కోటా శ్రీనివాసరావు పర్ఫామెన్స్ తో పిచ్చెక్కించిన సినిమా? ఓవర్ నైట్ స్టార్ ను చేసిన మూవీ ఏదో తెలుసా?

Published : Mar 24, 2025, 11:32 AM ISTUpdated : Mar 24, 2025, 11:34 AM IST

టాలీవుడ్ లో పిచ్చెక్కించే ఫెర్ఫామెన్స్ లు ఇచ్చిన సీనియర్ నటులలో కోటా శ్రీనివాసరావు కూడా ఒకరు.  తెలుగు సినీ పరిశ్రమ గర్వించదగ్గ నటుడు కోటా. ఆయన నటించిన సినిమాల్లో అద్భుతం అనిపించిన సినిమా ఏదో తెలుసా? అంతే కాదు ఈసినిమాతో కోటా ఓవర్ నైట్ స్టార్ గా మారాడు. ఇంతకీ ఆసినిమా ఏదంటే?   

PREV
16
కోటా శ్రీనివాసరావు పర్ఫామెన్స్  తో పిచ్చెక్కించిన సినిమా? ఓవర్ నైట్ స్టార్ ను చేసిన మూవీ ఏదో తెలుసా?
Kota Srinivasa Rao

కెరీర్ లో ఎన్నో అద్భుతమూ పాత్రలు చేశారు  కోటా శ్రీనివాస్ రావు. దాదాపు మూడు తరాల తారలో కలిసి నటించిన ఆయయన ఒక సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారాడు. ప్రస్తుతం వయోభారం వల్ల  సినిమాలకు దూరంగా.. ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు కోటా శ్రీనివాసరావు.

వయస్సు మీద పడటంతో  ఇంటికే పరిమితం అయ్యారు. కాస్త ఓపికుంటే చాలు ఇపపటికీ నటిస్తాననే అంటారు కోటా.  నటనను అంతలా ప్రేమిస్తారు కాబట్టే, ఆడియన్స్  మెస్మరైజ్ అయ్యే పెర్ఫామెన్స్, క్యారెక్టర్స్ లో వేరియేషన్, ఒకరకంగా పిచ్చెక్కించే నటనతో స్టార్ గా మారాడు కోటా శ్రీనివాసరావు. 

Also Read: షూటింగ్ పూర్తయిన, రిలీజ్ ఆగిపోయిన చిరంజీవి సినిమా, మెగాస్టార్ కెరీర్ లోనే విడుదల అవ్వని ఏకైక మూవీ.

26

నటనలో ఎన్నో ఉన్నత  శిఖరాలను చూసిన కోటాకు..  ఇంత స్టార్ డమ్ ఎలా వచ్చింది. ఆయను స్టార్ ను చేసిన సినిమా ఏది..? ప్రభుత్వ ఉద్యోగం, మంచి శాలరీ, అన్నింటిని వదిలేసి, తను ఎంతో ప్రేమించే నాటకాలు, సినిమాలవైపు అడుగులు ఎలా వేశారు.

అంచలంచెలుగా ఎదుగుతూ తెలుగు సినిమాలో బిజీ ఆర్టిస్ట్ గా కోటా ఎలా మారాడు. చిన్న చిన్న పాత్రలు చేస్తూ.. స్టార్ నటుడిగా ఎలా ఎదిగాడు. ఒక సందర్భంలో స్టార్ హీరోల కంటే బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయాడు కోటా. మూడు షిప్ట్ లలో పనిచేశాడు.కోటా డేట్స్ కోసం స్టార్ హీరోలు కూడా వెయిట్ చేసిన సందర్భాలు లేకపోలేదు.  

Also Read: మోహన్ బాబు బదులు, ఎన్టీఆర్ యమదొంగ సినిమాలో, యముడి పాత్ర మిస్ అయిన స్టార్ నటుడు ఎవరో తెలుసా?

