేషన్ లో సినిమా..

సుస్మిత నిర్మాతగా కొన్నిసినిమాలు చేశారు. అందులో సీనియర్ నటుడు, నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ లీడ్ రోల్ లో సేనాపతి అనే సినిమా వచ్చింది. 2021 లో రిలీజ్ అయిన ఈమూవీ హిట్ అవ్వకపోయినా.. విమర్శకుల ప్రశంసలు మాత్రం అందుకుంది. సుస్మిత నిర్మించిన ఈసినిమాను పవన్ సాధినేని డైరెక్ట్ చేశారు. అయితే ఈసినిమాలో రాజేంద్ర ప్రసాద్ నటన అందరిని ఆకట్టుకుంది. నిర్మాతగా సుస్మిత అయితే ఆయన నటన చూసి షాక్ అయ్యారట. ఇంత అద్భుతంగా నటిస్తున్నారాని మురిసిపోయి వెంటనే మెగాస్టార్ చిరంజీవి దగ్గరకు వెళ్లి ఈ విషయాన్ని చెప్పారట.

35
రాజేంద్ర ప్రసాద్ గురించి చిరంజీవి కామెంట్స్..

సేనాపతిలో రాజేంద్ర ప్రసాద్ నటన చూసి.. చిరంజీవితో సుస్మిత చాలా గొప్పగా చెప్పారట. ఆయన నటన చూసి షాక్ అయ్యాను.. అంత అద్భుతంగా చేశారు అని అన్నారట. దానికి చిరంజీవి మాట్లాడుతూ.. అవును అందులో వింత ఏముంది.. రాజా చేయకపోతే విచిత్రం కానీ.. ఆయన నటిస్తే వింత ఏముంది. ఎందుకు నటించడు.. ఎవరికోసం నటిస్తున్నాడు అని చమత్కారంగా అన్నారట చిరు. ఈ విషయాన్ని రాజేంద్ర ప్రసాద్ ఓ ఇంటర్యూలో వెల్లడించారు. ''చిరంజీవికి నేనంటే మహా ప్రేమ.. ఎంతో అభిమానం... అందుకే నన్ను సరదాగా ఏదో ఒకటి అంటుండాడు '' అని రాజేంద్ర ప్రసాద్ అన్నారు.

45
చిరంజీవి కూతురు హీరోయిన్ గా నటించిన సినిమా..?

మెగాస్టార్ కూడా తన పెద్ద కూతురు సుస్మితాను హీరోయిన్ గా చూడాలని ఎంతో ఆశపడ్డారట. అలా ప్రయత్నాలు కూడా చేశారట. కాని అలా ప్రయత్నం సక్సెస్ అవ్వలేదని తెలుస్తోంది. సుస్మిత హీరోయిన్ గా ఓ మూవీ కూడా స్టార్ట్ చేశారట. పూరీ జగన్నాధ్ డైరెక్షన్ లో.. ఈసినిమాను స్టార్ట్ చేసినట్టు సమాచారం. కానీ ఈసినిమా మధ్యలోనే ఆగిపోయిందట. దానికి కారణాలు మాత్రం తెలియదు. ఈ సినిమా ఆగిపోవడంతో.. ఆమె హీరోయిన్ గా ప్రయత్నం కూడా మానేశారట. ఇందులో నిజం ఎంతో తెలియదు కానీ.. ఇండస్ట్రీలో గుసగుసలు మాత్రం వినిపిస్తుంటాయి.

55
చిరంజీవి సినిమాలు..

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం ఆయన అనిల్ రావిపూడి డైరెక్షన్ లో మన శంకర వరప్రసాదుగారు సినిమా చేస్తున్నాుడ. ఈసినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతోంది. నయనతార హీరోయిన్ గా నటించిన ఈసినిమాపై మెగా అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు. దీనితో పాటు విశ్వంభర సమ్మర్ లో రిలీజ్ కానుంది. మరో వైపు బాబీ డైరెక్షన్ లో చిరంజీవి మూవీ షూటింగ్ త్వరలో స్టార్ట్ కాబోతోంది.

Read more Photos on
click me!

Recommended Stories