Rajamouli , Prabhas combo : రాజమౌళి డైరెక్షన్ లో ప్రభాస్ కు నచ్చని రెండు సినిమాలు ఏవో తెలుసా..?

Published : Feb 02, 2025, 07:11 AM IST

Prabhas disliked Rajamouli  two Movies:  రాజమౌళి సినిమాలు నచ్చని వారు ఉండరు. అటువంటిది రాజమౌళి తో మూడు సినిమాలు చేసిన ప్రభాస్ కు జక్కన్న చేసిన రెండు సినిమాలు నచ్చలేదట. ఇంతకీ ఎంటా సినిమాలు..? 

PREV
15
Rajamouli , Prabhas combo :  రాజమౌళి డైరెక్షన్ లో  ప్రభాస్ కు నచ్చని రెండు సినిమాలు ఏవో తెలుసా..?
Rajamouli, rana daggubati show, baahubali

ఫిల్మ్ ఇండస్ట్రీలో ఓటమి ఎరుగని దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు రాజమౌళి.  కాస్త టైమ్ తీసుకుని సినిమాలు చేసినా.. ఆయన డైరెక్ట్ చేసిన ప్రతీ సినిమా సూపర్ హిట్ అవుతుండటం మనం చూస్తూనే ఉన్నాం. ఇండస్ట్రీలో ఈ రికార్డ్ ఇంకెవరి పేరు మీద లేదు. అంతే కాదు హీరోలను స్టార్ హీరోలను చేసిన ఘనత కూడా రాజమౌళికే దక్కుతుంది. 

Also Read: బాలయ్య ఎక్కడికి వెళ్లినా ఆ బ్యాగ్ ఉండాల్సిందే

25

ఇక టాలీవుడ్ ను హాలీవుడ్ రేంజ్ కు తీసుకెళ్ళి.. ఆస్కార్ సాధించిన  దర్శకుడు కూడా రాజమౌళినే. ఇక ఇలా చెప్పుకుంటూ వెళ్తే రాజమౌళి గురించి ఎంతైనా చెప్పవచ్చు. అవన్నీ పక్కన పెడితే.. రాజమౌళి సినిమాలు నచ్చని వారంటూ ఉండరు. సామాన్యులైనా సెలబ్రెటీలు అయినా.. జక్కన్న సినిమా రిలీజ్ అయితే చాలు హీరో ఎవరు అనేది కూడా పట్టించుకోకుండా వెళ్ళి చూసి వస్తుంటారు. 

Also Read: రంగస్థలం లో చెవిటి వాడిగా, బుచ్చిబాబు సినిమాలో గుడ్డివాడిగా రామ్ చరణ్

35

ఈక్రమంలో రాజమౌళి సినిమా నచ్చలేదు అనిచెప్పినవారు లేరు. అయితే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు మాత్రం రాజమౌళి చేసిన సినిమాల్లో రెండు సినిమాలు నచ్చవట. వేరే హీరోలు ఈ మాట అంటే ఏమో కాని.. రాజమౌళితో మూడు సినిమాలు చేసిన ప్రభాస్ అనడం విడ్డూరంగా ఉంటుందికదు. ప్రభాస్ కు రాజమౌళి డైరెక్ట్ చేసిన రెండుసినిమాలు ఎందుకో నచ్చలేదట. 

Also Read: Sr NTR Car Craze: సీనియర్ ఎన్టీఆర్ వాడిన కారు ఇప్పుడు ఎక్కడ ఉంది, ఎవరు సొంతం చేసుకున్నారు?

45

ఆ సినిమాలు ఏవో కాదు ఒకటి స్టూడెంట్ నెంబర్ వన్ కాగా..రెండోది యమదొంగ. ఈరెండు సినిమాలు ఎందుకో ప్రభాస్ కు కనెక్ట్ అవ్వలేదట. ఈ విషయాన్ని ప్రభాస్ స్వయంగా జక్కన్నతో కూడా చెప్పినట్టు తెలుస్తోంది. అంతే కాదు ఈరెండు సినిమాల్లో ఒకటి రాజమౌళి ప్రభాస్ తో చేయాలని అనుకున్నాడట. కాని కుదరలేదు. 

Also Read: పాకిస్థాన్ లో అల్లు అర్జున్ కు ఇంత క్రేజ్ ఉందా..?

55

ntr, prabhas

కాని రాజమౌళి డైరెక్షన్ లో ఎక్కువ సినిమాలు చేసిన హీరోల్లో ఒకరు ఎన్టీఆర్ అయితే మరొకరు ప్రభాస్. ఎన్టీఆర్ నాలుగు సినిమాలు చేస్తే.. ప్రభాస్ మూడు సినిమాలు చేశాడు. ఇక రామ్ చరణ్ రాజమౌళి డైరెక్షన్ లో రెండు సినిమాల్లో నటించాడు. అయితే ప్రభాస్ నచ్చలేదు అని చెపుతున్న రెండుసినిమాలు ఎన్టీఆర్ వే కావడం మరో విచిత్రం. ఈ వార్తలో నిజం ఎంతో తెలియదు కాని.. నెట్టింట్లో మాత్రం వైరల్ అవుతోంది. 


 

Read more Photos on
click me!

Recommended Stories