Vijay Top 10 Movies: దళపతి విజయ్ నేడు తన 52వ పుట్టిన రోజుని జరుపుకుంటున్నాడు. ఆయన సీఎం అయ్యాక వచ్చిన తొలి బర్త్ డే ఇదే కావడం విశేషం. ఈ సందర్భంగా, ఆయన కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 10 సినిమాలపై ఓ లుక్కేద్దాం.
తమిళ సినిమా బాక్సాఫీస్ కింగ్ దళపతి విజయ్. ఆయన సినిమా వస్తుందంటే థియేటర్ల దగ్గర పండగ వాతావరణం ఉంటుంది. అంత క్రేజ్ ఉన్న విజయ్, ఇప్పుడు రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఆయన ఇప్పటివరకు 69 సినిమాల్లో నటించారు. వాటిలో ఎన్నో రికార్డులు సృష్టించారు. ముఖ్యంగా బాక్సాఫీస్ వసూళ్లలో విజయ్‌ను మించిన వారు లేరనే చెప్పాలి. కోలీవుడ్‌లో ఆయనో ప్రత్యేక సామ్రాజ్యాన్ని నడిపారు. ఈ నేపథ్యంలో, ఆయన కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 10 సినిమాలేంటో ఈ గ్యాలరీలో చూద్దాం.
211
10. కత్తి
విజయ్ - ఏ.ఆర్. మురుగదాస్ కాంబోలో వచ్చిన సినిమా 'కత్తి'. వీరి కాంబినేషన్‌లో వచ్చిన 'తుపాకి' బ్లాక్‌బస్టర్ తర్వాత ఈ సినిమా వచ్చింది. 2014లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.130 కోట్లు వసూలు చేసి విజయ్ టాప్ 10 మూవీస్‌లో 10వ స్థానంలో నిలిచింది.
311
9. తెరి
విజయ్‌కు ఇష్టమైన దర్శకుల్లో అట్లీ ఒకరు. అట్లీ దర్శకత్వంలో విజయ్ వరుసగా మూడు సినిమాలు చేశారు. అందులో మొదటి సినిమా 'తెరి'. ఇందులో విజయ్ పోలీస్ ఆఫీసర్‌గా మాస్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. 2016లో విడుదలైన ఈ సినిమా రూ.172 కోట్లు వసూలు చేసింది.
విజయ్ కెరీర్‌లో భారీ హైప్‌తో వచ్చిన సినిమా 'బీస్ట్'. నెల్సన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాపై మొదట భారీ అంచనాలున్నాయి. కానీ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. అయినా ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకుని బాక్సాఫీస్ వద్ద రూ.215 కోట్లు వసూలు చేసింది.
511
7. మాస్టర్
లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో విజయ్ నటించిన సినిమా 'మాస్టర్'. 'మానగరం', 'ఖైదీ' వంటి హిట్‌ల తర్వాత లోకేష్ తీసిన సినిమా ఇది. ఈ చిత్రంతో విజయ్ హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్నారు. కరోనా సమయంలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.230 కోట్లకు పైగా వసూలు చేసింది.
611
6.సర్కార్
విజయ్ - ఏ.ఆర్. మురుగదాస్ కాంబినేషన్‌లో వచ్చిన మరో బ్లాక్‌బస్టర్ 'సర్కార్'. విజయ్ రాజకీయ ప్రవేశానికి ఈ సినిమా పునాది వేసిందని చెప్పొచ్చు. 2018లో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచి, బాక్సాఫీస్ వద్ద రూ.258 కోట్లు కొల్లగొట్టింది.
711
5. మెర్సల్
విజయ్ మూడు విభిన్న పాత్రల్లో అదరగొట్టిన సినిమా 'మెర్సల్'. అట్లీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆయన నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఈ సినిమాలో సమంత, కాజల్ అగర్వాల్, నిత్యా మీనన్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.267 కోట్లు వసూలు చేసింది.
811
4. వారసుడు
విజయ్ హీరోగా 2023లో విడుదలైన సినిమా 'వారసుడు' (తమిళంలో వారిసు). తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. ఫ్యామిలీ ఆడియన్స్‌ను టార్గెట్ చేసిన ఈ సినిమా సంక్రాంతి పండుగకు విడుదలై బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా రూ.306 కోట్లు వసూలు చేసింది.
911
3. బిగిల్(విజిల్)
విజయ్ - అట్లీ కాంబినేషన్‌లో 2019లో దీపావళికి విడుదలైన భారీ బడ్జెట్ చిత్రం 'బిగిల్'. ఈ సినిమాలో విజయ్, బిగిల్, రాయప్పన్ అనే రెండు విభిన్న పాత్రల్లో నటించి మెప్పించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.321 కోట్లు వసూలు చేసింది.
1011
2. ది గోట్
విజయ్ నటించిన చిత్రాల్లో ఒకటి 'ది గోట్'. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విజయ్ ద్విపాత్రాభినయం చేశారు. హీరోగానే కాకుండా విలన్‌గా కూడా అదరగొట్టారు. 2024లో విడుదలైన ఈ సినిమా రూ.440 కోట్లు వసూలు చేసింది.
1111
1. లియో
విజయ్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం 'లియో'. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో 2023లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా రూ.615 కోట్లు వసూలు చేసింది. త్వరలో విడుదల కానున్న విజయ్ 'జననాయగన్' సినిమా ఈ రికార్డును బద్దలు కొడుతుందని అంచనా వేస్తున్నారు. మొత్తంగా కోలీవుడ్ అత్యధిక కలెక్షన్లు సాధించిన హీరోగా విజయ్ నిలిచారని చెప్పొచ్చు.