MSG Box Office: మన శంకర వర ప్రసాద్‌ గారు మూవీ 19 రోజుల కలెక్షన్లు.. చిరంజీవి సరికొత్త రికార్డ్

Published : Jan 31, 2026, 01:59 PM ISTUpdated : Jan 31, 2026, 02:17 PM IST

చిరంజీవి నటించిన `మన శంకర వర ప్రసాద్‌ గారు` మూవీ 19 రోజులు పూర్తి చేసుకుంది. అయితే ఇప్పుడు వసూళ్లు డల్‌గా ఉన్నాయి. అయినా రీజనల్‌ ఫిల్మ్ లో సరికొత్త రికార్డు సృష్టించింది. 

PREV
14
మన శంకర వర ప్రసాద్‌ గారు మూవీ 19వ రోజు కలెక్షన్లు

చిరంజీవి హీరోగా, అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన `మన శంకర వర ప్రసాద్‌ గారు` మూవీ బ్లాక్‌ బస్టర్‌ దిశగా దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. రీజనల్‌ ఫిల్మ్ లో ఇది ఇండస్ట్రీ హిట్‌ గా నిలిచింది. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ మూవీ కాసుల వర్షం కురిపిస్తోంది. లేటెస్ట్ గా 19వ రోజు కూడా సత్తా చాటింది. శుక్రవారం ఈ మూవీకి కోటికి పైగా వసూళ్లు రావడం విశేషం. సినిమా క్లోజింగ్‌కి చేరుకున్నా కలెక్షన్లు ఫర్వాలేదనిపించేలా ఉండటం విశేషం.

24
మన శంకర వర ప్రసాద్‌ గారు మూవీ టోటల్‌ కలెక్షన్లు

`మన శంకర వర ప్రసాద్‌ గారు` మూవీకి సంబంధించి సాక్నిల్క్ సైట్‌ లెక్కల ప్రకారం ఇప్పటి వరకు ఈ మూవీకి రూ.284కోట్లు వచ్చాయి. ఇండియాలో రూ.203కోట్ల నెట్‌ కలెక్షన్లు వచ్చాయి. రూ.240కోట్ల గ్రాస్‌ వసూళ్లు సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో దీనికి రూ.203కోట్ల వరకు గ్రాస్‌ కలెక్షన్లు రావడం విశేషం. దీంతో ఈ మూవీ ఇండియాలో అత్యధిక వసూళ్లని రాబట్టిన తెలుగు సినిమాల్లో టాప్‌ షేర్‌ సాధించిన  నిలిచింది. `హనుమాన్‌` రికార్డుని బ్రేక్‌ చేసింది. తెలుగు స్టేట్స్ లో రీజనల్‌ ఫిల్మ్స్ లో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నెంబర్‌ 1 స్థానంలో నిలిచింది.  

34
మన శంకర వర ప్రసాద్‌ గారు సరికొత్త రికార్డ్

 `హనుమాన్‌`(రూ.201 కోట్లు) వసూలు చేసింది. సరికొత్త రికార్డు సృష్టించింది. రీజనల్‌ ఫిల్మ్ లో చిరంజీవితో ఫస్ట్ ప్లేస్‌ అని చెప్పొచ్చు. మొత్తంగా ఈ సినిమా బ్రేక్‌ ఈవెన్‌ దాటి రూ.55కోట్ల వరకు లాభాలు గడించిందని టాక్‌. ఇదిలా ఉంటే ఈ మూవీ సుమారు రూ.370కోట్ల వరకు రాబట్టిందని చిత్ర బృందం చెబుతోంది.

44
మంచి ఫ్యామిలీ ప్యాకేజీగా `మన శంకర వర ప్రసాద్‌ గారు` మూవీ

ఇక చిరంజీవి హీరోగా, అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన `మన శంకర వర ప్రసాద్‌ గారు` మూవీలో నయనతార హీరోయిన్‌గా నటించింది. వెంకటేష్‌ స్పెషల్‌ రోల్‌ చేశారు. క్లైమాక్స్ లో వచ్చి సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లారు. మంచి ఫ్యామిలీ మూవీ కావడం, కామెడీ వర్కౌట్‌ కావడం, మహిళలకు సంబంధించిన అంశాలుండటం, నేటి ట్రెండ్‌కి తగ్గట్టుగా భార్యాభర్తల మధ్య గొడవలు, విడాకులకు సంబంధించిన అంశాలు ఉండటం ఆకట్టుకుంది. అదే సమయంలో పిల్లలకు సంబంధించిన సీన్లు కూడా మేళవించడం విశేషం. ఇలా అన్ని వర్గాలు చూసేలా మంచి ఫ్యామిలీ ప్యాక్‌ మూవీని తయారు చేశారు అనిల్‌ రావిపూడి. దానికి చిరంజీవి తనదైన టేస్ట్ ని యాడ్‌ చేశారు. దీంతో ఆడియెన్స్ బ్రహ్మరథం పట్టారు. ఈ మూవీని సుస్మిత కొణిదెల, సాహు గారపాటి నిర్మించిన విషయం తెలిసిందే.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories