మిగిలిన హీరోలతో పోల్చితే నేను తక్కువ.. చిరంజీవి తమ్ముడైనా కొడుకైనా ట్యాలెంట్ లేకుంటే నిలబడలేరు

Published : Jul 21, 2025, 01:47 PM IST

మిగిలిన హీరోలతో తన మార్కెట్ ని పోల్చుతూ పవన్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. చిత్ర పరిశ్రమలో నిలబడాలంటే చిరంజీవి తమ్ముడికైనా ట్యాలెంట్ ఉండాల్సిందే అని పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

PREV
15
ఏఎం రత్నంపై పవన్ ఎమోషనల్ కామెంట్స్

పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు ప్రెస్ మీట్ లో చేసిన కొన్ని కామెంట్స్ చర్చనీయాశం అవుతున్నాయి. ఏఎం రత్నం గురించి పవన్ కళ్యాణ్ ఎమోషనల్ గా మాట్లాడారు. ఏఎం రత్నం ఒకప్పుడు పాన్ ఇండియా చిత్రాలు తీసిన నిర్మాత. దర్శకులు, హీరోలు, డిస్ట్రిబ్యూటర్లు ఆయన వెంటపడేవారు. అలాంటి నిర్మాత ఇప్పుడు నలిగిపోతుంటే చూడలేకపోయాను. ఆయన కోసమే ఈ మీడియా సమావేశం నిర్వహించా అని పవన్ కళ్యాణ్ అన్నారు. 

25
డైరెక్టర్ క్రిష్ పై కామెంట్స్ 

ఖుషి చిత్రం సమయంలో ఏఎం రత్నం గారు నాకు ఎంతో లగ్జరీ ఇచ్చారు. అలాంటి నిర్మాత నలిగిపోతుంటే బాధగా అనిపించింది. ఈ చిత్రం ఎంత పెద్ద విజయం సాధిస్తుంది అనేది చెప్పలేను.. కానీ డైరెక్టర్ క్రిష్ మాత్రం అద్భుతమైన కాన్సెప్ట్ తీసుకువచ్చారు అది మాత్రం చెప్పగలను అని పవన్ అన్నారు. ఎన్నో అద్భుతమైన చిత్రాలు నిర్మించిన ఏఎం రత్నం గారు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో ఈ చిత్రం కోసం సమయం కేటాయించాను. 

35
మిగిలిన హీరోలతో పోల్చితే నేను చాలా తక్కువ 

 ఈ చిత్రానికి ఆర్థిక సమస్యలు కూడా వచ్చాయి. నాకు రాజకీయంగా పేరు ఉండొచ్చేమో కానీ సినిమాలలో చాలా మంది హీరోలతో పోల్చితే నేను తక్కువ. వాళ్ళ సినిమాలకు జరిగినంత బిజినెస్ నా సినిమాలకు జరగకపోవచ్చు అని పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

45
చిరంజీవి తమ్ముడైనా ట్యాలెంట్ ఉండాల్సిందే 

ఈ చిత్రంలో నటీనటుల ఎంపిక కూడా చాలా బాగా జరిగింది. ముఖ్యంగా బాబీ డియోల్ గారు ఔరంగజేబు పాత్రలో చాలా చక్కగా ఒదిగిపోయారు అని పవన్ కళ్యాణ్ ప్రశంసలు కురిపించారు. నేను డిప్యూటీ సీఎం అయిన తర్వాత.. పాలనా సమయానికి ఇబ్బంది కలగకుండా, నా వ్యక్తిగత సమయాన్ని ప్రతి రోజూ రెండు గంటలు కేటాయించాను. అందుకు తగ్గట్టుగా జ్యోతికృష్ణ, పరమహంస గారు షూట్ ని ప్లాన్ చేశారు. అవుట్ పుట్ అద్భుతంగా వచ్చింది. చిత్ర పరిశ్రమలో కులాలు, వర్గాలు, కుటుంబాలు పనిచేయవు. నువ్వు చిరంజీవి తమ్ముడివైనా, కొడుకువైనా, మేనల్లుడివైనా ట్యాలెంట్ లేకుంటే నిలబడలేరు అని పవన్ కళ్యాణ్ అన్నారు. 

55
ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఏఎం రత్నం పేరు ప్రతిపాదన 

నాకు ఇష్టమైన నిర్మాత, తెలుగు పరిశ్రమకు అండగా ఉన్న నిర్మాత రత్నం గారి బెస్ట్ ఇవ్వాలి అనుకున్నాను. ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా రత్నం గారి పేరుని ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి నేను ప్రతిపాదించాను. నా నిర్మాత అని కాదు.. ఇలాంటి వ్యక్తి ఉంటే సినీ పరిశ్రమ బాగుంటుందని ప్రతిపాదించాను అని పవన్ తెలిపారు. 

Read more Photos on
click me!

Recommended Stories