డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో రూపొందిన చిత్రం పోకిరి. సాధారణ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం ఇండస్ట్రీ నివ్వెరపోయేలా అసాధారణ విజయం సొంతం చేసుకుంది.
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో రూపొందిన చిత్రం పోకిరి. సాధారణ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం ఇండస్ట్రీ నివ్వెరపోయేలా అసాధారణ విజయం సొంతం చేసుకుంది. ఎవరూ ఊహించిన విధంగా ఈ చిత్రం ఇండస్ట్రీ రికార్డులను తిరగ రాసింది. మహేష్ బాబు మాస్ ఇమేజ్ ని అమాంతం పెంచేసిన చిత్రం ఇది.
పోకిరి మూవీ అప్పట్లో అంత పెద్ద విజయం ఎలా సాధించింది అనేది ఇండస్ట్రీ ప్రముఖులకు కూడా అర్థం కాలేదు. ఈ చిత్రం ఫస్ట్ కాపీని సూపర్ స్టార్ కృష్ణ చూసి ఇండస్ట్రీ రికార్డ్ క్రియేట్ చేస్తుంది అని చెప్పారట. ఆయన మాటలను కూడా ఎవరు నమ్మలేదు. కానీ సినిమా రిలీజ్ అయ్యాక పోకిరి చిత్రం చేసిన మ్యాజిక్ కి అంతా ఫిదా అయిపోయారు. ఈ మూవీ చూసిన ప్రతి ఒక్కరూ సినిమా చాలా బాగుంది అంటున్నారు కానీ అంత పెద్ద విజయం సాధించడానికి స్పష్టమైన కారణాలు చెప్పలేకపోతున్నారు.
25
టైటిల్ విని టెన్షన్ పడ్డ మహేష్
ఇదే పరిస్థితి డైరెక్టర్ పూరి జగన్నాథ్, మహేష్ బాబుకి కూడా ఎదురైంది. మహేష్ బాబు ఈ చిత్రం రిలీజ్ అయ్యాక కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పూరి జగన్నాథ్ గారు నాకు ఈ కథ చెప్పినప్పుడు చాలా బాగా నచ్చింది. కథ చెప్పాక ఈ చిత్రానికి టైటిల్ పోకిరి అని అన్నారు. ఇదేంటి పోకిరి అని నెగటివ్ టైటిల్ చెబుతున్నారు అని టెన్షన్ పడ్డాను. ఈ చిత్రంలో పోకిరిలా కనిపించడానికి కష్టపడ్డాను. ఒక ఛాలెంజ్ లాగా తీసుకున్నా.
35
ఆ అమ్మాయి చేసిన మ్యాజిక్ అది
పోకిరిలా కనిపించాలి అంటే హెయిర్ పెంచాలి అని పూరి జగన్నాథ్ గారు చెప్పారు. అతడు తర్వాత మూడు నెలల గ్యాప్ వచ్చింది. హెయిర్ బాగా పెంచేశాను. నేను హెయిర్ పెంచడం అదే తొలిసారి కావడంతో చాలా చిరాగ్గా అనిపించింది. పోకిరిలా కనిపిస్తూనే హ్యాండ్సమ్ లుక్ లో కూడా కనిపించాలి.
అలాంటి లుక్ ఎవరు ఇవ్వగలరు అని ఆలోచిస్తున్న ముంబైలో దిల్షాద్ అనే అమ్మాయి గురించి తెలిసింది.ఆమె హెయిర్ స్టైలిస్ట్ గా పనిచేస్తున్నారు. వెంటనే ముంబైకి వెళ్లి ఆమె దగ్గర హెయిర్ స్టైల్ చేయించుకున్నాను. పోకిరి చిత్రంలో నా హెయిర్ స్టైల్ అంత బాగా కుదిరింది అంటే కారణం ఆ అమ్మాయి అని మహేష్ బాబు అన్నారు.
ఈ మూవీ ఇంత పెద్ద విజయం సాధించడానికి కారణం ఏమనుకుంటున్నారు అని యాంకర్ ఇంటర్వ్యూలో ప్రశ్నించారు. దీనికి మహేష్ సమాధానం ఇస్తూ.. అది మాక్కూడా ఇంతవరకు అర్థం కాలేదని మహేష్ బాబు నవ్వేశారు. ఆ తర్వాత మహేష్ మాట్లాడుతూ.. ఈ చిత్రంలో ఒక ఇన్ క్రెడిబుల్ ఎనర్జీ ఉంది. చివరి 40 నిమిషాలు అయితే సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది.
దీనికి తోడు డైలాగులు అదిరిపోయాయి. ఆడియన్స్ థియేటర్ లోనే డైలాగులు రిపీట్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ చిత్ర విజయానికి ఈ అంశాలే కారణం అని అనిపిస్తోంది. పూరి జగన్నాథ్ చిత్రాల్లో హీరో క్యారెక్టరైజేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది అని మహేష్ బాబు అన్నారు.
55
పూరి జగన్నాధ్ కి అర్థం కాలేదట
పోకిరి చిత్రం అంత పెద్ద విజయం ఎలా సాధించింది అనే ప్రశ్న పూరి జగన్నాథ్ కి కూడా ఓ ఇంటర్వ్యూలో ఎదురైంది. పూరి సమాధానం ఇస్తూ.. పోకిరి తర్వాత నేను కొన్ని చిత్రాలు చేశాను. అవి కూడా మంచి విజయం సాధించాయి కానీ పోకిరి రేంజ్ లో హిట్ కాలేదు. అసలు పోకిరిలో అంత గొప్ప ఏం తీశాను అని తెలుసుకోవడానికి ఆ సినిమాని నేనొక్కడినే ఒంటరిగా చూశాను. కానీ నాకేమీ అర్థం కాలేదు అంటూ పూరి జగన్నాథ్ సరదాగా కామెంట్స్ చేశారు.