కాన్స్ 2025లో తెలుగు సినిమా సంచలనం.. రెడ్‌ కార్పెట్‌ స్క్రీనింగ్‌, ఆ మూవీ ఏంటంటే?

Published : May 20, 2025, 07:49 PM IST

తెలుగు సినిమాకి అరుదైన గౌరవం దక్కింది. `ఎం4ఎం` అనే తెలుగు మూవీ కాన్స్ లో ప్రదర్శించబడింది. ఈ టీమ్‌ రెడ్‌ కార్పెట్‌ పై సందడి చేయడం విశేషం. 

PREV
15
కాన్స్ లో తొలి తెలుగు సినిమా సందడి

ఆస్కార్‌ అవార్డుల తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఫిల్మ్ ఫెస్టివల్‌ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల. ఫ్రాన్స్ వేదికగా ఈ వేడుక జరుగుతుంది. ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది సినిమా తారలు ఇందులో సందడిచేస్తారు. హీరోయిన్లు తమదైన ట్రెండీ, ట్రెడిషన్‌ వేర్స్‌ తో రెడ్‌ కార్పెట్‌పై వాక్‌ చేస్తూ ఆకట్టుకుంటారు. పలు సినిమా టీమ్‌లు సైతం ఇందులో పాల్గొంటాయి. ఆయా సినిమాలు కాన్స్ లో ప్రత్యేకంగా స్క్రీనింగ్‌ జరుపుతుంటాయి. వీటికి అవార్డులు కూడా ఉంటాయి. అయితే ఈ సారి తెలుగు సినిమా కాన్స్ లో సందడి చేసింది.

25
ఎం4ఎం సినిమా కాన్స్ లో స్క్రీనింగ్‌

ఈ క్రమంలో మన తెలుగు నుంచి కాన్స్ లో స్క్రీనింగ్‌ అయిన సినిమాలు లేవు. ఇప్పుడు ఒక చిన్న సినిమా సంచలనం సృష్టించింది. `ఎం4ఎం`(మోటివ్‌ ఫర్‌ మర్డర్‌) అనే మూవీ కాన్స్ లో స్క్రీనింగ్‌ కావడం విశేషం. ఇలా 2025 కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో మన తెలుగు సినిమా మ‌న ఘనతను ప్రపంచానికి చాటిచెప్పింది. జో వర్మ నటించిన మోహన్ వడ్లపట్ల రూపొందించిన ‘ఎం4ఎం’ మూవీ కేన్స్‌లోని ప్రెస్టీజియస్ PALAIS-C థియేటర్‌లో రెడ్ కార్పెట్ స్క్రీనింగ్ జరిగింది. ఈ వేడుకకు అంతర్జాతీయ ప్రేక్షకులు భారీ సంఖ్యలో హాజరయ్యారు.

35
కాన్స్ లో సందడి చేసిన జో శర్మ, మోహన్‌ వడ్లపట్ల

తెలుగు చిత్రసీమ తరపున దర్శకుడు మోహన్ వడ్లపట్లతో పాటు అమెరికాకు చెందిన నటి జో శర్మ గౌరవంగా రెడ్ కార్పెట్‌పై మెరిశారు. ప్రదర్శన అనంతరం ప్రేక్షకులు హర్షధ్వనాలు చేయడంతో పాటు, విమర్శకులు, సినీ అభిమానుల నుంచి ప్రశంసలు లభించాయి. ఇది తెలుగు సినిమాకు కాన్స్‌లో దక్కిన అరుదైన ఘనత.

45
కాన్స్ లో స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచిన జో శర్మ

ఇటీవల అంతర్జాతీయంగా మంచి గుర్తింపు పొందుతున్న జో శర్మ, ఈ ఈవెంట్‌లో దుబాయ్, ఢిల్లీలోని ప్రముఖ డిజైనర్లు రూపొందించిన దుస్తులు ధరించి అందరి దృష్టిని ఆకర్షించారు. ఆమె ఫ్యాషన్ సెన్స్, నటనా ప్రతిభకు అక్కడి మీడియా ప్రశంసలు కురిపించింది.

మోహన్ మీడియా క్రియేషన్స్, మ్యాక్‌విన్ గ్రూప్ USA సంయుక్తంగా నిర్మించిన` M4M` కేన్స్ 2025లో ప్రదర్శించిన ఏకైక తెలుగు చిత్రం కావడం విశేషం. ఈ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ కథ అంతర్జాతీయ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కథన బలంతో పాటు సినిమాటిక్ ప్రెజెంటేషన్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

55
కాన్స్ లో తెలుగు సినిమాకి అరుదైన గౌరవం

గత కొన్నేళ్లుగా తెలుగు సినిమాకు కాన్స్‌లో ఊరిస్తున్న ఈ అరుదైన గౌర‌వం, M4M మూవీకి ద‌క్క‌డంతో ఈ ప్రీమియర్ తెలుగు చలనచిత్ర చరిత్రలో గొప్ప ఘట్టంగా నిలిచింది. టాలీవుడ్ నిర్మాతగా మంచి గుర్తింపు ఉన్న‌ మోహన్ వడ్లపట్ల, ఈ చిత్రంతో దర్శకుడిగా ఇప్పుడు అంతర్జాతీయ గుర్తింపు పొందారు. జో శర్మ అభినయం ప్రపంచ స్థాయిలో ప్రశంసలందుకుంది. త్వరలో ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories