Vijay: జన నాయకుడు వాయిదాపై విజయ్‌ ఫస్ట్ టైమ్‌ రియాక్షన్‌.. ముందే తెలుసా? అన్నింటికి ప్రిపేర్‌

Published : Jan 31, 2026, 02:54 PM IST

Vijay: దళపతి విజయ్‌ నటించిన `జన నాయకుడు` మూవీ సంక్రాంతికి విడుదల కావాల్సింది. కానీ సెన్సార్‌ వల్ల వాయిదా పడింది. తన సినిమా వాయిదా, ఇబ్బందులపై విజయ్‌ మొదటిసారి ఓపెన్‌ అయ్యాడు. 

PREV
15
వాయిదా పడ్డ జన నాయకుడు మూవీ

కోలీవుడ్‌ స్టార్‌ హీరో దళపతి విజయ్‌ ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారారు. ఆయన రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం చర్చనీయాంశం అయ్యింది. అదే సమయంలో ఓ వైపు సినిమా, మరోవైపు రాజకీయాలతో బిజీగా ఉంటున్నారు. ఆయన చివరగా నటించిన `జన నాయకుడు` మూవీ ఈ సంక్రాంతికి విడుదల కావాల్సింది. కానీ వాయిదా పడింది. సెన్సార్‌ ఇబ్బందుల వల్ల వాయిదా వేశారు.  ఈ కేసు కోర్ట్ లో ఉంది. ఇంకా తెగడం లేదు. 

25
జన నాయకుడికి సెన్సార్‌ ఇబ్బందులు

మొదటి నుంచి 'జననాయగన్' రాజకీయ నేపథ్యం ఉన్న కథగా ప్రచారంలో ఉంది. విజయ్ రాజకీయ ప్రవేశం తర్వాత ఈ సినిమాపై అందరి దృష్టి మారింది. సెన్సార్ బోర్డు కొన్ని అభ్యంతరాలు చెప్పినట్టు సమాచారం.

35
పొలిటికల్‌ డైలాగ్‌లపై అభ్యంతరం

కొన్ని రాజకీయ సంభాషణలు, సన్నివేశాలు వివాదాస్పదంగా ఉన్నాయని, మార్పులు చేయాలని సెన్సార్ బోర్డు కోరింది. దీన్ని తిరస్కరించిన నిర్మాతలు హైకోర్టును ఆశ్రయించారు. కానీ, ఫలితం లేకపోవడంతో పొంగల్ విడుదల ఆగిపోయింది.

45
సుప్రీంకోర్ట్ కి జన నాయకుడు నిర్మాత

ప్రమోషన్లు పూర్తయిన తరుణంలో, ఈ సమస్య నిర్మాతకు ఆర్థిక భారం కలిగించింది. ఇప్పుడు సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్మాత ప్లాన్ చేస్తున్నారు. సెన్సార్ బోర్డు కూడా పిటిషన్‌ వేసింది. దీంతో ఇది  మరింత హీటెక్కిస్తుంది. 

55
జన నాయకుడు వాయిదాపై విజయ్ రియాక్షన్‌

ఈ వివాదంపై విజయ్ తొలిసారి స్పందించారు. 'నాకంటే నిర్మాత గురించే ఎక్కువ ఆందోళనగా ఉంది. ఆయన పెట్టుబడి, శ్రమ ప్రశ్నార్థకంగా మారాయి. రాజకీయాల్లోకి వస్తున్నానని ప్రకటించాక ఇలాంటివి ఊహించాను' అని కూడా చెప్పారు. తాను వీటికి ముందుగానే ప్రిపేర్‌ అయినట్టు తెలిపారు. ఈ విషయాల్లో తగ్గేదెలే అని తెలిపారు. తన పోరాటం కొనసాగుతుందని చెప్పారు. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories