మెగాస్టార్ చిరంజీవితో సినిమా అంటే ఏ హీరోయిన్ అయినా ఎగిరి గంతేసి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సిందే. ఆయనతో సినిమా ఛాన్స్ రాకపోవడంతో బాధపడిన హీరోయిన్లు కూడా ఉన్నారు. చిరంజీవి జంటగా అవకాశం రాకపోవడంతో బాధగా ఉంది అని వెల్లడించిన తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా?
తెలుగు తెరపై తళుక్కుమన్న హీరోయిన్లలో రాశి ది ఓ ప్రత్యేక స్థానం. బాలనటిగా తన సినీ ప్రయాణం ప్రారంభించిన రాశి, హీరోయిన్‌గా అనేక విజయవంతమైన సినిమాలతో ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారు. రీసెంట్ గా ఓ మీడియా ఛానెల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆమె తన కెరీర్‌తో పాటు, ఎన్నో సంఘటనలను గురించి పంచుకున్నారు. రాశి మాట్లాడుతూ "చైల్డ్ ఆర్టిస్టుగా నేను అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, కమల్ హాసన్ గారిలాంటి లెజెండ్స్‌తో నటించాను. ఆ అనుభవాలు నన్ను పక్కా నటిగా తీర్చిదిద్దాయి.
24
అదొక్కటే లోటు
ఇక హీరోయిన్ గా అవకాశాలు వచ్చాయి. వరుస సక్సెస్‌లు అందుకున్నాను. చిరంజీవి గారితో జోడీగా నటించాల్సిన అవకాశం కూడా వచ్చింది. కానీ కొన్ని కారణాల వల్ల అది జరగలేదు" అని ఆమె వివరించారు. కెరీర్ లో చాలామంది హీరోలతో నటించిన ఆనందం ఉంది, కానీ మెగాస్టార్ చిరంజీవితో స్క్రీష్ షేర్ చేసుకోలేదన్న బాధ ఉందని ఆమె వెల్లడించారు. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నటించడం చాలాసంతోషంగా ఉందని ఆమె అన్నారు.
34
పవన్ కళ్యాణ్ ఎటువంటివాడంటే?
పవన్ కల్యాణ్‌తో చేసిన ‘గోకులంలో సీత’ సినిమా తన కెరీర్‌లో మరిచిపోలేని ప్రాజెక్టుగా చెప్పిన రాశి, "ఆయన అప్పట్లో ఎక్కువగా మాట్లాడేవారు కాదు. కానీ మా పాప మొదటి బర్త్‌డేకి ఆహ్వానించేందుకు వెళ్లినప్పుడు ఎంతో ఆప్యాయంగా మాట్లాడారు. ఆయన అంతలా మాట్లడతారని ఊహించలేదు. సరదాగా ‘గోకులంలో సీత 2’ తీస్తే మళ్లీ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని కూడా చెప్పాను" అంటూ తన అనుభవాన్ని పంచుకున్నారు.
ఇక మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ సినిమా ‘రంగస్థలం’ గురించి మాట్లాడుతూ, "ఆ సినిమాలో 'రంగమ్మత్త' పాత్ర కోసం ముందుగా నన్నే సంప్రదించారు. కానీ ఆ పాత్రలో కొన్ని సీన్లు నాకుండే ఇమేజ్‌కు తగనట్టు అనిపించాయి. పైగా నా ముఖం ఆ పాత్రకు సరిపోదేమోనని కూడా అనిపించింది. అందుకే చేసేందుకు ససేమిరా అన్నాను. ఆ తరువాత ఆ పాత్రను అనసూయ చేశారు. ఆమె చాలా బాగా చేశారు. ఆ పాత్రకు తను కరెక్ట్‌గా సరిపోయారు" అని తెలిపారు. ఇలా ఇంటర్వ్యూలో మరెన్నో విషయాలు ఆమె మాట్లాడారు. "నా సినీ ప్రయాణం నన్ను చాలా నేర్పింది. ప్రేక్షకుల ప్రేమకి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను" అని ఆమె అన్నారు.