Thanuja: ఇదీ తనూజ అసలు స్వరూపం, విన్నర్ అయ్యే ఛాన్స్ గోవిందా.. ఆమెకి ఎలివేషన్స్ ఇచ్చి వేస్ట్

Published : Dec 14, 2025, 11:57 AM IST

బిగ్ బాస్ తెలుగు 9 చివరి దశలో ఉండగా తనూజ నెగిటివిటీ సొంతం చేసుకుంటోంది. టైటిల్ రేసులో ఉన్న కంటెస్టెంట్స్ లలో తనూజ కూడా ఒకరు. తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు. 

PREV
15
బిగ్ బాస్ తెలుగు 9

బిగ్ బాస్ తెలుగు 9 లో విన్నర్ రేసులో ప్రధానంగా ముగ్గురు కంటెస్టెంట్స్ ఉన్నారు. తనూజ, ఇమ్మాన్యుయేల్, కళ్యాణ్ ముగ్గురూ టైటిల్ రేసులో ఉంటారని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. అదే తరహాలో ముగ్గురూ గేమ్ స్ట్రాటజీతో దూసుకుపోతున్నారు. ఇమ్మాన్యుయేల్ ఎంటర్టైన్మెంట్ అందిస్తూ, టాస్క్ లలో గట్టిగా పోరాడుతున్నాడు. అప్పుడప్పుడూ అతడిలో ఎమోషనల్ యాంగిల్ కూడా బయట పడుతోంది. 

25
టైటిల్ రేసులో ముగ్గురు 

ఇక తనూజ అయితే ఏమాత్రం వెనక్కి తగ్గకుండా బలంగా తన వాదన వినిపిస్తుంది. టాస్క్ లలో కూడా పోరాడుతుంది. కాకపోతే చిన్న ఎదురుదెబ్బ ఎదురైనా కన్నీళ్లు పెట్టుకోవడం తనూజకి అలవాటు. ఈ విషయంలో ఆమెపై అభిమానుల్లో కంప్లైంట్స్ ఉన్నాయి. కళ్యాణ్ కంప్లీట్ క్లారిటీతో తన గేమ్ స్ట్రాటజీ అప్లై చేస్తున్నాడు. పాజిటివ్ అయినా, నెగిటివ్ అయినా బలంగా తన వాదన వినిపిస్తాడు. కామనర్ అనే సింపతీ కూడా ఉంది. 

35
డబ్బు కోసం అవకాశం వదులుకున్న తనూజ 

ఇదిలా ఉండగా చివరి దశలో తనూజ ఆడియన్స్ లో నెగిటివిటీ సొంతం చేసుకుంటోంది. కష్టపడి ఫైనలిస్ట్ గా అవకాశం పొందే టాస్క్ లలో తనూజ విజయం సాధించిన సంగతి తెలిసిందే. కానీ ఫైనలిస్ట్ గా అర్హత పొందేందుకు ఆమె అంగీకరించలేదు. తనూజ ఫైనలిస్ట్ గా ఛాన్స్ దక్కించుకోవాలి అంటే బిగ్ బాస్ విన్నర్ ప్రైజ్ మనీలో నుంచి 3 లక్షలు తగ్గించబడుతుంది అని బిగ్ బాస్ తెలిపారు. ఈ నిబంధనకు అంగీకరిస్తేనే ఫైనలిస్ట్ గా అవకాశం ఉంటుందని తెలిపారు. కానీ తనూజ బిగ్ బాస్ ఆఫర్ ని తిరస్కరించింది. డబ్బు కోసం తనూజ అంత పెద్ద అవకాశాన్ని వదులుకుందా అని కొందరు విమర్శలు చేస్తున్నారు. 

45
డబ్బు యాడ్ చేస్తే ఒకే 

దీని గురించి నాగార్జున తనూజని ప్రశ్నించారు. 3 లక్షలు తగ్గితే ఇమ్మాన్యూనిటీని రిజెక్ట్ చేస్తావా అని అడిగారు. అది నా డబ్బు అయితే ఆలోచించేదానిని కాదు.. ఇంకొకరి డబ్బు కదా అని వద్దని చెప్పినట్లు తనూజ లాజిక్ చెప్పింది. అంటే విన్నర్ నువ్వు కాదని ఇప్పుడే డిసైడ్ అయిపోయావా అని నాగార్జున సెటైర్ వేశారు. ఒక వేళ ప్రైజ్ మనీకి 3 లక్షలు యాడ్ అయితే ఇమ్మ్యూనిటీ తీసుకుంటావా అని నాగార్జున అడిగారు. వెంటనే తనూజ.. తీసుకుంటాను అని చెప్పేసింది. అక్కడే ఆమె దొరికిపోయింది. 

55
తనూజకి ఇచ్చిన ఎలివేషన్స్ వేస్ట్ 

డబ్బులు ఇస్తే ఆడియన్స్ గుర్తుకు రారా.. అప్పుడు ఆడియన్స్ నిర్ణయం అవసరం లేదా అని నాగార్జున ప్రశ్నించారు. డబ్బులు తీసేస్తే మాత్రం ఆడియన్స్ నిర్ణయం ప్రకారం వెళతానని తనూజ చెప్పింది. డబ్బులు యాడ్ చేస్తాం అంటే వెంటనే ఒప్పేసుకుంది. దీనితో తనూజని కొందరు దుమ్మెత్తి పోస్తున్నారు. కొందరు నెటిజన్లు.. తనూజకి ఆమె అభిమానులు ఇంతకాలం ఇచ్చిన ఎలివేషన్స్ మొత్తం వేస్ట్ అని కామెంట్స్ చేస్తున్నారు. డబ్బు విషయంలో తనూజ మాట్లాడిన ఒక్క మాట వల్ల నెగిటివిటి సొంతం చేసుకుంది అని, విన్నర్ అయ్యే క్రమంలో ఇది ఆమెకి పెద్ద మైనస్ అని అంటున్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories