పలువురు హీరోయిన్స్, మహిళలకు పరిశ్రమలో ఎదురైన చేదు అనుభవాలు సైతం కమిటీ రిపోర్ట్ లో పొందుపరిచారు. హేమ కమిటీ రిపోర్ట్ అనంతరం కొందరు మహిళలు ధైర్యంగా బటయకు వచ్చారు. తమపై లైంగిక వేధింపులకు పాల్పడిన దర్శక నిర్మాతలు, నటులపై ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా యంగ్ హీరోయిన్ కావ్య థాపర్ తనకు కూడా క్యాస్టింగ్ కౌచ్ ఎదురైందని వెల్లడించారు.
తనను నటిగా చూడాలన్నది కావ్య థాపర్ తండ్రి కల అట. అందుకే చదువు పూర్తి కాగానే నటన వైపు అడుగులు వేసిందట. యాడ్ లో నటించే ఆఫర్ ఉందని తెలిసి ఆడిషన్ ఇచ్చేందుకు ఒక ఆఫీస్ కి వెళ్లిందట. నీకు ఒకటి కాదు నాలుగు యాడ్స్ లో నటించే అవకాశం ఇస్తాము. కాకపోతే కమిట్మెంట్ ఇవ్వాలి, అన్నారట. అలాంటివి నాకు ఇష్టం ఉండదు అని కావ్య థాపర్ సమాధానం చెప్పిందట.