స్కిట్లు అన్ని అయిపోయాక చివరగా టీమ్ లీడర్లు బుల్లెట్ భాస్కర్, రాకింగ్ రాకేష్, రాకెట్ రాఘవ, చలాకీ చంటి, ధన్ రాజ్, ఆటో రామ్ ప్రసాద్ స్టేజ్‌పైకి వచ్చి పెద్ద షాక్ ఇచ్చారు. అందరికి నమస్కారం. మేమందరం జబర్దస్త్ షోని వదిలేద్దామనుకుంటున్నాం అని ధన్ రాజ్ వెల్లడించారు. కొత్తవాళ్లు వస్తున్నారు, మమ్మల్ని ఎంకరేజ్ చేసినట్టుగానే వాళ్లని కూడా ఎంకరేజ్ చేయండి అని ఆటోరామ్ ప్రసాద్ తెలిపారు. ఎవరు ఏ స్కిట్ చేసినా మాపై చూపించిన ప్రేమని వాళ్లపై కూడా చూపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్యూ సో మచ్ అని తెలిపారు చలాకీ చంటి. దీంతో షోలో ఉన్న వాళ్లంతా షాక్ అవుతున్నారు. అటు జడ్జ్ లు కృష్ణభగవాన్, ఇంద్రజ, యాంకర్ రష్మి, మిగిలిన కమెడియన్లు కూడా ఆశ్చర్యపోయారు. అయితే నిజంగానే వీళ్లు షోని వదిలేస్తున్నారా? లేక స్కిట్‌లో భాగంగా ఆడే గేమా అనేది తెలియాల్సి ఉంది. అయితే జబర్దస్త్ లో ఇలాంటివి రెగ్యూలర్‌గా జరుగుతూనే ఉంటాయి. ఇది కూడా అలాంటిదేనా అనేది తెలియాల్సి ఉంది. ఈ జబర్దస్త్ షో శుక్రవారం, శనివారం ఈటీవీలో ప్రసారమవుతున్న విషయం తెలిసిందే.