కెరీర్ ను చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నాడు టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా. స్టార్ హీరోలను కూడా పక్కకు నెట్టి.. IMDb ర్యాంక్స్ లో టాప్ 10 లోకి వచ్చేశాడు.
పాన్ ఇండియా రేంజ్ లో దూసుకుపోతున్నాడు యంగ్ హీరో తేజ సజ్జా. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేసిన తేజ, హీరోగా కెరీర్ స్టార్ట్ చేసిన తరువాత ఒక్కో అడుగు చాలా జాగ్రత్తగా వేస్తూ వెళ్తున్నాడు. చైల్డ్ ఆర్టిస్టులుగా కెరీర్ స్టార్ట్ చేసి హీరోలు అయిన వారిలో చాలామంది ఇండస్ట్రీలో నిలబడలేకపోయారు. కాని తేజ సర్జా మాత్రం ప్రతీ అడుగు జాగ్రత్తగా వేస్తూ.. మంచి మంచి సినిమాలతో దూసుకుపోతున్నాడు. జాంబిరెడ్డి, బేబి, హనుమాన్, ఇలా తేజ మూవీస్ అన్నీ సూపర్ హిట్ అవ్వడంతో తేజకు క్రేజ్ భారీగా పెరిగిపోయింది.
25
100 కోట్ల మిరాయ్
టాలీవుడ్ యువ హీరో తేజ సజ్జా (Teja Sajja) తాజా చిత్రం మిరాయ్ (Mirai) అద్భుతమైన విజయాన్ని సాధించడంతో పాటు, ఆయనకు వ్యక్తిగతంగా అరుదైన గుర్తింపును తీసుకొచ్చింది. సెప్టెంబర్ 12న విడుదలైన ఈ ఫాంటసీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇప్పటికే 100 కోట్ల గ్రాస్‌ను కలెక్ట్ చేయగా, IMDb వారానికోసారి విడుదల చేసే మోస్ట్ పాపులర్ ఇండియన్ సెలబ్రిటీస్ లిస్టులో తేజ సజ్జా ఇండియా వైడ్‌గా 9వ స్థానాన్ని సాధించాడు.
35
టాప్ 10లోకి తేజ
గత వారం ఇదే లిస్టులో 160వ స్థానంలో ఉన్న తేజ, ఈ వారం ఏకంగా 151 స్థానాలు ఎగబాకి 9వ స్థానానికి చేరడం విశేషం. ఆయన నటించిన మిరాయ్ మూవీ విడుదలైన వారంలోనే ఈ స్థాయిలో ర్యాంక్ మెరుగవడం ఈ విజయానికి నిదర్శనం. కార్తీక్ ఘట్టమనేని మిరాయ్ చిత్రానికి దర్శకత్వం వహించగా, ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్, కథనం, యాక్షన్ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఇంకా ఈ IMDb లిస్టులో మొదటి స్థానంలో బాలీవుడ్ యంగ్ హీరో అహాన్ పాండే (Ahaan Panday) నిలిచాడు. అతను నటించిన చిత్రం సయారా ఇటీవల భారీ హిట్ కావడంతో టాప్ స్పాట్ దక్కించుకున్నాడు. మూడో స్థానంలో అనీత్ పడ్డ ఉన్నారు, ఇతనూ అదే సినిమాతో పాపులర్ అయ్యాడు. బాలీవుడ్ సీనియర్ స్టార్ అక్షయ్ కుమార్, తన తాజా చిత్రం జాలి ఎల్.ఎల్.బి 3 ప్రమోషన్స్ నేపథ్యంలో 6వ స్థానాన్ని పొందాడు.
55
తేజ సజ్జా నెక్ట్స్ ప్లాన్
తేజ సజ్జా ప్రస్తుతం మిరాయ్ విజయాన్ని ఆస్వాదిస్తూ, నెక్ట్స్ జెక్ట్‌కు సిద్ధమవుతున్నాడు. గతంలో ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన జాంబీ రెడ్డి సీక్వెల్ సినిమాను తేజ్ చేయబోతున్నట్టు సమాచారం. మొదటి భాగం భారీ విజయాన్ని అందుకుంది. దాంతో రెండో పార్ట్ ను ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సీక్వెల్‌ను కూడా ప్రశాంత్ వర్మనే తెరకెక్కిస్తారా లేదా అనేది త్వరలో స్పష్టమయ్యే అవకాశం ఉంది. ఈ సినిమా ఇంటర్నేషనల్ లెవెల్‌లో రూపొందించబోతున్నారని టాక్ వినిపిస్తోంది. తేజ సజ్జా, చిన్న వయసులో నటుడిగా కెరీర్ ప్రారంభించి, ఇప్పుడు సొంతగా మార్కెట్‌ను క్రియేట్ చేసుకోవడంలో IMDb ర్యాంకింగ్ ఓ మైలురాయిగా నిలిచింది. ఈ ఏడాది ఆయనకు మోస్ట్ డెఫినింగ్ మోమెంట్ ఇదే అనటం లో ఎటువంటి సందేహం లేదు.