Chennai Love Story 8 Days Collections: బాక్సాఫీసు వద్ద చెన్నై లవ్‌ స్టోరీ డ్రాప్‌.. కిరణ్‌ సినిమా ఎంత రాబట్టిందంటే

Published : Aug 01, 2026, 12:03 PM IST

Chennai Love Story 8 Days Collections: కిరణ్‌ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియ హీరోహీరోయిన్లుగా నటించిన `చెన్నై లవ్‌ స్టోరీ` తొలి వారం రచ్చ చేసింది. కానీ రెండో వారం క్రమంగా వసూళ్లు తగ్గాయి. మరి 8 రోజుల్లో ఎంత రాబట్టిందంటే?

PREV
14
ఫీల్‌ గుడ్‌ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీగా చెన్నై లవ్‌ స్టోరీ

కిరణ్‌ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియ జంటగా `చెన్నై లవ్‌ స్టోరీ` చిత్రంలో నటించారు.  రవి నంబూరి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీకి సాయి రాజేష్‌ కథ అందించారు. పాటలు, టీజర్‌, ట్రైలర్‌తో ఆకట్టుకోవడంతో మంచి బజ్‌ ఏర్పడింది. దానికి తగ్గట్టుగానే సినిమా ఉంది. గత శుక్రవారం(జులై 24)న విడుదలైన ఈ మూవీకి ఆడియెన్స్ నుంచి పాజిటివ్‌ టాక్‌ వచ్చింది. ఫీల్‌ గుడ్‌ లవ్‌ స్టోరీగా ఆకట్టుకుంది. కిరణ్‌ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియ యాక్టింగ్‌ సినిమాకి మెయిన్‌ హైలైట్‌గా నిలిచాయి. లవ్‌ సీన్లలో ఇద్దరూ ఇరగదీశారు. కొన్ని సీన్లలో గౌరీ ప్రియ రెచ్చిపోయింది. సినిమాని తనే భుజాలపై నడిపించిందని చెప్పొచ్చు. దీంతో ఆమెని లేడీ అర్జున్‌ రెడ్డి అంటూ కామెంట్‌ చేయడం విశేషం.

24
చెన్నై లవ్‌ స్టోరీ 8వ రోజు కలెక్షన్లు

చెన్నై లవ్‌ స్టోరీ కిరణ్‌ అబ్బవరం కెరీర్‌లోనే హైయ్యెస్ట్ ఓపెనింగ్స్ ని రాబట్టుకుంది. ఈ చిత్రానికి దాదాపు రూ.12కోట్లు వచ్చాయని నిర్మాతలు ప్రకటించారు. మొదటి వారాంతంలో సినిమా బాక్సాఫీసు వద్ద దుమ్ములేపింది. భారీ వసూళ్లతో రన్‌ అయ్యింది. అయితే ఇప్పుడు స్లో అయినట్టు తెలుస్తోంది. సోమవారం నుంచి సాధారణంగానే కలెక్షన్లు తగ్గుతాయి. అది రాను రాను క్రమంగా తగ్గుతున్నాయి. శుక్రవారం కోటిన్నర మాత్రమే వసూలు చేసింది.

34
చెన్నై లవ్‌ స్టోరీ టోటల్‌ కలెక్షన్లు

`చెన్నై లవ్‌ స్టోరీ` ఎనిమిది రోజులు పూర్తి చేసుకుంది. ఇప్పటి వరకు ఈ చిత్రం రూ.32.75 కోట్లు ఇండియన్‌ గ్రాస్‌ కలెక్ట్ చేయగా, 28.55కోట్ల నెట్‌ రాబట్టింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ.37.28కోట్లు వచ్చాయి.  ఇది కిరణ్‌ అబ్బవరం కెరీర్‌లోనే సెకండ్‌ హైయ్యెస్ట్ కావడం విశేషం. ఆయన గతంలో నటించిన `క` మూవీ రూ.38కోట్లు రాబట్టింది. దీన్ని శనివారంతో `చెన్నై లవ్‌ స్టోరీ` దాటేస్తుందని చెప్పొచ్చు. ఇక `కే ర్యాంప్‌` మూవీ రూ.27కోట్లు రాబట్టినట్టు సమాచారం. ఇక శనివారం, ఆదివారం ఈ మూవీకి కలెక్షన్లు పెరుగుతాయి. నలభై కోట్లు దాటేస్తుంది. ఓ రకంగా ఇది కిరణ్‌ అబ్బవరం కెరీర్‌లోనే అత్యధిక కలెక్షన్లు సాధించే మూవీగా నిలవబోతుందని చెప్పొచ్చు.

44
బ్రేక్‌ ఈవెన్‌ దాటి లాభాల్లో చెన్నై లవ్‌ స్టోరీ

ఇదిలా ఉంటే ఈ సినిమాకి అయిన బడ్జెట్‌ రూ.30కోట్లు. థియేట్రికల్‌ బిజినెస్‌ పరంగా బ్రేక్‌ ఈవెన్‌ టార్గెట్‌ రూ.16కోట్లు అని సమాచారం. ఈ లెక్కన `చెన్నై లవ్‌ స్టోరీ` ఇప్పటికే బ్రేక్‌ ఈవెన్‌ దాటింది. లాభాల్లోకి వెళ్తుంది. ఇదిలా ఉంటే చిత్ర బృందం చెప్పే లెక్కల ప్రకారం ఈ సినిమా ఇప్పటికే యాభై కోట్లు దాటినట్టు సమాచారం. ఏదేమైనా ఈ సినిమా మంచి హిట్‌ అయ్యిందని, నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టబోతుందని చెప్పొచ్చు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories