
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తోన్న `ఓజీ` మూవీ మరో వారం రోజుల్లో ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. దీంతో సినిమా ప్రమోషన్స్ వేగవంతం చేసింది టీమ్. ఇప్పటికే పాటలతో ఆకట్టుకున్నారు. గ్లింప్స్ తో అలరించారు. త్వరలోనే ట్రైలర్ రాబోతుంది. ఈ క్రమంలో ఇప్పుడు ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చాడు పవన్. `ఓజీ` మూవీలో ఆయన పాట పాడారు. ఇటీవల కాలంలో పవన్ వరుసగా పాటలు పాడుతున్నారు. చివరగా `హరి హర వీరమల్లు`లోనూ పాట పాడారు. ఇప్పుడు `ఓజీ`లోనూ ఆయన పాట పాడటం విశేషం. అయితే ఇందులో సర్‌ప్రైజ్ ఏంటంటే ఈ పాట జపాన్ భాషలో ఉండటం విశేషం.
`వాషి ఓ వాహి` అంటూ సాగే పాటని ఆలపించారు పవన్ కళ్యాణ్. విలన్ ఓమీ(ఇమ్రాన్ హష్మి)కి వార్నింగ్ ఇచ్చే క్రమంలో ఈ పాట వస్తుందని తెలుస్తోంది. ముందుగానే ఈ పాటలో ఆ విషయాలను తెలిపారు పవన్. `మై డియర్ ఓమీ, ఎగిరెగిరి పడుతున్నావ్. నీలాంటి వాడిని ఎలా నేలమీదకు దించాలో నాకు బాగా తెలుసు. చిన్నప్పుడు నా గురువు చెప్పిన హయికు చెప్తాను విను` అంటూ ఈ పాటని స్టార్ట్ చేశారు పవన్.
`వాషి ఓ వాషి.. ` అంటూ సాగే పాటని ఆలపించారు. ఇది జపాన్ లాంగ్వేజ్‌లో పాడిన పాట కావడంతో వినడానికి వింతగా ఉన్నా, పవన్ కళ్యాణ్ పాడటంతో కొత్తగా, క్రేజీగా ఉంది. అభిమానులను అలరించేలా ఉంది. అయితే విలన్‌కి వార్నింగ్ ఇచ్చే సమయంలో వచ్చే పాట కావడంతో సినిమాలో ఫ్యాన్స్ ఎంజాయ్ చేసేలా ఉంటుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇందులో పవన్ ఏం చెప్పాడంటే.. `వాషి` అంటే డేగ. దాన్ని హెచ్చరిస్తూ, డేగ ఓ డేగ, అడివి డేగను చంపాలంటే ముందు దాని రెక్కలను కత్తిరించాలి` అని ఉంది. అంటే విలన్‌ని చంపాలంటే ముందు అతని చుట్టూ ఉన్న బలగాన్ని, బలన్ని చంపాలి అనే అర్థంలో ఈ పాట పాడినట్టుగా తెలుస్తోంది.
తాజాగా విడుదలైన 'వాషి యో వాషి' గత పాటలను మించి శక్తివంతంగా ఉంది. 'ఓజీ'లో పవన్ కళ్యాణ్ వింటేజ్ స్టైలిష్ ఆరాకు సరిగ్గా సరిపోయేల ఉంది. థమన్ అద్భుతమైన స్వరకల్పన, పవన్ కళ్యాణ్ అద్భుతమైన గాత్రం కలిసి 'వాషి యో వాషి' పాట అభిమానులను విందు భోజనంలా ఉంది. ఈ పాటకు అద్భుతమైన స్పందన లభిస్తోంది. ప్రతి బీట్ అభిమానుల హార్ట్ బీట్ ని పెంచేలా ఉంది. ఇప్పటికే 'ఓజీ' చిత్రంపై భారీ అంచనాలు నెలకొనగా, 'వాషి యో వాషి' గీతం ఆ అంచనాలను మరింత పెంచుతుంది.
'వాషి యో వాషి' పాటతో సినిమా పట్ల అభిమానుల ఆసక్తి, ఉత్సాహం రెట్టింపు అయ్యాయి. నిజమైన బాక్సాఫీస్ 'ఓజీ' పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను వెండితెరపై చూసేందుకు అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. గతంలో ఎన్నడూ లేనంత ఉత్సాహంగా వారు ఉన్నారు. 2025లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రంగా 'ఓజీ' పేరు ఇప్పటికే మారుమోగిపోతోంది. సినీ వర్గాలతో పాటు, ట్రేడ్ పండితుల్లో సైతం.. ఈ చిత్రం గురించి తెగ చర్చ జరుగుతోంది. దర్శకుడు సుజీత్ ఈ చిత్రాన్ని ఒక సినిమాటిక్ తుఫానుగా రూపొందిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఓజాస్ గంభీరగా కనిపించనునన్ 'ఓజీ' చిత్రంలో ఇమ్రాన్ హష్మీ, ప్రియాంక అరుళ్ మోహన్, ప్రకాష్ రాజ్, శ్రియా రెడ్డి వంటి తారాగణం ఉంది. ఈ చిత్రం సెప్టెంబర్ 25, 2025న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది.