బయట సరిపోక బిగ్‌ బాస్‌కి వచ్చావ్‌.. నువ్వు అందరిని వాడుకుంటావ్‌.. హద్దులు మీరి తిట్టుకున్న తనూజ, దివ్య

Published : Nov 21, 2025, 11:54 PM IST

బిగ్‌ బాస్‌ తెలుగు 9వ సీజన్‌ రణరంగమే అని నాగార్జున పదేపదే అంటుంటారు. కానీ ఈ రోజు ఆ డైలాగ్‌కి న్యాయం జరిగింది. తనూజ, దివ్యల మధ్య గొడవ హౌజ్‌లో రణరంగమనే వాతావరణం క్రియేట్‌ అయ్యింది. 

PREV
16
దివ్య, తనూజ మధ్య కెప్టెన్సీ వార్

బిగ్‌ బాస్‌ తెలుగు 9వ సీజన్‌ ముగింపు చేరుకునే కొద్ది మరింత ఆసక్తికరంగా మారుతుంది. ప్రారంభంలో చాలా డల్‌గా సాగిన ఈ షో ఇప్పుడు రక్తికట్టిస్తోంది. తాజాగా బిగ్‌ బాస్ హౌజ్‌ రచ్చ రచ్చగా మారింది. ఫ్యామిలీ వీక్ కంప్లీట్‌ అయిన తర్వాత హౌజ్‌లో తనూజ, దివ్యల మధ్య గొడవ తారా స్థాయికి చేరుకుంది. వ్యక్తిగతంగా తిట్టుకునే స్థాయికి, వ్యక్తిత్వాన్ని బయటపెట్టుకునే స్థాయికి దిగజారి తిట్టుకోవడం షాకిస్తుంది. అంతేకాదు ఇతర కంటెస్టెంట్లు కంట్రోల్ చేయకపోతే కొట్టుకునే స్థాయికి వెళ్లినా ఆశ్చర్యం లేదేమో అనేంతగా సాగింది. శుక్రవారం ఎపిసోడ్‌లో అంతటి దారుణమైన వాతావరణం బిగ్‌ బాస్‌ హౌజ్‌లో చోటు చేసుకుంది. కెప్టెన్సీ వార్ తారాస్థాయికి చేరుకుంది. 

26
కెప్టెన్సీ టాస్క్ లో తనూజని టార్గెట్ చేసిన దివ్య

బిగ్‌ బాస్‌ తెలుగు 9 శుక్రవారం(75వ ఎపిసోడ్‌)లో చివరగా ఇమ్మాన్యుయెల్‌ తల్లి వచ్చింది. ఆయనతో మాట్లాడి, సరదాగా నవ్వించి వెళ్లిపోయింది. దీంతో ఫ్యామిలీ వీక్‌ ముగిసింది. అనంతరం కెప్టెన్సీ టాస్క్ ఇచ్చాడు బిగ్‌ బాస్‌. ఉన్నవారిలో ఫిల్టర్‌ చేసే ప్రాసెస్‌లో భాగంగా ఈ వారం కెప్టెన్సీ టాస్క్ కి అర్హులు ఎవరు కాదనేది చెప్పాలన్నారు. అందులో భాగంగా ఇప్పుడు కెప్టెన్‌గా ఉన్న తనూజని తప్పించింది దివ్య. ఆల్‌రెడీ కెప్టెన్‌గా ఉన్నావ్ కాబట్టి వెంటనే వద్దు అనే ఉద్దేశ్యంతో ఆమె తనూజ పేరు చెప్పింది. ప్రతిసారి తన పేరునే తీసుకొస్తుందని చెప్పింది తనూజ ఫైర్ అయ్యింది.

