గంగవ్వ ఎలిమినేషన్‌లో సంచలన నిజాలు, అంతా పక్కా ప్లాన్‌ ప్రకారమే జరిగిందా?

First Published | Nov 15, 2024, 3:54 PM IST

బిగ్‌ బాస్‌ తెలుగు 8 హౌజ్‌ నుంచి గత వారం ఎలిమినేట్‌ అయిన గంగవ్వ ఎలిమినేషన్‌ సహజంగా జరగలేదని తెలుస్తుంది. దీని వెనకాల పెద్ద కథే ఉందని టాక్‌. 
 

గంగవ్వ పదో వారంలో ఎలిమినేట్‌ అయిన విషయం తెలిసిందే. ఆమె శనివారమే హౌజ్‌ నుంచి వెళ్లిపోయింది. స్వయంగా తానే ఎలిమినేట్‌ అవుతానని చెప్పింది. అనారోగ్యం కారణంగా ఆమెని ఎలిమినేట్‌ చేశారు. ఆమె కోరిక మేరకే బిగ్‌ బాస్‌ హౌజ్‌ నుంచి పంపించారనేది స్పష్టమవుతుంది. అయితే తాజాగా పలు సంచలన నిజాలు వినిపిస్తున్నాయి. ఆమె ఎలిమినేషన్‌లో పెద్ద ట్విస్ట్ బయటకు వచ్చింది. 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.
 

గంగవ్వ ఎలిమినేషన్‌ సాధారణంగా జరగలేదని తెలుస్తుంది. ఆమెని బిగ్‌ బాస్‌ కావాలనే పంపించారనే టాక్‌ వినిపిస్తుంది. గంగవ్వ ఐదో వారంలో వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఐదో వారంలో ఎనిమిది మంది వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చారు. అవినాష్‌, రోహిణి, గౌతమ్‌, నయనీ పావని, హరితేజ, టేస్టీ తేజతోపాటు గంగవ్వ బిగ్‌ బాస్‌ తెలుగు 8లోకి వచ్చింది.

ఆమె కరెక్ట్ గా ఐదు వారాలు మాత్రమే ఉంది. పదో వారం ఎలిమినేట్‌ అయ్యింది. అయితే ఆమె వెళ్లిపోవాలనుకున్నప్పుడు అనారోగ్య సమస్యని ఆమె బలవంతంగా చెప్పినట్టుగానే అనిపించింది. నాగార్జున ముందు ఆమె సరిగా సమాధానం చెప్పలేకపోయింది. చేతుల మంటలు వస్తున్నాయని వెల్లడించింది. నాగార్జున వెళ్లిపోతావా అంటే హా సార్‌ అని తెలిపింది. బలంగా తాను వెళ్లిపోవాలనుకుంటున్నట్టు చెప్పలేకపోయింది. 
 


అయితే ఆమెని పంపించే ఉద్దేశ్యంలోనే ఈ డ్రామా అంతా నడిచినట్టు సమాచారం. అంతేకాదు ఆమెని ఐదు వారాలకే పరిమితమనే అగ్రిమెంట్‌తోనే హౌజ్‌లోకి వచ్చినట్టు తెలుస్తుంది. అందుకే ఆమె తనని ఎవరూ నామినేట్‌ చేయోద్దని ఇతర కంటెస్టెంట్లకి చెబుతూ వచ్చింది. ఓ రకంగా వేడుకుంది. నేనే పదో వారంలో వెళ్లిపోతా, నన్ను నామినేట్‌ చేయోద్దని చాలా సార్లు ఇతర కంటెస్టెంట్లతో చెప్పింది గంగవ్వ.

దీని బట్టి ఇదే ముందస్తు ప్లానే అనే విషయం అర్థమవుతుంది. ఆమెని ఐదు వారాల కోసమే తీసుకొచ్చారని అర్థమవుతుంది. అందుకే హెల్త్ విషయాన్ని ముందు వేసి ఆడియెన్స్ లో అది నేచురల్‌గా జరిగే ప్రాసెస్‌లా కలరింగ్‌ ఇచ్చి ఆమెని హౌజ్‌ నుంచి పంపించారని సమాచారం. 
 

ఇదిలా ఉంటే గంగవ్వ ఎలిమినేషన్‌కి సంబంధించిన మరో ఆసక్తికర, షాకింగ్‌ విషయం నెట్టింట చక్కర్లు కొడుతుంది. గంగవ్వ నాల్గో సీజన్‌లో బిగ్‌ బాస్‌ షోకి వచ్చిన రచ్చ చేసింది. అప్పట్లో ఆమె హాట్‌ టాపిక్‌గా మారింది. కానీ అనారోగ్యంతో మధ్యలోనే వెళ్లిపోయింది. అయితే గంగవ్వ పేదరికాన్ని చూసిన నాగార్జున కొంత అమౌంట్‌ని ఇచ్చి ఆమెకి ఇళ్లు కట్టించారు. బిగ్‌ బాస్‌ నిర్వహకులు కూడా సహకరించారు.

అయితే ఈ సారి తన కూతురుకి ఇళ్లు కట్టించాలని ఆమె బిగ్‌ బాస్‌ని, నాగార్జునని అడిగిందట. ఆ డిమాండ్‌ కాస్త ఎక్కువగా పెరిగిందట. దీంతో ఇక గంగవ్వని ఇంట్లో ఆ డిమాండ్‌ ఓపెన్‌గా చెబితే ఇబ్బంది అవుతుందని భావించి సైలెంట్‌గా పంపించారట. అందుకే ఆమెని స్టేజ్‌ మీదకు కూడా రానివ్వలేదని సమాచారం. 
 

  ఐదు వారాలు ఇంట్లో ఉన్న గంగవ్వ, గేమ్స్ పరంగా ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఆమె ఎలాంటి గేమ్స్ ఆడలేదు. ఇతర కంటెస్టెంట్లని వెళ్లిపో వెళ్లిపో అంటూ, నువ్వు లిమినేట్‌ అవుతావని చెబుతూ తిరిగింది. ఇవన్నీ రాంగ్‌ ఇంప్రెషన్స్ కి దారి తీశాయి. పైగా ఆమె నుంచి ఎలాంటి ఎంటర్‌టైన్‌మెంట్స్ రాలేదు.

ఒక్క రాత్రి దెయ్యం వచ్చినట్టుగా చేసి బాగా నవ్వించింది. అదొక్కటి తప్పితే ఆమె యాక్టివ్‌గా కనిపించలేదు. దీంతో ఆమెని భరించడం కూడా సరికాదని భావించి ఆమెని హౌజ్‌ నుంచి పంపించారని తెలుస్తుంది. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. 

Read more: నాగచైతన్య, సిద్ధార్థ కాదు.. సమంత ఫస్ట్ క్రష్‌ ఎవరో తెలుసా? రెండేళ్లు వెంటపడ్డాడు, తీరా అడిగితే

also read: చిరు, నాగ్‌, బాలయ్య, ప్రభాస్‌, మహేష్‌ సరసన నటించిన ఈ చిన్నారి ఎవరో తెలుసా? రహస్యంగా పెళ్లి చేసుకుని ఇప్పుడు

Latest Videos

click me!