36
Kota Srinivasa rao

ఇక కోటా ఇండస్ట్రీలో నిలబడటానికి కారణమైన సినిమా ఒకటుంది. కోటా నట విశ్వరూపంతో పిచ్చెక్కించిన సినిమా  ఏదో కాదు ప్రతిఘటన. అవును కోటా నటుడిగా నిలబడటానికి ఈ సినిమా కారణం.  ఈసినిమాతో కోటా ఓవర్ నైట్ స్టార్ గా మారాడు.  కోటా శ్రీనివాస్ రావు ఈసినిమాలో చేసిన నటన చూసి.. ఎవరతను, ఏంటా నటన అయ్య బాబోయ్ అనుకున్నారంతా.  ఈ సినిమా తరువాత ఆయనకు అవకాశాలు కూడా పెరిగిపోయాయి. 

Also Read: లేడీ వాయిస్‌లో ఇళయరాజా పాడిన సూపర్ హిట్ సాంగ్ ఏదో తెలుసా?

46
Kota Srinivasa rao

ఈవిషయాన్ని ఓసందర్భంలో కోటా శ్రీనివాస్ చెప్పారు. ఆయన మాట్లాడుతూ.. నా కెరీర్‌కు కీలకమైన సినిమా ప్రతిఘటన అని చెప్పారు.  ఇది నా కెరీర్‌ను నిలబెట్టిన సినిమా అన్నారు.  అయితే విచిత్రం ఏంటంటే.. ఇందులో చిన్న పాత్ర కోసం కోటాను తీసుకున్నారట. కాని ఒక్క డైలాగ్ విని.. ఈనటన బాగుంది, క్యారెక్టర్ ను పెంచితే సినిమాకు ప్లస్ అవుతుంది అనకుున్నారట దర్శకుడు.

Also Read: నయనతార తమ్ముడిగా పాన్ ఇండియా స్టార్ హీరో, సినిమా రిలీజ్ డేట్ కూడా ప్రకటించిన మేకర్స్

56
Kota Srinivasa rao

 వెంటనే  కూర్చొని నైట్ నైట్ తన సీన్లు రాసుకున్నారట. దాదాపు ఎనిమిది తొమ్మిది సీన్లు దర్శకుడు టీ  కృష్ణ  నాకోసం రాశారు  అని కోటా చెప్పారు. ప్రతిఘటన నాకు తెచ్చిన పేరు అంతా ఇంతా కాదు. నాగురించి అందరికి తెలిసింది ఈ సినిమాతోనే.  ప్రతిఘటన సినిమా నన్ను స్టార్‌ను చేసింది. ఆ తరువాత నేను వెనక్కి తిరిగి చూసుకోలేదు అన్ని అన్నారు కోటా శ్రీనివాసరావు. 

Also Read:రాత్రి 9 తర్వాత కోట్లు ఇచ్చినా, సాయి పల్లవి మాత్రం ఆ పని చేయదని తెలుసా?

66

కోట శ్రీనివాసరావు  ఓ బ్రాండ్.  తెలుగు సినిమాకు కొత్త విలనిజాన్ని పరిచయం చేసిన వ్యక్తి.  ఒక రకంగా చెప్పచెప్పాలంటే నవరసాలతో ప్రయోగాం చేసి వాటిని కొత్తగా చూపించాడు కోటా. తెలుగు సినీ పరిశ్రమలో  క్యారెక్టర్టర్ ఆర్టిస్ట్ గా,  విలన్ గా, కమెడియన్ గా.. కామెడీ విలన్ గా.. కొన్ని వందల వేరియేషన్స్ ను తన నటనలో చూపించిన వ్యక్తి కోటా శ్రీనివాసరావు. తెలుగు సినిమా నటనకు సరికొత్త స్టయిల్‌ను.. సరికొత్త మ్యానరిజమ్స్‌ ను నేర్పించిన కోటా ఎన్నో ప్రయోగాలు చేశారు. 
 

Read more Photos on
click me!

Recommended Stories