36
పిచ్చి పిచ్చిగా మాట్లాడకు

దీంతో తనూజ, దివ్యల మధ్య వాదన స్టార్ట్ అయ్యింది. మాట మాట పెరిగిపోయింది. దారుణంగా తిట్టుకునే స్థాయికి చేరుకుంది. వాదనలు జరిగే క్రమంలో నువ్వేంటో నీ బిహేవియరే చెబుతుందని దివ్యని తనూజ అన్నది. దీంతో నా బిహేవియర్ ఏంటంటూ మండిపడింది దివ్య. ఏం బిహేవియర్‌ అంటూ ప్రశ్నింది. దీనికి తనూజ కూడా అరిచింది. నువ్వు అరిస్తే నేను అరుస్తా అంటూ వాయిస్‌ రైజ్‌ చేసింది దివ్య. దీంతో పీక్‌లో అరుచుకున్నారు ఇద్దరు. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు అంటూ తనూజకి దివ్య వార్నింగ్‌ ఇచ్చింది. ప్రతిదీ నీకు నచ్చినట్టు పోట్రే చేస్తున్నావని కామెంట్‌ చేసింది తనూజ. పోట్రే చేసేదేంటి? అంటూ నీ లిమిట్స్ లో నువ్వు ఉండూ అంటూ మండి పడింది దివ్య.  

46
బయట సరిపోక లోపలికి వచ్చావ్‌

ఈ క్రమంలో ఇద్దరు ఒకరిపై ఒకరు వెటకారంగా రియాక్ట్ అయ్యారు. కామెంట్లు చేసుకున్నారు. వెటకారంలో నేను తోపు అంటూ దివ్య చెప్పింది. అదే నువ్వేంటో అర్థమవుతుందని తనూజ చెప్పింది. నువ్వు ఫేక్‌ అంటూ దివ్య అన్నది, దానికి తనూజ కూడా గట్టిగానే రియాక్ట్ అయ్యింది. ఈ క్రమంలో తనూజ కంట్రోల్‌ తప్పింది. బయట సరిపోక లోపలికి వచ్చావంటూ కామెంట్‌ చేసింది. దీంతో అందరు షాక్‌ అయ్యారు. బయట ఏం సరిపోలేదు, ఏం మాట్లాడుతున్నావంటూ ఫైర్‌ అయ్యింది దివ్య. ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో, రెస్పెక్ట్ ఏంటో కూడా తెలియదటూ ఫైర్‌ అయ్యింది దివ్య.

56
నీకు అందరు కావాలి

ఈ క్రమంలో ఇద్దరూ పీక్‌లో అరుస్తూ మీద మీదకు వెళ్లారు. అదే సమయంలో నీకు అందరు కావాలి, అందరు నీ భజనే చేయాలి, నీ చుట్టే తిరగాలని అనుకుంటావని, అలా చేస్తావంటూ దివ్య కూడా గట్టిగానే కౌంటర్‌ ఇచ్చింది. దీంతో ఇద్దరు తారాస్థాయిలో అరుస్తూ గొడవపడ్డారు. వీరి మధ్యలోకి భరణిని కూడా లాగారు. ఆయన నన్నెందుకు లాగారని ఫైర్‌ అయ్యారు. కాసేపు హౌజ్‌లో సునామీలాంటి వాతావరణం చోటు చేసుకుంది. కొట్టుకుంటారేమో అనేంతగా మీద మీదకు వెళ్లడం గమనార్హం. వీరి గొడవ హౌజ్‌ని షేక్‌ చేసింది.

66
కెప్టెన్‌గా రీతూ చౌదరీ విన్నర్

అనంతరం ఈ టాస్క్ లోనే రీతూ, తనూజలు ఇమ్మాన్యుయెల్‌ పేరు చెప్పారు. మొత్తంగా తనూజ ఈ వారం కెప్టెన్సీ టాస్క్ నుంచి తప్పుకుంది. అనంతరం బిగ్‌ బాస్‌ హౌజ్‌ని రెండు టీమ్‌లుగా విడగొట్టారు. రెడ్‌ టీమ్‌లో ఇమ్మాన్యుయెల్‌, సంజనా, భరణి, దివ్యలు.. బ్లూ టీమ్‌లో కళ్యాణ్‌, రీతూ, డీమాన్‌ పవన్‌, సుమన్‌ శెట్టిలు ఇచ్చారు. వీరికిచ్చిన టాస్క్ లో రీతూ, సుమన్‌ శెట్టి ఫైనల్‌ గేమ్‌కి ఎంపికయ్యారు. ఇందులో రీతూ చౌదరీనే గెలిచి ఈ వారం కెప్టెన్‌ అయ్యింది. దీంతో ఆమె ఆనందానికి అవదుల్లేవ్‌.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories