ఆగష్టులో వరుణ్ తేజ్, సూర్య, రవితేజ, యశ్, శర్వానంద్ తదితర హీరోల సినిమాలతో పాటు పలు ఆసక్తికర చిత్రాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. విడుదల తేదీలు, ఇతర విశేషాలు ఈ కథనంలో తెలుసుకోండి.
ఆగష్టు నెల సినీ ప్రేక్షకులకు పూర్తి స్థాయి వినోదాన్ని అందించబోతోంది. చిన్న సినిమాల నుంచి భారీ పాన్ ఇండియా చిత్రాల వరకు విభిన్న జానర్లలో పలు చిత్రాలు ఈ నెలలో థియేటర్లలోకి రానున్నాయి. వరుణ్ తేజ్, సూర్య, రవితేజ, యశ్, శర్వానంద్ వంటి స్టార్ హీరోల సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి సిద్ధమయ్యాయి. మరి ఆగష్టులో ప్రేక్షకుల ముందుకు రానున్న సినిమాలేవో, వాటి విశేషాలేమిటో చూద్దాం.
28
కొరియన్ కనకరాజు - ఆగష్టు 7
హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ రీతికా నాయక్. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందిన ఇండో-కొరియన్ హారర్ కామెడీ. కొరియాలో జరిగే అతీంద్రియ సంఘటనల నేపథ్యంలో కథ సాగుతుంది. ఆగష్టు లో తమ సినిమాలతో ఆడియన్స్ ముందుకు వస్తున్న హీరోలలో డేంజర్ జోన్ లో ఉన్నది వరుణ్ తేజ్ అనే చెప్పాలి. గత 5 సినిమాలుగా వరుణ్ తేజ్ కి చెప్పుకోదగ్గ చిత్రం లేదు. ఎఫ్ 3 ఒక్కటి కమర్షియల్ గా పర్వాలేదనిపించింది. మిగిలినవన్నీ డిజాస్టర్స్ అయ్యాయి. దీనితో కొరియన్ కనకరాజు మూవీతో వరుణ్ తేజ్ తప్పనిసరిగా కంబ్యాక్ ఇవ్వాల్సిందే. లేకుంటే కెరీర్ డేంజర్ లో పడ్డట్లే.
38
విశ్వనాథ్ అండ్ సన్స్ - ఆగష్టు 14
హీరో సూర్య, హీరోయిన్ మమితా బైజు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా. అంతర్జాతీయ పిస్టల్ షూటర్ జీవితం, కుటుంబ బంధాలు, ప్రేమ చుట్టూ కథ తిరుగుతుంది.
దుల్కర్ సల్మాన్ నటించిన చిత్రం ఇది. తెలుగు డబ్బింగ్ ఆగష్టు 20న రిలీజ్ కానుంది. సీతారామం, లక్కీ భాస్కర్ లాంటి చిత్రాలతో దుల్కర్ సల్మాన్ కి తెలుగులో కూడా మంచి క్రేజ్ దక్కింది.
58
ఇరుముడి - ఆగష్టు 21
హీరో రవితేజ, దర్శకుడు శివ నిర్వాణ. అయ్యప్ప స్వామి భక్తి నేపథ్యంతో పాటు తండ్రి–కూతురు అనుబంధాన్ని చూపించే ఎమోషనల్ డ్రామాగా రూపొందుతోంది. ఈ మూవీ విజయం సాధించడం రవితేజకి చాలా అవసరం. రవితేజకి కూడా ఇటీవల చెప్పుకోదగ్గ సక్సెస్ లేదు.
68
టాక్సిక్ - ఆగష్టు 26
హీరో యశ్, దర్శకురాలు గీతూ మోహన్‌దాస్. భారీ పాన్ ఇండియా గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది. బోల్డ్ కంటెంట్ తో రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అన్నీ వర్కౌట్ అయితే పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అవుతుంది అని అంతా భావిస్తున్నారు.
78
భోగి - ఆగష్టు 28
సంపత్ నంది దర్శకత్వంలో శర్వానంద్ నటిస్తున్న పీరియడ్ డ్రామా ఇది. ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఆగస్టు 28న రిలీజ్ అని ప్రకటించారు. కానీ ఇంత వరకు ఎలాంటి హడావిడి లేదు. వాయిదా పడ్డట్లు కూడా ఇంకా ప్రకటించలేదు.
88
ఇతర సినిమాలు - అగధ, పళ్ళబురుసు( ఆగష్టు 14)
దర్శకుడు ఎం.ఎస్. రాజు. మిస్టిక్ హారర్ థ్రిల్లర్‌గా రూపొందుతోంది. పళ్ళ బురుసు చిత్రం అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో రానుంది.