Published : May 20, 2025, 06:34 PM ISTUpdated : May 20, 2025, 06:42 PM IST
78వ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో నటి రుచి గుజ్జార్ ప్రధాని మోడీ బొమ్మ ఉన్న హారం ధరించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆమె హారం గురించి చాలా చర్చ జరుగుతోంది. ఆమె ఫోటోలు వైరల్‌గా మారాయి.
కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రపంచ వ్యాప్తంగా నటీమణులు, మోడల్స్ డిజైనర్ గౌన్లు వేసుకుని సందడి చేస్తారు. అందరిని ఆకట్టుకుంటారు. అయితే కొందరు మాత్రం చాలా ప్రత్యేకంగా నిలుస్తారు. మన ఇండియన్ నటి రుచి గుజ్జార్.. రూపా శర్మ డిజైన్ చేసిన బంగారు లెహంగా ధరించారు. ఇప్పుడు చర్చనీయాంశంగా మారారు.
27
జైపూర్ ట్రెడిషన్‌ని అంతర్జాతీయ వేదికపై ప్రదర్శన
ఈ లెహంగాలో క్లిష్టమైన మిర్రర్ వర్క్, సాంప్రదాయ గోటా పట్టి, అందమైన ఎంబ్రాయిడరీ ఉన్నాయి. జైపూర్ ప్రసిద్ధి చెందిన కళా నైపుణ్యాన్ని ప్రపంచ వేదికపై చూపించింది రుచి గుజ్జార్.
37
రుచి గుజ్జార్ వైపే అందరి చూపు
రుచి గుజ్జార్ లెహంగాతో జరిబారి రామ్ డిజైన్ చేసిన బ్లౌజ్ ధరించారు. ఆమె బంధని దుపట్టా, గోటా పట్టితో అలంకరించబడి, రాజస్థాన్ గొప్ప వస్త్ర చరిత్రను ప్రతిబింబిస్తుంది. కాన్స్ లో ఇది అందరి దృష్టిని ఆకర్షించింది. ఆమె వైపే అందరి చూపు నెలకొంది.
తన దుపట్టా గురించి రుచి మాట్లాడుతూ, "ఈ దుపట్టా ధరించినప్పుడు నేను రాజస్థాన్ ఆత్మను చుట్టుకున్నట్లు అనిపించింది" అని అన్నారు.
57
హారంలో మోడీ బొమ్మ స్పెషల్ ఎట్రాక్షన్
రుచి గుజ్జార్ తన దుస్తులతో పాటు ప్రధాని మోడీ బొమ్మ ఉన్న హారం ధరించారు. "ఇది ఆభరణాలకు మించి, శక్తి, దార్శనికత, ప్రపంచ వేదికపై భారతదేశ ఉదయాన్ని సూచిస్తుంది" అని ఆమె అన్నారు. ఆమె ఈ దెబ్బతో ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయిపోయిందని చెప్పొచ్చు. ఇండియన్ మీడియాలో ఆమె సంచలనంగా మారింది.
67
సాఫ్ట్ వేర్ నుంచి యాక్టివ్ వైపు రుచి గుజ్జార్
రుచి గుజ్జార్ రాజస్థాన్‌లోని జుంఝును జిల్లాకు చెందినవారు. జైపూర్‌లోని మహారాణి కళాశాల నుండి బిబిఏ పూర్తి చేశారు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా కెరీర్ ప్రారంభించి, మోడలింగ్, నటనలోకి అడుగుపెట్టారు.
77
సాంగ్ ఆల్బమ్స్ లో రుచి గుజ్జార్
రుచి గుజ్జార్ మోడల్, నటి. ఆమె అమన్ వర్మతో కలిసి నటించిన 'ఏక్ లడ్కీ' పాటకు ప్రసిద్ధి చెందారు. 'హెలి మే చోర్' అనే హర్యానా పాటలో కూడా నటించారు. బాలీవుడ్ ప్రాజెక్టుల్లో పనిచేస్తున్నట్లు సమాచారం.