ఈ క్రమంలో మిగిలిన షోస్‌కి శ్రీముఖి బెస్ట్ ఛాయిస్ అయ్యింది. ఈటీవీ స్పెషల్ షోస్ శ్రీముఖినే చేస్తుంది.స్టార్ మాలోని షోస్ కి శ్రీముఖినే యాంకర్. అలాగే జీ తెలుగులో షోస్‌కి కూడా తనే యాంకర్. ప్రస్తుతం ఆదివారం స్టార్ మాపరివారం,
అంతకు ముందు `కిర్రాక్ బాయ్ ఖిలాడీ గర్ల్స్`, `మిస్ అండ్ మిసెస్`, `సరిగమప`, `సూపర్ సింగర్` వంటి షోస్ చేసింది. అలాగే `సారంగ దరియా` అనే ఫోక్ సాంగ్ కి సంబంధించిన షోకి కూడా యాంకర్‌గా చేసింది. అలాగే ఏ పండగ వచ్చినా స్పెషల్ షోస్‌కి శ్రీముఖినే యాంకర్ కావడం విశేషం.