Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తాజాగా మా ఇంటి బంగారం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమా థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. ఈ మూవీ సక్సెస్ వేళ.. సమంత కల నిజమైంది.
మా ఇంటి బంగారం సినిమాని సమంత తన భుజాలపై నడిపించింది. ఆమె నటనకు, రాయలసీమ యాసలో డైలాగులు, చీర కట్టుకొని చేసిన ఫైట్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. మూవీకి పాజిటివ్ టాక్ రావడంతో.. మూవీ టీమ్ మొత్తం సెలబ్రేట్ చేసుకున్నారు. సక్సెస్ సెలబ్రేషన్స్ లో భాగంగా సమంతకు బేబీ బంప్ ఉన్నట్లు తెలిసింది. అంటే.. సమంత తల్లికాబోతోంది. ప్రస్తుతం ఆమెకు మూడో నెల అని.. ఈ ఏడాది డిసెంబర్ లో బిడ్డకు జన్మనిచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
23
తల్లి కావడంపై సమంత కామెంట్స్..
కాగా.. తాను తల్లికావడం విషయంపై సమంత చాలా సార్లు చాలా సందర్భాల్లో ప్రస్తావించారు. ముఖ్యంగా.. తన సినిమా కెరీర్ మొదలుపెట్టిన కొత్తలో.. ప్రదీప్ యాంకర్ గా నిర్వహించిన ‘కొంచెం టచ్ లో ఉంటే చెబుతాను’ అనే కార్యక్రమానికి సమంత గెస్ట్ గా వచ్చారు. ఆ సమయంలో.. ఆమె మాట్లాడిన మాటలు.. ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉంటాయి. తాను చాలా తొందరగా తల్లి అవ్వాలని అనుకుంటున్నానని.. ఎందుకంటే.. లేటుగా పిల్లల్ని కంటే... కనీసం వారితో ఆడుకునేలా అయినా ఉండాలి కదా అని చెప్పారు. ఆ తర్వాత నాగ చైతన్యతో వివాహం జరిగినా.. వారికి సంతానం కలగలేదు. ఈ లోగా విడాకులు కూడా తీసుకున్నారు. టీవలే కొద్ది నెలల క్రితమే సమంత రాజ్ ని పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు ఆమె తల్లికాబోతోందని తెలుస్తోంది. దీంతో.. కాస్త ఆలస్యమైనా తల్లికావాలన్న సమంత కోరిక నెరవేరింది అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
33
గతంలో ఏం చెప్పిందంటే..
అంతేకాదు, చాలా ఇంటర్వ్యూల్లో కూడా తనకు పిల్లలు పుడితే ఎలా చూసుకోవాలని అనుకుంటున్నాను అనే విషయం కూడా సమంత చెప్పారు. నా పిల్లలే ప్రపంచంగా బతుకుతాను అన్నారు. తాను చిన్నప్పుడు చాలా కష్టాలు పడ్డానని, నా పిల్లలు మాత్రం అలా కష్టపడకుండా చూసుకుంటాను అని చెప్పారు. తన పిల్లలకు అన్ని సౌకర్యాలు దక్కేలా చేస్తానని, కొన్ని సంవత్సరాల పాటు తన పిల్లలను వదిలి ఎక్కడికి వెళ్లనని.. వారితో మాత్రమే సమయం గడుపుతాను అని ఆమె చెప్పడం విశేషం.