రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించిన `ది గర్ల్ ఫ్రెండ్` మూవీ ఫస్ట్ రిపోర్ట్ వచ్చింది. సినిమా ఎలా ఉండబోతుంది? ఏం చూపించబోతున్నారనేది తెలిసిపోయింది. రష్మికకి నేషనల్ అవార్డు పక్కా అట.
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఎంటర్‌టైన్‌మెంట్‌కి కేరాఫ్‌గా నిలుస్తోంది. ఆమె ఈ ఏడాది బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ఆడియెన్స్ ని అలరిస్తోంది. ఇప్పటికే రష్మిక నుంచి ఈ ఏడాది నాలుగు సినిమాలు విడుదలయ్యాయి. తాజాగా `ది గర్ల్ ఫ్రెండ్` సినిమాతో ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఈ నెల 7న థియేటర్లోకి రాబోతుంది. సరికొత్త లవ్ స్టోరీతో ఈ చిత్రం రూపొందింది. ఇందులో ఆమెకి జోడీగా దీక్షిత్ శెట్టి నటిస్తున్నాడు. ధీరజ్ మొగిలినేని, దివ్య కొప్పినీడి నిర్మించిన ఈ మూవీ మరో రెండు రోజుల్లో ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. అయితే ఈ వారం ఈ చిత్రంతోపాటు మరో నాలుగు చిత్రాలు కూడా థియేటర్లోకి రాబోతున్నాయి. కాకపోతే రష్మిక మూవీపై బజ్ ఉంది. నేషనల్ క్రష్ నటించడం, అల్లు అరవింద్ బ్యాక్ బోన్ గా ఉండటంతో అందరి చూపు ఈ చిత్రంపైనే ఉంది.
24
ది గర్ల్ ఫ్రెండ్ సెన్సార్ రిపోర్ట్
ఈ క్రమంలో ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. సెన్సార్ పూర్తి చేసుకుంది. ఇది `యు ఏ` సర్టిఫికేట్ పొందింది. అదే సమయంలో 138 నిమిషాల నిడివితో సినిమా విడుదల కాబోతుంది. దీంతోపాటు కొన్ని మార్పులు, కట్స్ ని విధించారట. లిప్ లాక్ సీన్లు, రొమాంటిక్ సీన్ల విషయంలో అభ్యంతరం వ్యక్తం చేశారట. రిలేషన షిప్, పేరెంట్స్ కి సంబంధించిన కొన్ని సీన్ల విషయంలో సెన్సార్ అభ్యంతరం తెలిపారట. ఆ విషయాలు పక్కన పెడితే సినిమాకి సెన్సార్ సభ్యుల నుంచి ప్రశంసలు దక్కాయట. మూవీ అదిరిపోయిందంటూ వాళ్లు అభినందించారట.
34
ది గర్ల్ ఫ్రెండ్ కి ఫస్ట్ రివ్యూ ఇచ్చిన అల్లు అరవింద్
ఈ క్రమంలో ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ రిపోర్ట్ వచ్చింది. గత యాభై ఏళ్లుగా సినిమా నిర్మాణంలో ఉన్న నిర్మాత అల్లు అరవింద్ తన రిపోర్ట్ ఇచ్చారు. మూవీ ఎలా ఉండబోతుందో తెలిపారు. సినిమా ఫస్టాఫ్ సరదాగా సాఫీగా సాగుతుందట. `సినిమాలో ఎన్ని పాటలున్నాయి, ఎన్ని జోక్స్ ఉన్నాయి, ఎంత ఎంటర్ టైన్ మెంట్ ఉంది అని చూసే సినిమా కాదిది. మన అక్క, చెల్లి, పిన్ని వాళ్ల మనసుల్లో ఏముంటుంది, ఎలాంటి కోర్కెలు ఉంటాయి అనుకుని మూవీ చూడాలి. ది గర్ల్ ఫ్రెండ్ కాకుండా మరో టైటిల్ ఈ సినిమాకు చెప్పమంటే నీ జీవితమంతా నేనే అని చెప్పాలి. అమ్మాయి అబ్బాయి తమ జీవిత భాగస్వామి గురించి ఇలాగే అనుకుంటూ అతి సున్నితంగా సాగే ఈ సినిమా చివరకు అతి ఘాటుగా ముగుస్తుంది. ఈ సినిమా చూశాక చాలామంది రాత్రి నిద్రపోరు. అంతగా ఈ మూవీ వారిని వెంబడిస్తుంది. ప్రతి ఫ్యామిలీలో ప్రతి పర్సన్ ఈ మూవీలోని కథతో రిలేట్ అవుతారు. ఈ సినిమాకు రేటింగ్ ఇవ్వడానికి క్రిటిక్స్ కూడా ఇబ్బంది పడతారు` అని తెలిపారు.
అల్లు అరవింద్ ఇంకా చెబుతూ, ఈ చిత్రంలో రష్మిక మందన్నా అద్భుతంగా చేసిందని, ఆమె పర్‌ఫెర్మెన్స్ వేరె లెవల్ అని తెలిపారు. అయితే ఇందులోని ఆమె నటనకు నేషనల్ అవార్డు పక్కా అని చెప్పారు. ఆమెకి అవార్డు వస్తుంది, దాన్ని నేను అందుకోవడానికి వెళ్తాను. అలాగే హీరోగా చేసిన దీక్షిత్ పర్‌ఫెర్మెన్స్ అదిరిపోతుంది. రాహుల్ చాలా బాగా సినిమాని చూపించారు. చెప్పాలనుకున్న విషయాన్ని చాలా పొయెటిక్‌గా చెప్పారు. ఇది కమర్షియల్ మూవీ కాదు, కానీ మనసుని కట్టిపడేసే మూవీ అని, ఎన్ని కలెక్షన్లు వస్తాయనేది పట్టించుకోవద్దు` అని చెప్పారు అరవింద్. అయితే కమర్షియల్‌గా ఇది రిస్క్ తో కూడిన మూవీ అని చెప్పడం గమనార్హం. మరి ఆయన చెప్పినట్టుగా ఏ స్థాయిలో ఆడియెన్స్ ని ఆకట్టుకుంటుందో, అలరిస్తుందో చూడాలి.