తెలంగాణ హైకోర్టులో పవన్ కళ్యాణ్ ఓజీ చిత్రానికి ఎదురుదెబ్బ తగిలింది. రిలీజ్ కి ముందు హైకోర్టు షాక్ ఇవ్వడంతో ఫ్యాన్స్ లో ఆందోళన నెలకొంది. అసలు ఇంతకీ హైకోర్టు ఏం చేసిందో ఈ కథనంలో తెలుసుకోండి.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ చిత్రం గ్రాండ్ రిలీజ్ కి అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. బుధవారం సాయంత్రం నుంచే ప్రీమియర్ షోల హంగామా మొదలవుతుంది. పవన్ కళ్యాణ్ సినిమాకి సరైన కాంబినేషన్ కుదిరితే ఆ హైప్ ఎలా ఉంటుందో ఓజీ చిత్రం చూపిస్తోంది. కనీవినీ ఎరుగని అంచనాలతో ఓజీ రిలీజ్ అవుతోంది. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని డివివి దానయ్య నిర్మించారు.
25
రిలీజ్ కి అంతా రెడీ
రిలీజ్ కి అంతా రెడీ అయింది. అడ్వాన్స్ బుకింగ్స్ బద్ధలవుతున్నయి. అంతా సాఫీగా జరుగుతోంది అనుకుంటున్న తరుణంలో ఓజీ చిత్రానికి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణలో టికెట్ ధరల పెంపు తో పాటు ప్రీమియర్ షోలు ప్రదర్శించుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే.
35
ఊహించని షాకిచ్చిన హైకోర్టు
అయితే ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులని హైకోర్టు తాజాగా సస్పెండ్ చేసింది. ఈ మేరకు జస్టిస్ శ్రవణ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇది ఓజీ చిత్రానికి ఏమాత్రం ఊహించని ఎదురుదెబ్బ అనే చెప్పాలి. ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో చాలా మంది ప్రీమియర్ షోల టికెట్స్ బుక్ చేసుకున్నారు. కోర్టు ఉత్తర్వులతో ఆ టికెట్స్ పరిస్థితి ఏంటి అనే ప్రశ్న మొదలైంది.
హై కోర్టు ఉత్తర్వులపై తెలంగాణ ప్రభుత్వం, ఓజీ చిత్ర యూనిట్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. తెలుగు రాష్ట్రాల్లో రాత్రి 10 గంటల నుంచి ప్రీమియర్ షోలు ప్రారంభం కానున్నాయి. సరిగ్గా రిలీజ్ కి ముందు ఈ టెన్షన్ ఏంటి అంటూ ఫ్యాన్స్ ఆందోనళ వ్యక్తం చేస్తున్నారు.
55
ప్రీమియర్ షోలు చూడబోతున్న సెలెబ్రిటీలు
ఓజీ మూవీలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించారు. ప్రకాష్ రాజ్, శ్రీయా రెడ్డి, అర్జున్ దాస్ కీలక పాత్రల్లో నటించారు. ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటించారు. ఓజీ ప్రీమియర్ షోలు చూసేందుకు టాలీవుడ్ లో పలువురు సెలెబ్రిటీలు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. అగ్ర దర్శకులు త్రివిక్రమ్, పవన్ తనయుడు అకీరా, ఓజీ చిత్ర యూనిట్ హైదరాబాద్ లోని పలు థియేటర్స్ లో ప్రీమియర్ షోలు చూడబోతున్నట్లు తెలుస్తోంది.