Samantha: సమంత తన అభిమానులకు అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చింది. ప్రస్తుతం 7 నెలల గర్భంతో ఉన్న సామ్.. ఇప్పుడు కొత్త ఛాలెంజ్‌కు రెడీ అయింది. ఇంతకీ ఆ ఛాలెంజ్ ఏంటో తెలుసాఝ సమంత చేయబోతున్న సాహసం ఏంటి?
సమంత తన సినిమాలతో పాటే ఇప్పుడు కొత్త ప్రయత్నాలకు శ్రీకారం చుట్టింది. పాపులర్ కుకింగ్ రియాలిటీ షో 'సెలిబ్రిటీ మాస్టర్ చెఫ్ తమిళ్'లో ఆమె భాగమైంది. ఇప్పటికే ఈ షో షూటింగ్ కూడా మొదలుపెట్టింది. ఈ షో షూటింగ్ కోసమే సమంత చెన్నైకి వచ్చింది. అయితే, ఈ షోలో సామ్ హోస్ట్‌గా చేస్తుందా లేక జడ్జిగానా అనేది ఇంకా అఫీషియల్‌గా ప్రకటించలేదు.
24
వంటల ప్రోగ్రామ్‌లో సెలబ్రిటీలు
సినిమాలు, వెబ్ సిరీస్‌లతో బిజీగా ఉండే సమంత.. ఇప్పుడు ఈ కుకింగ్ రియాలిటీ షో ద్వారా అభిమానులను అలరించనుంది. భోజనం అనేది మనుషులను కలిపే ఒక అద్భుతమైన సాధనం అని సామ్ గతంలోనే చెప్పింది. అందుకే ఈ షో ఆమెకు చాలా స్పెషల్ కానుంది.
ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన చాలా మంది సెలబ్రిటీలు ఈ షోలో కంటెస్టెంట్లుగా పాల్గొనబోతున్నారు. కెమెరా ముందు అదరగొట్టే స్టార్లు.. వంటగదిలో ఎలా కష్టపడతారో చూడాలని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
34
సమంత చెప్పిన ఇంట్రెస్టింగ్ విషయం
తనకు ఇష్టమైన సెలబ్రిటీలు వంట చేస్తూ చేసే తప్పులను, వాళ్లు ట్రై చేసే కొత్త వంటకాలను చూడటం తనకు చాలా ఇష్టమని సమంత చెప్పింది. కానీ, ఈ షోలో పాల్గొనే కంటెస్టెంట్ల లిస్ట్‌ను మాత్రం ఆమె ఇంకా బయటపెట్టలేదు.
ప్రపంచవ్యాప్తంగా సూపర్ హిట్ అయిన 'మాస్టర్ చెఫ్' ఫార్మాట్‌లోనే ఈ ప్రోగ్రామ్ కూడా రాబోతోంది. బనిజయ్ ఆసియా సంస్థ ఈ షోను నిర్మిస్తోంది. తమిళ స్టార్లతో పాటు అక్కడి వంటకాలు, సంస్కృతిని ఈ షోలో చూపించబోతున్నారు.
తన పర్సనల్ లైఫ్‌లో ఎంతో ముఖ్యమైన దశలో ఉన్న సమంత.. తన కెరీర్‌పై కూడా అంతే ఫోకస్ పెట్టింది. సినిమాలు, వెబ్ సిరీస్‌ల నుంచి ఇప్పుడు టీవీ రియాలిటీ షోల వైపు తన జర్నీని మార్చుకుంది.
'సెలిబ్రిటీ మాస్టర్ చెఫ్' షో త్వరలోనే సోనీ విజా ఛానెల్, సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఇందులో సమంత రోల్ ఏంటి? స్టార్లు వంటల పోటీలో ఎలా అదరగొడతారు? అనేది షో మొదలయ్యాకే తెలుస్తుంది.