ఇండియన్ ఆర్మీపై ఆలియా భట్ ఎమోషనల్ పోస్ట్, ఇంతకీ ఆమె ఏమంటుందంటే?

Published : May 13, 2025, 02:49 PM IST

భారతదేశం మరియు పాకిస్థాన్ మధ్య ఇటీవల చోటు చేసుకున్న ఉద్రిక్తతలు సద్దుమణిగిన నేపథ్యంలో బాలీవుడ్ నటి అలియా భట్ భారత సైన్యాన్ని ఉద్దేశించి తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఒక భావోద్వేగపూరిత పోస్ట్ షేర్ చేశారు. ఆమె చెప్పిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో  వైరల్ అవుతున్నాయి.  

PREV
14
ఇండియన్ ఆర్మీపై ఆలియా భట్ ఎమోషనల్ పోస్ట్, ఇంతకీ ఆమె ఏమంటుందంటే?

అలియా భట్ ఇండియన్ ఆర్మీపై ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. రీసెంట్ గా  దేశవ్యాప్తంగా నెలకొన్న భావోద్వేగ వాతావరణాన్ని ఆమె వివరించారు. “గత కొన్ని రాత్రులు భిన్నంగా అనిపించాయి. ఒక దేశం ఊపిరి బిగబట్టినప్పుడు గాలిలో ఒకవిధమైన నిశ్శబ్దం ఉంటుంది. గత కొద్ది రోజులుగా మనం ఆ నిశ్శబ్దాన్ని అనుభవించాం. ఆ నిశ్శబ్దమైన ఆందోళన ప్రతి సంభాషణ వెనుక ఉంది, ప్రతి వార్త వెనుక ఉంది, ప్రతి భోజనం చుట్టూ ఆ నిశ్శబ్దం వినిపిస్తూనే ఉంది. 

24

ఎక్కడో పర్వతాలలో మన సైన్యం మేల్కొని, దేశం కోసం మన కోసం యుద్ధం చేస్తున్నారు అనే బరువును మనం అనుభవించాం”  అంటూ సైనికులు త్యాగాల గురించి ఆమె బావోద్వేగంతో పోస్ట్ పెట్టారు. ఇంతటితో ఆగకుండా అలియా భారత సైనికుల త్యాగాన్ని స్మరించుకున్నారు. 
 

34

“మనలో చాలామంది తమ ఇళ్లలో నిద్రపోతుండగా, బోర్డర్ వద్ద ఉన్న ప్రజలు, సైనికులు చీకటిలో నిలబడి తమ ప్రాణాలను అడ్డుగా పెట్టి మన నిద్రను కాపాడుతున్నారు. ఇది కేవలం ధైర్యం కాదు, త్యాగం. ప్రతి యూనిఫాం వెనుక నిద్రపోని ఒక తల్లి ఉంటుంది. ఆరోజు తన బిడ్డ జోలపాటలు వినే రాత్రి కాదని, అనిశ్చితితో కూడిన రాత్రి అని ఆ తల్లికి తెలుస్తుంది.”
 

44

ఈ పోస్ట్‌కి బాలీవుడ్ సెలబ్రిటీలు, అభిమానులు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. అలియా రచించిన ఈ మాటలు దేశభక్తిని ప్రతిబింబించడమే కాక, సైనికుల కుటుంబాలు ఎదుర్కొనే పరిస్థితులను కూడా కల్పించాయి. సైనికి కుటుంబాలకు మనోధైర్యాన్ని అందించాయి. అలియా భట్ ఇలాగే  పలు సామాజిక అంశాలపై తన అభిప్రాయాలను వ్యక్తీకరిస్తూ వస్తున్నారు. తాజా పోస్టుతో ఆమె భావోద్వేగాన్ని కలిపిన సందేశం సైనికుల పట్ల గౌరవాన్ని పెంచింది. 

Read more Photos on
click me!

Recommended Stories