బిగ్ బాస్ తెలుగు 9 షోలో టైటిల్ వేట మొదలైంది. ఇంటి సభ్యులు ఎవరి వారు కొత్త స్ట్రాటజీలు అప్లై చేస్తూ టాప్ 5 లో ఉండేందుకు శ్రమిస్తున్నారు. ఈ క్రమంలో తనూజ నిజస్వరూపం బయటపెడుతూ భరణి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
బిగ్ బాస్ తెలుగు 9 షోలో ఇక మిగిలింది ఏడుగురు సభ్యులు మాత్రమే. బిగ్ బాస్ షో చివరి దశకు చేరుకోవడంతో ఈ ఏడుగురు టాప్ లో చోటు సంపాదించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఆల్రెడీ కళ్యాణ్ పడాల టికెట్ టు ఫినాలే సాధించాడు. కాబట్టి మిగిలిన ఆరుగురు సభ్యుల మధ్య తీవ్ర పోటీ ఉంది. తనూజ, ఇమ్మాన్యుయేల్ ఎలాగూ టాప్ 5 లో ఉంటారని అంతా ఫిక్స్ అయిపోయారు. సో కళ్యాణ్, ఇమ్ము, తనూజ టాప్ 5లో తప్పనిసరిగా ఉంటారు.
25
టాప్ 5లో ఉండేది ఎవరు ?
ఇక మిగిలింది సంజన, భరణి, పవన్, సుమన్. వీరిలో భరణికి బిగ్ బాస్ అండదండలు ఉన్నాయనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. నాగబాబు శిష్యుడు కావడంతో భరణి మేనేజ్మెంట్ కోటా అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. తిరిగి తీసుకువచ్చినందుకు భరణి బాగానే కష్టపడుతున్నాడు. పవన్ కూడా ముందు నుంచి పెర్ఫామ్ చేస్తున్నాడు కాబట్టి వీరిద్దరూ టాప్ 5 లోకి వెళ్లే ఛాన్స్ ఉంది.
35
టాప్ 6 అంటూ ఊహాగానాలు
ఇక సుమన్ శెట్టికి కూడా బిగ్ బాస్ అండదండలు ఉన్నాయనే టాక్ ఉంది. ఎన్ని అండదండలు ఉన్నా అతడిని టాప్ 5లోకి తీసుకువెళ్లడం సాధ్యం కాదు. సుమన్ శెట్టితో పోల్చుకుంటే సంజన గేమ్ స్ట్రాటజీ పరంగా చాలా బెటర్. అయితే వీరిద్దరిలో ఒకరు ఎలిమినేట్ కాకతప్పదు అనే ప్రచారం జరుగుతోంది. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటే సంజన, సుమన్ ఇద్దరూ బయటకి వచ్చేస్తారు. మరోవైపు టాప్ 5 కాదు టాప్ 6 అనే ప్రచారం కూడా జరుగుతోంది. అదే కనుక నిజమైతే సంజనకి టాప్ 6 లో ఛాన్స్ దక్కవచ్చు.
ఇదిలా ఉండగా బిగ్ బాస్ టైటిల్ గెలిచేది ఎవరు అనే ప్రశ్నకు ప్రధానంగా వినిపిస్తున్న సమాధానం తనూజ, కళ్యాణ్ పడాలలలో ఒకరు అని. దీనితో ఎవరికి వారు కొత్త స్ట్రాటజీలు అప్లై చేస్తున్నారు. తాజాగా విడుదలైన బిగ్ బాస్ ప్రోమో వైరల్ అవుతోంది. ఇందులో భరణి.. తనూజ అసలు స్వరూపం బయట పెట్టాడు. గ్రాండ్ ఫినాలే సమీపిస్తున్న తరుణంలో ఎలాగైనా టైటిల్ గెలవాలని తనూజ డిసైడ్ అయినట్లు ఉంది. అందుకే ఆమె సరికొత్త స్ట్రాటజీ బయటకి తీసింది.
55
తనూజ అంతకి తెగించిందా ?
కళ్యాణ్ కి ముందు నుంచి తనూజపై సాఫ్ట్ కార్నర్ ఉంది. భరణి మాటలని బట్టి చూస్తే.. తనపై కళ్యాణ్ కి ఉన్న సాఫ్ట్ కార్నర్ ని టైటిల్ గెలిచేందుకు వాడుకుంటోంది అని అర్థం అవుతోంది. భరణి మాట్లాడుతూ.. కళ్యాణ్ తనూజకి బాగా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాడు. తనూజ కూర్చోమంటే కూర్చుంటున్నాడు.. లేవమంటే లేస్తున్నాడు. తనూజ బాగా కమాండ్ చేస్తోంది అని భరణి అన్నారు. మరి తనూజ స్ట్రాటజీలో కళ్యాణ్ చిత్తవుతాడో.. పోటీ ఇస్తాడో వేచి చూడాలి.