Superstar Krishna: పోలీస్‌ గుర్రం అని ఎక్కితే ముళ్ల కంపలో పడేసింది, సూపర్‌స్టార్‌ కృష్ణ జీవితంలో మర్చిపోలేని ఘటన

Published : Jul 21, 2025, 03:28 PM IST

సూపర్‌ స్టార్‌ కృష్ణ `మోసగాళ్లకి మోసగాడు` మూవీ షూటింగ్‌లో షాకింగ్‌ ఎక్స్ పీరియెన్స్ ని ఫేస్‌ చేశారు. పోలీస్‌ గుర్రం ఆయన్ని ముళ్ల కంపలో పడేసింది. 

PREV
15
సాహసాల వీరుడిగా పేరు తెచ్చుకున్న కృష్ణ

సూపర్‌ స్టార్‌ కృష్ణ సాహసాల వీరుడు అనే చెప్పాలి. ఆయన సినిమాల్లో ఎన్నో సాహసాలు చేశారు. తెలుగు సినిమాల్లో ప్రయోగాలు ఎక్కువగా చేసిన నటుడు కృష్ణ అనే చెప్పాలి. 

సినిమా పరంగా కావచ్చు, సినిమా జోనర్స్, పాత్రల పరంగానూ కావచ్చు పలు ప్రయోగాలు చేసి విజయం సాధించింది. ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచారు.

 అయితే అలాంటి సాహసాల వీరుడుకి ఓ గుర్రం ఝలక్‌ ఇచ్చింది. పోలీస్‌ గుర్రం అని ఎక్కితే తీసుకెళ్లి ముళ్ల కంపలో పడేసిందట. ఆ కథేంటో చూద్దాం.

25
ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌ల తర్వాత ఆ స్థాయిలో ఇమేజ్‌ తెచ్చుకున్న కృష్ణ

సూపర్‌ స్టార్‌ కృష్ణ మాస్‌, యాక్షన్‌ మూవీస్‌తో ఆకట్టుకున్నారు. ఎన్టీఆర్‌ తర్వాత అలాంటి కమర్షియల్‌ మాస్‌ యాక్షన్‌ సినిమాలతో మెప్పించారు. ఓ దశలో రామారావుకే పోటీ ఇచ్చారు.

 ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌ ల తర్వాత ఆ స్థాయి ఇమేజ్‌ని, స్టార్‌ స్టేటస్‌ని దక్కించుకున్న సూపర్‌ స్టార్‌ తెలుగు సినిమా కొత్త పుంతలను తొక్కించడంలో తన పాత్ర కీలకమని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

35
`మోసగాళ్లకి మోసగాడు` మూవీ

ప్రయోగాలు చేసే క్రమంలో, సినిమా షూటింగ్‌లో సాహసాలు చేసే క్రమంలో నటీనటులకు దెబ్బలు తగలడం, గాయాలపాలు కావడం తరచూ జరుగుతుంటాయి. 

సూపర్‌ స్టార్‌ కృష్ణ కూడా గాయపడ్డారు. చాలా సార్లు గాయాలపాలు అయినట్టు చెప్పిన కృష్ణ.. గుర్రం తనని కింద పడేసిన ఘటనని పంచుకున్నారు. తెలుగు సినిమాల్లోనే కాదు ఇండియాలోనే కౌబాయ్‌ క్యారెక్టర్‌ చేసింది కృష్ణ అనే చెప్పాలి. 

ఆయన `మోసగాళ్లకి మోసగాడు` అనే చిత్రంలో కౌ బాయ్‌ పాత్రని పోషించి మెప్పించారు. ఓ కొత్త అనుభూతిని తెలుగు ఆడియెన్స్ కి ఇచ్చారు. ఇప్పటికీ ఈ సినిమా తెలుగు సినిమా చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకుంటుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

45
కృష్ణని ముళ్ల కంపలో పడేసిన పోలీస్‌ గుర్రం

`మోసగాళ్లకి మోసగాడు` మూవీ బికినీర్‌లో ఓ డిజర్ట్ లో షూటింగ్‌ చేశారట. ఆ సమయంలో వాళ్లు పోలీస్‌ గుర్రాలను ఉపయోగించారట. ఆ గుర్రాలు చాలా బలంగా ఉన్నాయట. 

ఆ గుర్రంపై ఎక్కి రైడ్‌ చేస్తున్నప్పుడు అది తీసుకెళ్లి ఓ ముళ్ల కంపలో పడేసిందట. అయితే అప్పుడు చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారట. మేజర్‌గా దెబ్బలు తగలలేదని, కానీ ఆ సంఘటన ఎప్పటికీ గుర్తుంటుందని చెప్పారు కృష్ణ. 

పోలీస్‌ గుర్రాలను బాగా మచ్చిక చేసుకోవాలి. లేదంటే అవి ఇలానే చేస్తాయి. అలవాటు లేని వ్యక్తులను ఆడుకుంటాయి. తన విషయంలోనూ అదే జరిగిందన్నారు కృష్ణ. ఓ పాత ఇంటర్వ్యూలో ఈ విషయాలను పంచుకున్నారాయన.

55
ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచిన `మోసగాళ్లకి మోసగాడు`

కృష్ణ, విజయ నిర్మల జంటగా నటించిన `మోసగాళ్లకి మోసగాడు` మూవీకి కె ఎస్‌ ఆర్‌ దాస్‌ దర్శకత్వం వహించారు. తన పద్మాలయ పిక్చర్స్ పై నిర్మించారు. ఆదిశేశగిరి రావు నిర్మాత. 1971లో ఈ చిత్రం వచ్చింది. సంచలన విజయం సాధించింది. 

బాక్సాఫీసుకి పూనకాలు తెప్పించింది. కృష్ణ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌ చిత్రాల్లో ఇదొకటిగా నిలిచింది. అప్పట్లోనే ఇదొక ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచిందని చెప్పొచ్చు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories