`అఖండ 2` ట్రైలర్‌ రివ్యూ.. రెండు పాత్రల్లో బాలయ్య విశ్వరూపం చూశారా? బాక్సాఫీసులు షేక్‌ అవ్వాల్సిందే

Published : Nov 21, 2025, 08:37 PM IST

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తోన్న నాల్గో చిత్రం `అఖండ 2`. ఈ మూవీ ట్రైలర్‌ని తాజాగా విడుదల చేశారు. ఇందులో బాలయ్య విశ్వరూపం చూపించారు. 

PREV
15
`అఖండ 2` సందడి షురూ

బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ `అఖండ 2`. వచ్చే నెలలో ఇది ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో సంయుక్త హీరోయిన్‌గా నటించింది. ఆది పినిశెట్టి విలన్‌గా చేశారు. పూర్ణ కీలక పాత్రలో నటించారు. బాలయ్య కూతురు తేజస్విని సమర్పణలో 14 రీల్స్ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీ ఆచంట నిర్మించారు. డిసెంబర్‌ 5న సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ఇప్పటికే ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది టీమ్‌. మూవీ నుంచి రెండు పాటలను విడుదల చేశారు. ఇప్పుడు ట్రైలర్‌ని విడుదల చేశారు.

25
`అఖండ 2` ట్రైలర్ వచ్చేసింది

బెంగుళూరులో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన ట్రైలర్‌ ఈవెంట్‌లో `అఖండ 2` ట్రైలర్‌ని విడుదల చేశారు. ఇందులో బాలయ్య విశ్వరూపం చూడొచ్చు. ఆయన రెండు పాత్రల్లో రెచ్చిపోయారు. మెయిన్‌గా ఇందులో అఘోర పాత్రని హైలైట్‌ చేశారు. శివతత్వాన్ని పునికి పుచ్చుకుని ఆయన చేసిన రచ్చ వేరే లెవల్‌ అని చెప్పొచ్చు. డైలాగ్స్ పరంగా, యాక్షన్‌ పరంగా రెచ్చిపోయారు. మరో పాత్రలోనూ యాక్షన్‌తో అదరగొట్టారు. కానీ అఘోర పాత్రని మెయిన్‌గా చూపించారు.

35
`అఖండ 2` ట్రైలర్ రివ్యూ

అఘోర పాత్ర ద్వారా భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను, సనాతన ధర్మాన్ని చాటి చెప్పే ప్రయత్నం చేశారు బాలయ్య. ఆయన చెప్పే డైలాగ్‌లు అదిరిపోయాయి. చాలా పవర్‌ఫుల్‌గా ఉన్నాయి. అయితే ఇందులో ధర్మం, సనాతన ధర్మం గురించే ఎక్కువగా ఉంది.  సందేశంతోపాటు ఎమోషన్స్ కూడా ఉన్నాయి. తల్లి కొడుకుల మధ్య సెంటిమెంట్‌, ఎమోషన్స్ ని ఆవిష్కరించిన తీరు కూడా బాగుంది. ఫ్యామిలీ ఎలిమెంట్లు ఉన్నాయి. బోయపాటి అన్ని అంశాలను మేళవించి సినిమా చేస్తారు. ఇందులోనూ ఆయా అంశాలు కనిపిస్తున్నాయి. ఫుల్‌ మీల్స్ అని చెప్పొచ్చు. కాకపోతే దైవత్వానికి సంబంధించిన అంశం హైలైట్‌గా ఉంది.

45
బాలయ్య విశ్వరూపం

దీంతోపాటు ఇక విలన్‌ గా ఆదిపినిశెట్టి కొత్తగా కనిపిస్తున్నారు. గతంలో ఎప్పుడూ చూడని విధంగా ఆయన లుక్‌ ఉండటం విశేషం. అత్యంత భయానకంగా ఆయన లుక్‌ ఉంది. బాలయ్యకి పోటీగా ఆయన నటన, యాక్షన్‌ చూపించారని ట్రైలర్‌లో అర్థమవుతుంది. ఇక ట్రైలర్‌లో `కష్టం వచ్చినా దేవుడు రాడు అని జనాన్ని నమ్మించాలి, అలా నమ్మిన రోజు భారతదేశం పునాది కదిలిపోతుంది` అని విలన్‌ వాయిస్‌తో ట్రైలర్‌ ప్రారంభమైంది. అనంతరం దేశం మొత్తం నలభై రోజులు జరుపుకునే ఉత్సవం మహాకుంభమేళకి సంబంధించిన సీన్లని చూపించారు. అంతలోనే ఆదిపినిశెట్టి పూజలు చేస్తూ `ఎనిమిది కంఠాలు తెగాలి, రక్తం చిందాలి` అని చెబుతూ ఆయన ఎంట్రీ ఇచ్చారు. అనంతరం ఫ్యామిలీ వైపు తిరిగింది. నేను చనిపోయిన రోజు వాడు వచ్చి కొరివి పెడితేనే ఈ కట్టే మట్టిలో కలిసేది అని బాలయ్య అమ్మ చెప్పడం ఎమోషనల్‌గా ఉంది.

55
మూడు గెటప్స్ లో బాలయ్య

 హిమాలయాల్లో యాక్షన్‌ తో ఆదిపినిశెట్టి మరోసారి విజృంభించారు. అనంతరం బాలయ్య అఘోర పాత్రలో ఎంట్రీ ఇచ్చారు. రావడం రావడంతోనే రెచ్చిపోయారు. `ఈ ప్రపంచంలో ఏ దేశం వెళ్లినా అక్కడ కనిపించేది ఒక మతం, కానీ ఈ దేశంలో ఎక్కడైనా కనిపించేది ఒక ధర్మం. సనాతన హైంధవ ధర్మం` అని చెబుతూ బాలయ్య యాక్షన్‌ తో విశ్వరూపం చూపించారు. మధ్యలో నరసింహ అవతారం కూడా చూపించడం విశేషం. `దేశం జోలికి వస్తే మీరు దండిస్తారు, దైవం జోలికి వస్తే మేం కండిస్తాం, మీ భాషలో చెప్పాలంటో సర్జికల్‌ స్ట్రైక్‌. మా దేవుడితో పెట్టుకోవడానికి మీకు ఎంత ధైర్యం, ఇప్పటి వరకు ప్రపంచ పటంలో నా దేశం రూపాన్ని మాత్రమే చూసి ఉంటావ్‌, ఎప్పుడూ నా దేశం విశ్వరూపాన్ని చూసి ఉండవు. మేం ఒక్కసారి లేచి శబ్ధం చేస్తే, ఈ ప్రపంచమే నిశ్శబ్దం` అంటూ బాలయ్య ఊగిపోయారు. ట్రైలర్‌ మాత్రం అదిరిపోయింది. మాస్‌ ఆడియెన్స్ కి ఫీస్ట్ లా ఉంది. ఎక్కువగా హిందుత్వ ధర్మాన్ని హైలైట్‌గా చేసి ఈ మూవీని రూపొందిస్తున్నట్టు అనిపిస్తుంది. ఇదిలా ఉంటే ఇందులో బాలయ్య మూడు గెటప్స్ లో కనిపించడం విశేషం. సినిమాలో చాలా సర్‌ప్రైజ్‌లున్నాయనిపిస్తోంది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories