Michael Jackson: రజనీకాంత్ సినిమా కోసం మైఖేల్ జాక్సన్ పాడాల్సి ఉందా? ఏఆర్ రెహమాన్, మైఖేల్ జాక్సన్ కాంబినేషన్ గురించి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ చెప్పిన ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతోంది.
ఏఆర్ రెహమాన్, మైఖేల్ జాక్సన్ కలిసి రజనీకాంత్ సినిమా కోసం ఒక స్పెషల్ సాంగ్ చేయాలని ప్లాన్ చేశారట. ఈ విషయాన్ని మ్యూజిక్ డైరెక్టర్ తమన్ రీసెంట్‌గా బయటపెట్టాడు. ఇప్పుడు ఈ న్యూస్ ఫ్యాన్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఒక కొత్త సినిమా కోసం ఫేమస్ సింగర్ హనుమాన్‌కైండ్‌తో మాట్లాడుతున్నామని చెప్పిన తమన్.. ఈ పాత విషయాన్ని కూడా గుర్తుచేసుకున్నాడు.
25
పాత జ్ఞాపకాలను పంచుకున్న తమన్
ఏఆర్ రెహమాన్, మైఖేల్ జాక్సన్ కలిసి చేయాలనుకున్న ఆ పాట గురించి తమన్ పాత జ్ఞాపకాలను పంచుకున్నాడు. రజనీకాంత్ నటించిన 'ఎంథిరన్' సినిమా కోసం వీళ్లిద్దరూ ఒక వెరైటీ సాంగ్ ప్లాన్ చేశారట. జరగకుండా ఆగిపోయిన ఈ క్రేజీ మ్యూజిక్ కాంబినేషన్ గురించి ఇప్పుడు మళ్లీ చర్చ జరుగుతోంది.
35
మైఖేల్ జాక్సన్ మరణంతో ఆగిపోయింది..
రజనీకాంత్ సినిమా కోసం ఒక స్పెషల్ సాంగ్ చేయడానికి ఏఆర్ రెహమాన్, మైఖేల్ జాక్సన్ కలుసుకున్నారట. దీనికోసం 2009 మే నెలలో మైఖేల్ జాక్సన్ ఒక అగ్రిమెంట్‌పై సంతకం కూడా చేశాడని సమాచారం. కానీ ఆ తర్వాతి నెలలోనే, అంటే 2009 జూన్‌లో మైఖేల్ జాక్సన్ సడెన్‌గా చనిపోయాడు. దీంతో వీళ్లు చేయాలనుకున్న ఆ హిస్టారికల్ సాంగ్ బయటికి రాకుండానే ఆగిపోయింది.
శంకర్ డైరెక్షన్‌లో రజనీకాంత్ నటించిన 'రోబో' సినిమా 2010లో రిలీజ్ అయింది. ఇండియా వైడ్‌గా ఈ సినిమా పెద్ద హిట్ కొట్టింది. రజనీ కెరీర్‌లోనే ఇదొక మైలురాయి. ఒకవేళ ఈ సినిమాలో ఏఆర్ రెహమాన్, మైఖేల్ జాక్సన్ కలిసి పాట చేసి ఉంటే, అది వరల్డ్ వైడ్‌గా సెన్సేషన్ క్రియేట్ చేసేది. ఈ ప్లాన్ వర్కవుట్ కాకపోవడం ఫ్యాన్స్‌కు ఇప్పటికీ ఆశ్చర్యంగానే ఉంది.
55
రామ్ చరణ్ కోసం మరో ప్లాన్..
రామ్ చరణ్ హీరోగా వస్తున్న 'గేమ్ ఛేంజర్' సినిమాలో కూడా ఒక ఇంటర్నేషనల్ సాంగ్ చేయాలని ప్లాన్ చేశారట. శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలోని 'టాప్' సాంగ్ కోసం ఫేమస్ అమెరికన్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్‌ను తీసుకురావాలని ట్రై చేశారు. ఆ పాటను ఇంగ్లీష్‌లో రికార్డ్ చేసి వరల్డ్ వైడ్‌గా రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ షూటింగ్, రిలీజ్ లేట్ అవ్వడంతో ఆ ప్లాన్ కూడా డ్రాప్ అయిందని తమన్ బాధపడ్డాడు.