అనుష్క నుంచి తమన్నా వరకు.. వీళ్లంతా స్టార్ హీరోయిన్లు ఎలా అయ్యారో తెలుసా, ఆ ఒక్కటీ లేకుంటే కష్టమే

Published : Sep 26, 2025, 03:43 PM IST

సమంత, అనుష్క శెట్టి, తమన్నా లాంటి హీరోయిన్లు టాలీవుడ్ లో అగ్ర నటీమణులుగా ఎలా మారారు.. వారి కెరీర్ ని మార్చేసిన చిత్రాలు ఏంటి అనేది ఈ కథనంలో తెలుసుకుందాం. 

PREV
18
టాలీవుడ్ స్టార్ హీరోయిన్లు

తెలుగు చిత్ర పరిశ్రమలో నటీమణులు అవకాశాలు అందుకోవడం మాత్రమే కాదు.. అవకాశాలు దక్కాక ఆ క్రేజ్ ని నిలబెట్టుకోవడం కూడా కష్టమే. స్టార్ హీరోయిన్ గా మారి టాలీవుడ్ లో ఎక్కువ కాలం కొనసాగే అవకాశం అందరికీ దక్కదు. కొందరి హీరోయిన్లకు కెరీర్ ఆరంభంలోనే క్రేజ్ వచ్చేస్తుంది. మరికొందరికి కాస్త టైం పడుతుంది. అనుష్క, త్రిష, కాజల్, శృతి హాసన్, సమంత లాంటి హీరోయిన్లు స్టార్ లుగా ఎదగడానికి కారణం ఏంటి ? వారి కెరీర్ ని మలుపు తిప్పిన అంశాలు ఏంటి ? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

28
అనుష్క

అనుష్క శెట్టి 2005లో సూపర్ అనే చిత్రంతో హీరోయిన్ ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రంలోనే అనుష్క ఒక రేంజ్ లో గ్లామర్ షో చేసింది. సూపర్ మూవీ యావరేజ్ కావడంతో అనుష్కకి దక్కాల్సిన గుర్తింపు దక్కలేదు. గ్లామర్ షో వల్ల యువతలో కొంత మేరకు క్రేజ్ వచ్చింది. అయితే అనుష్క కెరీర్ ని పూర్తిగా మార్చేసిన చిత్రం మాత్రం విక్రమార్కుడు అనే చెప్పాలి. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అనుష్క రవితేజకి జోడిగా నటించింది. ఈ మూవీలో అనుష్క చిలిపితనం ఉన్న అమ్మాయిగా బాగా నటించింది. సాంగ్స్ లో గ్లామర్ షోకి అవకాశం కూడా దక్కింది. మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో అనుష్క పేరు ఇండస్ట్రీలో మారుమోగింది. ఈ మూవీ తో అనుష్క టాలీవుడ్ లో స్టార్ గా మారిపోయింది.

38
త్రిష

త్రిష తమిళంలో కొన్ని చిత్రాల్లో నటించిన తర్వాత తెలుగులో నీ మనసు నాకు తెలుసు అనే చిత్రంలో నటించింది. తరుణ్ కి జోడిగా నటించిన ఆ మూవీతో త్రిషకి ఏమాత్రం గుర్తింపు దక్కలేదు. ఆ తర్వాత ప్రభాస్ కి జోడీగా త్రిష వర్షం చిత్రంలో నటించింది. ఈ మూవీలో త్రిష గ్లామర్, ప్రభాస్ తో ఆమె కెమిస్ట్రీ ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకున్నాయి. దీనితో ఒక్కసారిగా వర్షం మూవీతో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. వర్షం తర్వాత త్రిష టాలీవుడ్ లో అగ్ర హీరోలందరితో నటించింది. నువ్వొస్తానంటే నేనొద్దంటానా, అతడు, కృష్ణ లాంటి సూపర్ హిట్ చిత్రాలు అందుకుంది.

