అనసూయ జబర్దస్త్ ని విడిచిపెట్టి చాలా కాలం అవుతోంది. రష్మీ మాట్లాడుతూ అనసూయ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. అనసూయ మైక్ విసిరికొట్టి వెళ్ళిపోయింది అంటూ కామెంట్స్ చేశారు.
నటిగా అనసూయ ఎంత పాపులారిటీ సొంతం చేసుకుందో వివాదాలతో కూడా అదే స్థాయిలో వార్తల్లో నిలిచింది. యాంకర్ గా ఓ వెలుగు వెలిగిన అనసూయ ఆ తర్వాత నెమ్మదిగా సినిమా అవకాశాలు అందిపుచ్చుకుంది. తన కెరీర్ ని మలుపు తిప్పే అవకాశాలు. విజయాలు దక్కాయి. క్షణం, రంగస్థలం, సోగ్గాడే చిన్ని నాయన లాంటి చిత్రాల్లో అనసూయ ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో నటించింది.
25
జబర్దస్త్ కి అందుకే దూరం
సినిమా అవకాశాలు పెరగడంతో అనసూయ జబర్దస్త్ షోని వదిలేసింది. అనసూయ జబర్దస్త్ నుంచి వెళ్లిపోవడంతో అప్పట్లో పెద్ద చర్చ జరిగింది. జబర్దస్త్ షోలో అసభ్యకరమైన డైలాగులు, హద్దులు దాటే మాటలు ఎక్కువయ్యాయి అని అనసూయ ఆ తర్వాత విమర్శించిన సంగతి తెలిసిందే. జబర్దస్త్ ని వదిలేయడానికి అది కూడా కారణం అని తెలిపింది. ప్రధాన కారణం అయితే మాత్రం సినిమాలకు డేట్స్ అడ్జెస్ట్ చేయడంలో సమస్యలు రావడంతో జబర్దస్త్ కి ముగింపు పలికిందట.
35
అనసూయపై రష్మీ కామెంట్స్
జబర్దస్త్ లో చాలా సందర్భాల్లో అనసూయ, హైపర్ ఆది కామెడీ ట్రాకులపై కూడా విమర్శలు వచ్చాయి. ఓ సందర్భంలో యాంకర్ రష్మీ.. అనసూయ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. జబర్దస్త్ 12 ఇయర్స్ సెలెబ్రేషన్స్ లో రష్మీ అనసూయ గురించి మాట్లాడింది. అనసూయ చాలా పారదర్శకంగా ఉండే వ్యక్తి. తనకి కోపం వస్తే మైక్ విసిరి కొట్టి వెళ్ళిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి అని రష్మీ పేర్కొంది. పక్కనే ఉన్న అనసూయ ఇవన్నీ నేను ఎప్పుడు చేశాను అంటూ ఆశ్చర్యపోయింది.
వెంటనే ఆ ఈవెంట్ లో ఉన్న బుల్లితెర నటుడు మానస్ మాట్లాడుతూ.. కళ్లారా అనసూయ కోపం చూశా. అందుకు సాక్ష్యం నేనే అని తెలిపారు. దీనితో సిగ్గుపడిపోయిన అనసూయ మానస్ ని వెనక్కి నెట్టేసింది. అనసూయకి ఎంత కోపం వచ్చినా కొన్ని నిమిషాలు మాత్రమే ఉంటుంది. దీనితో వెంటనే హైపర్ ఆది సెటైర్లు వేశారు. అనసూయకి కోపం ఎక్కువైతే ఇంస్టాగ్రామ్ లో లైవ్ లు కూడా పెడుతుంది అని ఫన్నీగా తెలిపారు.
55
హైపర్ ఆది సెటైర్లు
అనసూయ మాట్లాడుతూ.. నేను జబర్దస్త్ నుంచి వెళ్లిపోయే ముందు హైపర్ ఆదిని కొన్ని విషయాల్లో చాలా అడుక్కున్నాను. చాలా గొడవలు జరిగాయి. హైపర్ ఆదితో కలిసి చాలా స్కిట్స్ చేశాను. ఎంతో ఎంకరేజ్ చేశాను. కానీ నాకు సరైన ప్రాధాన్యం లేదు. అదే నా ఏడుపు అని తెలిపింది. అలాంటి గొడవలు చాలా అయ్యాయి ఇప్పుడు ప్యాచ్ అప్ అవుదాం అని మళ్ళీ హైపర్ ఆది సెటైర్లు వేశాడు.