వరుస సినిమాలతో బిజీబిజీగా గడిపేస్తున్నాడు తమన్. ఆయన ఖాతాలో ప్రభాస్- మారుతి కాంబో రాజాసాబ్, పవన్ కల్యాణ్- ఓజీ, బాలకృష్ణ-అఖండ-2లాంటి బడా ప్రాజెక్టులు ఉన్నాయి. వీటితో పాటు మరికొన్ని సినిమాలకు కూడా తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇలాంటి సిచ్యువేషన్‌లో హీరోగా నటించేందుకు తమన్‌కు టైమ్ సెట్ అవుతుందా అనేది కూడా ఇంకో చర్చ. నిజంగానే హీరోగా నటించబోతున్నాడా లేదా సోషల్ మీడియా వార్త మాత్రమేనా అనేది అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇస్తే బాగుంటుంది.