తమ్ముడు నుంచి హరిహర వీరమల్లు వరకు.. పవన్ స్టంట్ కొరియోగ్రఫీ చేసిన మూవీస్, ఏవి హిట్టో ఏవి ఫ్లాపో తెలుసా

Published : Jul 21, 2025, 04:06 PM IST

హరిహర వీరమల్లు చిత్రంలో ఒక ఫైట్ సీన్ కి పవన్ కళ్యాణ్ కొరియోగ్రఫీ అందించారు. హరిహర వీరమల్లు మాత్రమే కాదు గతంలో పవన్ తాను నటించిన చాలా చిత్రాలకు ఫైట్స్ కొరియోగ్రఫీ చేశారు. ఆ చిత్రాలు ఏవో ఇప్పుడు చూద్దాం. 

PREV
15
హరిహర వీరమల్లు జూలై 24న వరల్డ్ వైడ్ రిలీజ్ 

ఐదేళ్ల పాటు షూటింగ్ జరుపుకుని, అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్న హరిహర వీరమల్లు చిత్రం ఎట్టకేలకు జూలై 24న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కి రెడీ అవుతోంది. తాజాగా పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు చిత్రం కోసం మీడియా సమావేశం నిర్వహించారు. సాధారణంగా సినిమాల కోసం పవన్ కళ్యాణ్  మీడియా సమావేశం నిర్వహించరు. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఈ చిత్రాన్ని పూర్తి చేసిన నిర్మాత ఏఎం రత్నం కోసమే ప్రెస్ మీట్ నిర్వహించినట్లు పవన్ తెలిపారు. 

25
నేను చేర్చుకున్న మార్షల్ ఆర్ట్స్ ఈ చిత్రానికి ఉపయోగపడ్డాయి 

ఈ చిత్రంలో ఫైట్స్ కొరియోగ్రఫీ గురించి పవన్ ఇంట్రెస్టింగ్ విషయాలు రివీల్ చేశారు. తాను గతంలో నేర్చుకున్న మార్షల్ ఆర్ట్స్ గురించి ప్రస్తావించారు. నేను ఎప్పుడో దేశ విదేశాల్లో నేర్చుకున్న మార్షల్ ఆర్ట్స్ ఇప్పుడు నాకు ఈ సినిమాకి పనికొచ్చాయి. కొరియోగ్రాఫర్స్ తో కూర్చొని క్లైమాక్స్ ను ప్రత్యేకంగా రూపొందించాము. సినిమాకి ఇదే ఆయువుపట్టు. సినిమా గురించి క్లుప్తంగా చెప్పాలంటే.. కృష్ణా నది తీరంలో కొల్లూరులో దొరికిన కోహినూర్ వజ్రం.. హైదరాబాద్ సుల్తాన్ల దగ్గరకు ఎలా వచ్చింది? ఆ తర్వాత ప్రయాణం ఎలా జరిగింది? ఈ నేపథ్యంలో జరిగే కథ ఇది అని పవన్ తెలిపారు.

35
20 నిమిషాల ఫైట్ సీన్ డిజైన్ చేసిన పవన్ 

పవన్ కళ్యాణ్ కొరియోగ్రఫీ చేసిన ఫైట్ సీన్ గురించి దర్శకుడు జ్యోతి కృష్ణ కూడా ప్రస్తావించారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు డిజైన్ చేసిన ఒక ఫైట్ ఉంది. ఆ ఎపిసోడ్ దాదాపు 20 నిమిషాలు ఉంటుంది. ఆ ఫైట్ లోనే ఒక కథ ఉంటుంది. ఆ ఒక్క ఎపిసోడ్ కి కీరవాణి గారికి సంగీతం చేయడానికి పది రోజులు పట్టింది. ఆ సీక్వెన్స్ చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే.. పవన్ గారు చూసే వీరమల్లు వేరే. పవన్ గారు అనుకున్న సినిమా వేరే. ఆయనలో ఉన్న ఫైర్ లో నుంచి డిజైన్ చేసిందే 'ధర్మం కోసం యుద్ధం'. 17వ శతాబ్దం మొఘల్స్ నేపథ్యంలో ఉండే సినిమా ఇది అని జ్యోతి కృష్ణ అన్నారు. 

45
పవన్ కళ్యాణ్ స్టంట్ కొరియోగ్రఫీ అందించిన చిత్రాలు 

హరిహర వీరమల్లు కాకుండా గతంలో చాలా చిత్రాలకు పవన్ కళ్యాణ్ ఫైట్స్ కొరియోగ్రఫీ చేశారు. స్టంట్ కొరియోగ్రాఫర్ గా రాణించారు. పవన్ కళ్యాణ్ స్టంట్ కొరియోగ్రఫీ చేసిన చిత్రాలని పరిశీలిద్దాం. పవన్ కళ్యాణ్ ఫైట్స్ కొరియోగ్రఫీ చేసిన తొలి చిత్రం తమ్ముడు. ఈ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది.  

ఆ తర్వాత పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రూపొందిన బద్రి చిత్రంలో కూడా పవన్ ఫైట్స్ కంపోజ్ చేశారు. ఆ చిత్రం కూడా సూపర్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత పవన్ ఫైట్స్ కంపోజ్ చేసిన చిత్రం ఖుషి. ఈ చిత్రానికి ఏఎం రత్నమే నిర్మాత. ఖుషి మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచి అనేక రికార్డులు కొల్లగొట్టింది. ఖుషి వరకు అంతా బాగానే జరిగింది. కానీ ఆ తర్వాత పవన్ ఫైట్స్ కంపోజ్ చేసిన చిత్రాలు ఫ్లాప్ అవుతూ వచ్చాయి. 

55
చిరంజీవి డాడీ చిత్రానికి కూడా..

తన సోదరుడు మెగాస్టార్ చిరంజీవి డాడీ చిత్రానికి కూడా పవన్ కళ్యాణ్ స్టంట్ కొరియోగ్రాఫర్ గా పనిచేశారు. ఆ చిత్రం యావరేజ్ గా నిలిచింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గుడుంబా శంకర్, సర్దార్ గబ్బర్ సింగ్, అజ్ఞాతవాసి చిత్రాలకు కూడా స్టంట్ కొరియోగ్రఫీ చేశారు. కానీ ఈ చిత్రాలన్నీ దారుణంగా నిరాశపరిచాయి.

Read more Photos on
click me!

Recommended Stories