48
కాజల్

కాజల్ అగర్వాల్ 2007లో టాలీవుడ్ లోకి లక్ష్మీ కళ్యాణం చిత్రంతో అడుగుపెట్టింది. రెండేళ్లపాటు తెలుగులో పలు చిత్రాల్లో నటించింది. చందమామ తప్ప ఇతర చిత్రలేవీ వర్కౌట్ కాలేదు. చందమామ మూవీతో కూడా కాజల్ కి అంతగా గుర్తింపు అయితే రాలేదు. కానీ ఎప్పుడైతే మగధీర చిత్రం పడిందో.. కాజల్ జాతకమే మారిపోయింది. మగధీర తర్వాత కాజల్ టాలీవుడ్ లో మాత్రమే కాదు సౌత్ మొత్తం తిరుగులేని హీరోయిన్ గా మారిపోయింది. రాంచరణ్, అల్లు అర్జున్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, చిరంజీవి, బాలయ్య, ప్రభాస్, ఎన్టీఆర్ ఇలా క్రేజీ హీరోలందరితో నటించి విజయాలు అందుకుంది.

58
ఇలియానా

టాలీవుడ్ లో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ అయిపోయిన వారిలో ఇలియానా ముందు వరుసలో ఉంటుంది. దేవదాసు చిత్రంతో ఇలియానా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత పోకిరి మూవీతో ఇండస్ట్రీ షేక్ అయ్యే భారీ విజయం దక్కించుకుంది. ఈ మూవీలో ఇలియానా గ్లామర్ కి యువత ఊగిపోయారు. ఫలితంగా ఇలియానా ఓవర్ నైట్ లో టాలీవుడ్ లో హైయెస్ట్ పెయిడ్ హీరోయిన్ గా మారిపోయింది.

68
తమన్నా

మిల్క్ బ్యూటీ తమన్నా శ్రీ అనే చిత్రంతో టాలీవుడ్ కి పరిచయం అయింది. గుర్తింపు పొందాడని, ఆ తర్వాత స్టార్ గా ఎదగడానికి తమన్నాకి చాలా సమయమే పట్టింది. 2007లో హ్యాపీ డేస్ చిత్రంతో తమన్నాకి మంచి గుర్తింపు దక్కింది. ఆ తర్వాత తమన్నాకి అవకాశాలు క్యూ కట్టాయి. 2012లో విడుదలైన రాంచరణ్ రచ్చ చిత్రంతో తమన్నా టాలీవుడ్ లో టాప్ లీగ్ లో చేరిపోయింది. ఇప్పటికీ మిల్కీ బ్యూటీ హవా కొనసాగుతోంది.

78
శృతి హాసన్

కమల్ హాసన్ వారసురాలిగా శృతి హాసన్ చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. హీరోయిన్ గా శృతి హాసన్ అనగనగా ఓ ధీరుడు, లక్, 7th సెన్స్, 3 లాంటి చిత్రాల్లో నటించింది. ఆమె నటించిన సినిమాలన్నీ ఫ్లాప్ అవుతూ వచ్చాయి. దీనితో శృతి హాసన్ పై ఐరన్ లెగ్ అనే ముద్ర పడింది. కానీ పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ చిత్రంలో అవకాశం దక్కాక ఆమె కెరీర్ పూర్తిగా మారిపోయింది. గబ్బర్ సింగ్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో శృతి హాసన్ సౌత్ లో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది.

88
సమంత - దూకుడు

సమంత ఏమాయ చేశావే చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమైంది. తొలి మూవీతోనే సూపర్ హిట్ అందుకుంది. ఏమాయ చేశావే మూవీ రొమాంటిక్ లవ్ స్టోరీ. దీనితో సమంతకి మాస్ ఆడియన్స్ లో రీచ్ దక్కలేదు. సమంతని పూర్తి స్థాయిలో స్టార్ గా మార్చేసిన చిత్రం దూకుడు. మహేష్ బాబుకి జోడిగా నటించిన దూకుడు మూవీతో సమంత స్టార్ హీరోయిన్ గా ఎదిగారు.

Read more Photos on
click me!

Recommended Stories