`పుష్ప 2` సంగీత రహస్యం బయటపడింది.. అల్లు అర్జున్‌ ఫస్ట్ టైమ్‌ ప్రయోగం

First Published | Nov 15, 2024, 4:19 PM IST

`పుష్ప 2` సినిమాకి తమన్ కూడా సంగీతం అందిస్తున్నారనే వార్తలపై స్వయంగా తమనే స్పందించారు. దేవి శ్రీ ప్రసాద్‌తోపాటు తాను ఇందులో ఇన్‌వాల్వ్ అయినట్టు చెప్పాడు. ఓ రహస్యం బయటపెట్టాడు. 

Allu Arjun, #Pushpa2, sukumar

అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా కోసం అభిమానులు,  ప్రేక్షకులు ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. పుష్ప 2 సినిమా డిసెంబర్ 5న రిలీజ్ కానుంది. ట్రైలర్ 17వ తేదీన రానుంది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.

అయితే గత కొన్ని రోజులుగా పుష్ప 2 సినిమా గురించి రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. వీటిల్లో ప్రధానమైనది తమన్ ..ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇస్తున్నారని. ఆల్రెడీ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న సినిమాలోకి తమన్ ఎంట్రీపై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకీ తమన్ నిజంగానే సంగీతం ఇస్తున్నారా అనే  విషయమై క్లారిటీ ఇచ్చారు. 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.
 

Allu Arjun, #Pushpa2, sukumar


తమన్‌ మాట్లాడుతూ... నేను ‘పుష్ప2’లో సంగీతంలో ఒక పార్ట్‌ అంతే. అది చాలా పెద్ద ప్రాజెక్ట్‌. ఎంతోమంది దానికోసం వర్క్‌ చేస్తున్నారు. గొప్ప సినిమా. నేను కొంత భాగం మాత్రమే మ్యూజిక్‌ అందించాను. దర్శకుడు, హీరో చాలా ఆనందంగా ఫీలయ్యారు. నిర్మాతలు మనకు తల్లితో సమానం. వాళ్ల ప్లానింగ్ ప్రకారం  మనం వర్క్‌ చేయాలి. అవుట్‌పుట్‌ అదిరిపోయింది. నేను చేయగలిగినంత చేశాను అన్నారు.


Sreeleela, samantha,#Pushpa2


అలాగే  'పుష్ప 2' చాలా పెద్ద సినిమా అని, వ్యాపార పరంగానూ ఎన్నో లెక్కలు ఉంటాయని, కొన్నిసార్లు కొన్ని అంశాలను సవాలుగా తీసుకొని చేయవచ్చు అని, అయితే 15 రోజుల్లో చేయడం కుదరదు కనుక కొంత పార్ట్ వరకు తాను నేపథ్య సంగీతం చేశానని చెప్పారు. సినిమా అంతా తాను చూశానని, చాలా అద్భుతంగా ఉంది అని, 'పుష్ప 2' గొప్ప సినిమా అని ఆయన చెప్పారు.

అంతేకాదు ఇందులో చాలా మంది ఇన్‌వాల్వ్ అయ్యారట. ఇతర మ్యూజిక్‌ డైరెక్టర్స్ కూడా పనిచేస్తున్నారట. ఇది మరింత ఇంట్రెస్ట్ ని  క్రియేట్‌ చేస్తుంది.  బాలీవుడ్‌లో ఇద్దరు ముగ్గురు మ్యూజిక్‌ డైరెక్టర్లు పనిచేస్తారు. అదే ట్రెండ్‌ని `పుష్ప 2`కి ఇంప్లిమెంట్‌ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇదంతా బన్నీ ప్లాన్‌ అని టాక్‌. ఇదే నిజమైతే తెలుగులో ఫస్ట్ టైమ్‌ ఈ ప్రయోగం జరుగుతుందని చెప్పొచ్చు. 

ఈ సినిమా ట్రైలర్ పాట్నాలో ఈ నెల 17న విడుదల కానున్న సంగతి తెలిసిందే.  అభిమానుల సమక్షంలో అక్కడ భారీ ఈవెంట్ చేయడానికి ప్లాన్ చేసింది. డిసెంబర్ 5న 'పుష్ప 2' థియేటర్లలోకి భారీ ఎత్తున రానున్న సంగతి తెలిసిందే.

ఇండియాలో విడుదలకు ఒక్క రోజు ముందు... అంటే డిసెంబర్ 4న అమెరికాలో ప్రీమియర్ షోలు వేయనున్నారు. ఆ రోజు నుంచి బాక్స్ ఆఫీస్ బరిలో కలెక్షన్స్ సునామీ మొదలు అవుతుందని యూనిట్ అంచనా వేస్తోంది. ఇండియన్‌ బిగ్గెస్ట్‌ ఫిలిం 'పుష్ప-2 ది రూల్‌' అవుతుందని ట్రేడ్ లెక్కలు వేస్తోంది. 

Allu Arjun, #Pushpa2, sukumar


అల్లు అర్జున్, రష్మిక జంటగా నటించిన 'పుష్ప 2: ది రూల్' సినిమాను సుకుమార్‌ రైటింగ్స్‌ అసోసియేషన్‌, మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థలపై నవీన్‌ యేర్నేని, వై రవి శంకర్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు. అలాగే పాట్నాలో ట్రైలర్ లాంచ్ తర్వాత కలకత్తా, చెన్నయ్‌, కొచ్చి, బెంగళూరు, ముంబై, హైదరాబాద్‌ సిటీల్లో భారీ మాసివ్‌ ఈవెంట్స్ చేయడానికి ప్లాన్ చేశారు.

 మాలీవుడ్ స్టార్ ఫహాద్‌ ఫాజిల్‌, వెర్సటైల్ యాక్టర్ రావు రమేష్‌, కమెడియన్ నుంచి విలన్ రోల్స్ చేయడానికి షిఫ్ట్ అయిన సునీల్‌, అనసూయ భరద్వాజ్‌ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్. సాంగ్స్ అన్నీ ఆయన ఇచ్చారు. ఆయనతో పాటు తమన్ రీ రికార్డింగ్ చేస్తున్నారు.

read more:పుష్ప 2కి భారీగా ఛార్జ్ చేసిన రష్మిక, ఆ హీరో రెమ్యూనరేషన్ కంటే ఎక్కువ, ఎన్ని కోట్లు అంటే?

also read: గంగవ్వ ఎలిమినేషన్‌లో సంచలన నిజాలు, అంతా పక్కా ప్లాన్‌ ప్రకారమే జరిగిందా?

Latest Videos

click me!