దళపతి విజయ్ భార్య సంగీత ఆస్తి ఎంతో తెలుసా? ఎప్పుడూ బయట కనిపించని ఆమె వద్ద వందల కోట్ల ఆస్తులు

Published : Jul 07, 2025, 05:05 PM IST

దళపతి విజయ్ కోలీవుడ్‌ స్టార్‌గా రాణిస్తున్నారు. ఇప్పుడు రాజకీయాల్లో బిజీ అవుతున్నారు. ఈక్రమంలో ఇప్పుడు ఆయన భార్య సంగీత ఆస్తుల విలువ చర్చనీయాంశం అవుతుంది.

PREV
18
విజయ్ భార్య సంగీత ఆస్తి విలువ

 సాధారణ నటుడిగా సినీరంగ ప్రవేశం చేసి, కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్న మాస్ హీరో విజయ్. సినీ నేపథ్యం ఉన్నప్పటికీ, స్వశక్తితో అగ్రనటుడిగా ఎదిగాడు. 

ఎన్నో ఒడిదుడుకులు చూసిన విజయ్, అనేక విజయవంతమైన చిత్రాలు అందించాడు. కోలీవుడ్‌ లో తిరుగులేని స్టార్‌గా ఎదిగారు. దళపతిగా రాణిస్తున్నారు.

28
ఒక్కో మూవీకి రెండు వందల కోట్ల పారితోషికం

విజయ్‌ ఇప్పుడు ఒక్కో మూవీకి రూ. 200 కోట్లకు పైగా పారితోషికం తీసుకునే నటుడిగా పేరు సంపాదించాడు. తండ్రి దర్శకత్వంలో బాలనటుడిగా కెరీర్ ప్రారంభించిన విజయ్, 'నాలాయి తీర్పు' చిత్రంతో హీరోగా మారాడు. 

33 ఏళ్లకు పైగా విజయవంతమైన హీరోగా కొనసాగుతున్న విజయ్, ప్రస్తుతం 'జన నాయకన్' చిత్రంలో నటిస్తున్నాడు. ఇదే తన చివరి చిత్రం అని విజయ్ ప్రకటించాడు. ఇకపై పూర్తి రాజకీయాలపై ఫోకస్‌ పెట్టబోతున్నారు.

38
`జన నాయకన్‌` విజయ్‌ చివరి మూవీ

 విజయ్‌  'తమిళక వెట్రి కజగం'(టీవీకే) పేరుతో రాజకీయ పార్టీని స్థాపించి ప్రజల కోసం పనిచేస్తున్నాడు. 2026 ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమవుతున్నాడు.

 రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత సినిమాల్లో నటించనని, 'జన నాయకన్' తన చివరి మూవీ అని వెల్లడించారు.  ఈ చిత్రం అక్టోబర్‌లో విడుదల కావాల్సి ఉండగా, 2026 సంక్రాంతికి జనవరి 9న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

48
300కోట్ల బడ్జెట్‌తో `జన నాయకన్‌` నిర్మాణం

విజయ్ రాజకీయ ప్రవేశం నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. హెచ్. వినోద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే జంటగా నటిస్తోంది. బాబీ డియోల్, ప్రియమణి, మమితా బైజు, గౌతమ్ మీనన్, నరైన్, 

శృతి హాసన్, రెబా మోనికా జాన్, బాబా భాస్కర్, వరలక్ష్మి శరత్ కుమార్, రేవతి నటిస్తున్నారు. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని కెవిఎన్ ప్రొడక్షన్స్ రూ.300 కోట్లతో నిర్మిస్తోంది.

58
విజయ్‌ ఆస్తుల విలువ షాకింగ్‌

రూ.200 కోట్ల పారితోషికం తీసుకునే విజయ్ ఆస్తి 400 నుంచి 600 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఇప్పుడు ఆయన భార్య సంగీత ఆస్తి విలువ గురించి వార్తలు వచ్చాయి.

 విజయ్, సంగీత వివాహం 1999 ఆగస్టు 25న జరిగింది. వారికి 23 ఏళ్లకు పైగా వివాహ బంధం కొనసాగుతోంది.

68
పార్టీ కార్యక్రమాల్లో విజయ్‌ భార్య సంగీత

విజయ్ పార్టీని స్థాపించిన తర్వాత, ముఖ్యమైన కార్యక్రమాల్లో ఆయనకు బదులుగా సంగీత పాల్గొంటోంది. పార్టీ స్థాపనకు ముందు, ఆడియో వేడుకల్లో మాత్రమే సంగీత కనిపించేది. ఆ తర్వాత ఆమెను బయట చూడటం అరుదు.

78
విజయ్‌ భార్య సంగీత ఆస్తులు

సంగీత ఆస్తి విలువ ఎంతో ఇప్పుడు వెల్లడైంది. india.com ప్రకారం, ఆమె ఆస్తి 400 కోట్లు. కానీ, ఆమె ఏం చేస్తుందనే వివరాలు లేవు. విజయ్‌కి సంబంధించిన వ్యాపారాలు అన్నీ ఆమెనే చూసుకుంటుందని సమాచారం. ఆమె తండ్రి లండన్‌లోని కోటీశ్వరుల్లో ఒకరు.

88
విజయ్‌ కార్ల కలెక్షన్, ఆస్తులు

కార్లను ఇష్టపడే విజయ్ దగ్గర ఆడి, బిఎండబ్ల్యూ, లెక్సస్ వంటి కార్లు ఉన్నాయి. చెన్నై నీలాంగరైలో విలాసవంతమైన ఇల్లు ఉంది. తిరువళ్లూర్, తిరుపోరూర్, తిరుమలసై, వండలూర్‌లలో ఆస్తులు ఉన్నాయని చెబుతున్నారు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories