Ameesha Patel: నాలో సగం ఏజ్‌ కుర్రాళ్లు డేటింగ్‌కి రమ్ముంటున్నారు, 50ఏళ్లు అయినా ఫర్వాలేదు పెళ్లికి రెడీ

Published : Dec 10, 2025, 01:27 PM IST

పవన్‌ కళ్యాణ్‌ నటించిన `బద్రి` చిత్రంలో నటించి మెప్పించిన అమీషా పటేల్‌ పెళ్లికి సిద్ధమంటోంది. తనకంటే ఏజ్‌లో సగం వయసున్న వాళ్లు కూడా డేటింగ్‌కి రమ్ముంటున్నారట. 

PREV
14
50ఏళ్లు అయినా ఒంటరిగానే ఉన్న అమీషా పటేల్‌

హీరోయిన్లు చాలా మంది యాభై ఏళ్లు దాటినా పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే ఉండిపోయారు. అలా ఒంటరిగా ఉన్న హీరోయిన్‌లలో అమీషా పటేల్‌ ఒకరు. ఆమె ఏజ్‌ 50 ఏళ్లు. అయినా ఇప్పటికీ ఒంటరిగానే ఉంది. ఆ మధ్య తనకు పెళ్లిపై ఆసక్తి లేదని చెప్పింది. డేటింగ్‌పై ఆసక్తిని వెల్లడించింది. తాజాగా ఆమె పెళ్లి కి రెడీ అంటోంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను పంచుకుంది. తనలో సగం ఏజ్‌ ఉన్న కుర్రాళ్లు కూడా డేటింగ్‌కి రమ్మంటున్నారని చెప్పింది.

24
నాలో సగం ఏజ్‌ కుర్రాళ్లు డేటింగ్‌కి రమ్ముంటున్నారు

ఆమె మాట్లాడుతూ, `నా వయసులో సగం ఉన్న కుర్రాళ్లు కూడా ఇప్పుడు నన్ను డేటింగ్‌కి పిలుస్తున్నారు. ఈ విషయంలో నేను ఓపెన్‌గానే ఉన్నాను. వయసు అనేది కేవలం నెంబర్‌ మాత్రమే. మానసిక పరిపక్వత, పాజిటివ్‌ మైండ్‌ సెట్‌ ఉంటే ఎవరినైనా ఎంచుకోవడానికి నేను సిద్ధమే. పెళ్లి చేసుకునేందుకు రెడీనే` అని చెప్పింది అమీషా పటేల్‌. ప్రస్తుతం ఆమె కామెంట్స్ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అదే సమయంలో నెటిజన్ల నుంచి డేటింగ్‌, మ్యారేజ్‌ ప్రపోజల్స్ వస్తున్నాయి.

34
అమీషా పటేల్‌ తెలుగు సినిమాలు

తాము చాలా విశాలహృదయంతో ఉన్నామని, డేటింగ్‌ చేయడానికి రెడీనే అంటున్నారు. రచ్చ రచ్చ చేస్తున్నారు. మొత్తంగా అమీషా పటేల్‌ ఇప్పుడు సోషల్‌ మీడియా అటెన్షన్‌ తనవైపుకి తిప్పుకుందని చెప్పొచ్చు. అమీషా పటేల్‌.. పవన్‌ కళ్యాణ్‌ హీరోగా నటించిన `బద్రి` చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇందులో పవన్‌తో రొమాన్స్ చేసి మెప్పించింది. మంచి విజయాన్ని అందుకుంది. కానీ ఆ తర్వాత వరుసగా పరాజయాలు వెంటాడాయి. `బద్రి` తర్వాత అమీషా పటేల్‌ `నాని`, `నరసింహుడు`, `పరమవీర చక్ర` చిత్రాల్లో నటించింది. ఈ మూవీస్‌ ఆడలేదు. దీంతో తెలుగుకి దూరమయ్యింది. కేవలం బాలీవుడ్‌ కే పరిమితమయ్యింది.

44
గ్లామర్‌ ట్రీట్‌తో ఆకట్టుకుంటోన్న అమీషా పటేల్‌

ఆ మధ్య `ఆకతాయి` అనే సినిమాలో స్పెషల్‌ సాంగ్‌ చేసింది. ఇక చాలా ఏళ్ల తర్వాత `గదర్‌ 2` చిత్రంతో బ్లాక్‌ బస్టర్‌ అందుకుంది. బౌన్స్ బ్యాక్‌ అయ్యింది. అయినా ఒకటి అర ఆఫర్లతోనే సరిపెట్టుకుంటోంది. కాకపోతే సోషల్‌ మీడియాలో మాత్రం ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటోంది. గ్లామర్ విందుని వడ్డిస్తూ నెటిజన్లని ఆకర్షిస్తోంది. యాభై ఏళ్లలోనే 20ఏళ్ల అమ్మాయిలా మెరిసిపోతుంది. తన అందంతో అందరిని ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలోఇప్పుడు ఆమె పెళ్లికి రెడీ అనడం విశేషం.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories